Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

మహాబిరి దేవి

మహిళలనిట నడిపె మహబిరిదేవియె
సాయుధముగను తొలిసంగరాన
తెల్లవారి తలల తెంపిరి తెగువతొ
వినుర భారతీయ వీర చరిత

భావము

1857లో తొలి స్వరాజ్య సంగ్రామంలో, మీరట్ ప్రాంతంలో 22 మంది మహిళలను ఏకం చేసి, రాళ్ళు, కత్తులు వంటి సాధారణమైన ఆయుధాలతో బ్రిటీష్ వారిపై విరుచుకపడి, వారి తలలను తెంచిన మహాబిరిదేవి చరిత విను ఓ భారతీయుడా!

చరిత్ర
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ పక్కన ఉన్న ముండ్భర్గా గ్రామానికి చెందిన మహాబిరి దేవి బ్రిటీష్‌వారి మానవ విసర్జితాలను సాటి మానవులు తొలగించరాదంటూ 22 మహిళలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే సమయంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ఆరంభమైనది. ఆంగ్లేయులపై పోరాటానికి సదరు మహిళలను మహాబిరి దేవి సిద్ధం చేశారు. ఆమె నేతృత్వంలోని మహిళల బృందం కత్తులు, రాళ్ళతో బ్రిటీష్ వారిపై విరుచుకుపడినారు. అనేక మందిని హతమార్చారు. మహాబిరిదేవి సహా మహిళలందరూ అమరులైనారు. స్వరాజ్య సాధనకు ప్రాణత్యాగం చేసిన మహాబిరి దేవి చరితార్ధులైనారు.

-రాంనరేష్