Home News దేశ విభజన జరిగినా ముస్లింలు భారత్‌లోనే ఎందుకు ఉండిపోయారు?

దేశ విభజన జరిగినా ముస్లింలు భారత్‌లోనే ఎందుకు ఉండిపోయారు?

0
SHARE

-నూపుర్ జె శర్మ

స్వాతంత్ర్యానంతరం చాలామంది ముస్లింలు భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు: హిందువులు అపరాధ భావనతో నలిగిపోయేలా చేసిన ఒక నిరాధారమైన, కల్పనాత్మక,  చిత్రమైన పరిస్థితి: ముస్లింలు భారత్ లోనే ఉండిపోవాలని ఎంచుకోవటం, వాళ్ళ ప్రస్తుత సంతానం, వారసులు భారత్‌లోని సంస్కృతి, సభ్యతలతో, హిందూ అధిక సంఖ్యాకులతో మమేకం అవగలిగితే, ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న ఇస్లాం ఆధారిత ఉగ్రవాదం ఎందుకు పెరిగిందో, తార్కికపరమైన వివరణ ఇవ్వవలసి ఉంటుంది.        

ప్రపంచంలోని హిందువులందరూ శ్రీరామజన్మభూమి గురించి 500 ఏళ్లుగా చేస్తున్న వీరోచిత పోరాటాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు భవ్య రామమందిర నిర్మాణం కోసం చేసిన భూమిపూజతో విజయవంతంగా ముగించారు. గత 5 శతాబ్దాలుగా హిందువులు తమ ఆరాధ్య దైవమైన శ్రీరామ జన్మభూమిలోని ఆరాధనామందిరంపై నియంత్రణ కోసం చేస్తున్న పోరాటం, ఘనంగా ముగిసిన సందర్భంగా, హిందూ ఆత్మాభిమానం, హిందూ సాంస్కృతిక వారసత్వం ఆధారంగా, మనం భారతదేశంలో మతాలకు అతీతంగా విజయోత్సవాలు జరుపుకోవాలి, ఎందుకంటే హిందూ వైభవ సంస్కృతి మాత్రమే మన దేశాన్ని ఒక్క తాటిపై ఇప్పటివరకూ నిలిపి ఉంచింది. కానీ, ఇక్కడ నెలకొన్న ఉదారవాద పర్యావరణ వ్యవస్థ, హిందువులను వారి కల్పనాజనితమైన సెక్యులర్ దేశం అనే భ్రమలను పోషించటమేకాక, అర్థంపర్థంలేని, నిరాధారమైన వాదనలతో లేనిపోని అపరాధభావనతో, తమ వాస్తవమైన హక్కులను ప్రస్తావించకుండా, పొందకుండా చేస్తోంది.

ఇస్లాంవాదులు చేసే ప్రముఖ వాదన ఏమంటే – మన దేశంపై దండెత్తిన ముస్లిం దురాక్రమణదారుల అనాగరిక, ఆటవిక ప్రవర్తన గురించి ఎప్పుడైనా విమర్శలు ఎదురైతే, ఎక్కువైతే, అటువంటి విమర్శలను ప్రక్కన పెట్టి, ప్రస్తుతం ఇక్కడున్న ముస్లిం జనాభా కానీ, వారి పూర్వీకులు గానీ, దేశవిభజన తర్వాత ఇస్లాం మతప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్‌కు వెళ్లిపోయే అవకాశం వచ్చినప్పటికీ, ఇక్కడే ఉండిపోవాలని ఎంచుకున్నారు కదా. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇండియాలోని ముస్లిం పౌరులను లేదా వాళ్ళ పూర్వీకులను, అప్పటి ముస్లిం దురాక్రమణదారుల దుశ్చర్యలను గురించి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, ఏమన్నా అంటే, మేము కూడా భారత్‌లో హిందువులతో పాటు సమానం అని అడ్డగోలుగా వాదిస్తారు.

సిద్ధాంతపరంగా ఏమైనా అంటే, హిందువులపై అప్పటి ముస్లిం దురాక్రమణదారుల క్రూరత్వానికి, భారత్‌లోని ఇప్పటి ముస్లింలను బాధ్యులను చేయలేమనే వాదన కొంతవరకు నిజమే కావచ్చు. ఒకవేళ ఇక్కడి ముస్లింలు తమ చేతులతో తామే రామమందిరాన్ని కూల్చివేసి, వివాదాస్పద బాబ్రీ కట్టడాన్ని నిర్మాణం చేసి ఉంటే తప్ప, వాళ్ళను కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ముస్లిం దురాక్రమణదారుల దుశ్చర్యలకు బాధ్యులను చేయలేము కదా అనేది వీళ్ళ వాదన.

ఏది ఏమైనా, ఆచరణాత్మకంగా చూస్తే, భారతీయ ముస్లింలు ఎంత లేతగులాబీ వర్ణం పూసుకున్నా (మేము అమాయకులము అన్నప్పటికీ), చారిత్రక వాస్తవాలు మరుగున పడిపోవు కదా. గతంలో ముస్లిం దురాక్రమణదారులు చేసిన అంతులేని అత్యాచారాలు నిజమే కానీ, వాటికి మేము బాధ్యులము కామని, మేము శాంతిప్రియులమని  ఇప్పటి ముస్లింలు అన్నా, అది వాస్తవం కాబోదు. ఎందుకంటే, స్వాతంత్ర్యానంతరం, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా మతకల్లోల్లాలు, ఒక క్రమపద్ధతిలో హిందువుల సామూహికహత్యలు, స్త్రీలపై అత్యాచారాలు, మారణహోమాలు, దమనకాండలు జరిగి ఉండేవి కావు. అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చివేసిన తర్వాత, పాకిస్తాన్‌లో కూడా అల్లర్లు జరిగేవి కావు. కె. కె. మహమ్మద్ సూచించినట్లు, ఒకవేళ, భారతీయ ముస్లింలు, గతంలో ముస్లిం దురాక్రమణదారులు హిందువులపై దాడులు చేసి, దోచుకున్నారు అని నిజంగా భావిస్తే, తర్వాత వాళ్లంతట వాళ్ళు ఈ వివాదాస్పద కట్టడంపై హక్కులను స్వచ్ఛందంగా వదులుకునేవాళ్ళు.

కానీ, అలా జరగలేదు. భవ్య శ్రీరామమందిరానికి భూమిపూజ జరిగిన తర్వాత, నేటివరకూ కూడా ఇస్లాంవాదులు, ఇంకా సాధారణ ముస్లింల నుంచి హిందువులపై దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.  భారతీయ ముస్లింలు ఉదారవాదులు అని ఎన్నిరంగులు వేసుకున్నా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దగ్గర నుంచి ముస్లిం నేతలైన అసదుద్దీన్ ఒవైసీ వరకూ హిందువులకు చేస్తున్న హెచ్చరికలు, బెదిరింపులు, ఆ వాదనలో లొసుగులు ఉన్నాయని, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలియజేస్తున్నాయి. వీళ్ళందరూ భారత్‌లోని ముస్లిం సమాజానికి గల బలమైన నేతలని మనం గమనించాలి. వాళ్ళు ముస్లింల చేత ఎన్నుకోబడి, ముస్లింలచేత ఆరాధించబడుతున్నారు. అందుకే, ముస్లిం జనాభా, ముస్లిం నేతల అభిప్రాయం ప్రకారం నడుచుకోదు అనేది ఎంత హాస్యాస్పదమో, భారత్‌లోని హిందువులలో ప్రధాని మోడీ పేరు ప్రతిధ్వనించటం లేదు అనటం ఎంత అవివేకం.

ఎప్పుడైతే, భారతీయ ముస్లింల స్పష్టమైన, చాలా వాస్తవమైన ప్రతిక్రియ, ఈ కథనాలకి విరుద్ధంగా ఉంటే, అప్పుడు ఉదారవాదులు వాళ్ళ విలక్షణమైన వాదనలు నమ్మించేందుకు, వాళ్ళు తాము ఇక్కడ శాశ్వతమైన బాధితులు అనే భ్రమలను కల్పిస్తారు.

ఇండియన్ ముస్లింలు వాళ్ళకు అవకాశం వచ్చినా కూడా పాకిస్తాన్‌కు పోకుండా, తమ విధేయతతో, భారత్ అంటే భక్తి, శ్రద్ధలతో భారత్‌లోనే ఉండిపోయి, తమలో దేశభక్తి, గొప్ప ఆశయాలు, లేదా హిందూ సంస్కృతి, హిందూ ధర్మం పట్ల ఉదారత (ఓర్పు) ఉన్నట్లుగా వ్యక్తం చేయటం, ఇటువంటి భ్రమలను కలిగించే ముఠావాళ్ళు చేసే ఒక చిత్రమైన వాదన, ఏ మాత్రం సరైనదీ కాదు, వాస్తవమూ కాదు. ఇక్కడే ఉండిపోవాలని ఎంచుకున్న ముస్లింల పట్ల, సెక్యులర్ భారత్ అనుచితంగా వ్యవహరిస్తోందని చేసే కధనాలు, ముస్లింలు విసిరే కఠినమైన, తీవ్రమైన, వేగవంతమైన హెచ్చరికలు, బెదిరింపులకు విరుద్ధంగా ఉంటున్నాయి. నిజానికి, ఈ కథనాలు, ఇంకొక అడుగు ముందుకే పోతున్నాయి. చాలా మంది ముస్లింలు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి, ముస్లిం సమాజం మొత్తం దేశభక్తి కలిగి ఉన్నది, భారత సంస్కృతి పట్ల, భారత విధానాల పట్ల కృతజ్ఞతతో ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారు, కానీ, వాస్తవచరిత్ర అలా లేదు, ఇందుకు విరుద్ధంగా ఉన్నది.

ఏది ఏమైనా, ఇటువంటి వాదనకు ఏమైనా బలం ఉన్నదా? నిజంగా ఎక్కువ మంది ముస్లింలు దేశ విభజన తర్వాత, ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారా? అంకెల వాస్తవాలు ఏమి తెలియజేస్తున్నాయి?

1946లో జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో, ముస్లింలలో అధికశాతం, ముస్లింలీగ్‌కు నిస్సందేహంగా ఓటు వేశారు. దానితో, అప్పటి భారత్ భూభాగం లోపలే ఇస్లామిక్ రాజ్యం కావాలన్న కోరిక తీవ్రతరమై, మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టింది. భారత స్వాతంత్ర్యానంతరం, హిందువులు, ముస్లింలు కలిసి ఒకే దేశంలో నివసించటం కుదరదు అని ముస్లింలీగ్ నిర్మొహమాటంగా ప్రకటించింది. అందుకని ఈ దేశం నుంచి ముస్లింలకు ఒక ప్రత్యేక రాజ్యం కావలసినదేనని పట్టుబట్టారు.

1946లో జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో 87% స్థానాలు ముస్లింలీగ్ గెలుచుకున్న మాట వాస్తవం. ఈ క్రింది పట్టిక చూస్తే, తమకు ఒక మతపరమైన ఇస్లామిక్ రాజ్యం కావాల్సిందే అని ఎంతమంది ముస్లింలు రాజకీయంగా పట్టుబట్టారో స్పష్టంగా తెలుస్తుంది.

మూలం: చికాగో యునివర్సిటి

1937 & 1946 లలో ముస్లింలీగ్ గెలిచిన స్థానాల తులనాత్మక పట్టిక పైన చూపించబడింది. 1946లో జిన్నా-ముస్లింలీగ్ అనేక స్థానాలలో గెలుపు సాధించింది. ప్రతి రాష్ట్రంలోనూ ముస్లింలీగ్‌కు ముస్లిం ప్రజాదరణ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. బీహార్‌లో ముస్లింలీగ్ 1937లో శూన్యస్థానం నుంచి, 1946లో 40 స్థానాలలో 34 గెలిచింది. అదే మద్రాస్ ప్రాదేశికంలో, 1937లో 9 స్థానాల నుంచి, 1946లో 29 స్థానాల వరకూ గెలుచుకోగలిగింది. ఇదే తరహాలో ముస్లింలు, ముస్లింలీగ్ వైపు మొగ్గిన ధోరణి మనకు అప్పటి వివిధ రాష్ట్రాలలో, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల గణాంకాలలో కనిపిస్తుంది.

ఈ రకమైన 2 దేశాలు ఉండాలనే ధోరణి దీర్ఘకాలంగా నలుగుతున్నా ముస్లింల కోసం ప్రత్యేక రాజ్యం కావాలనే అసలైన రాజకీయ కాంక్ష 1940లో లాహోర్‌లో జిన్నా ప్రకటనతో ప్రబలమైంది. 1940లో లాహోర్‌లో జరిగిన ముస్లింలీగ్ సమావేశాల్లో జిన్నా మాట్లాడుతూ “ హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు, వేర్వేరు తత్వాలకు, వేర్వేరు సామాజిక సాంప్రదాయాలకు, ఇంకా విభిన్న సాహిత్యాలకు చెందినవారు. హిందువులు, ముస్లింలు చరిత్రలోని వేర్వేరు మూలాల నుంచి స్ఫూర్తిని పొందుతారు. ఇరు పక్షాలకూ వేర్వేరు పురాణాలు, వేర్వేరు నాయకులు, వేర్వేరు కథనాలు, ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఈ విధమైన రెండు విభిన్న జాతులు ఒకే దేశంలో, ఒకరు అల్పసంఖ్యాకులుగా, ఇంకొకరు అధిక సంఖ్యాకులుగా ఇమిడిపోయి జీవించలేరు. ఇది ఒక జాతిలో అసంతృప్తి పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ పరిస్థితి మత ప్రాతిపదికపై రాజకీయ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకూ ఇక్కడి ప్రజా సంతులనాన్ని వినాశనం వైపు తీసుకుపోతూనే ఉంటుంది” అని అన్నారు.

ఈ లాహోర్‌లోనే ముస్లింలీగ్ – పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, వాయవ్య సరిహద్దు ప్రాదేశికం, బెంగాల్‌లతో ఏర్పడే ఒక ‘పూర్ణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సార్వభౌమ’ప్రత్యేక రాజ్యం -ముస్లింలకు కావాలనే ఆకాంక్షను అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా చేసిన తీర్మానం ముస్లిమేతరులకు రక్షణ విషయంలో కొంత హామీని ఇచ్చింది. ఈ లాహోర్ తీర్మానం 23 మార్చి 1940 నాడు, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి ఏ.కె. ఫజులుల్ హక్ ప్రతిపాదించగా, వెంటనే ఆమోదింపబడింది. తీర్మానంలోని సూత్రాలే పాకిస్తాన్ మొదటి రాజ్యాంగానికి పునాదిగా నిలిచాయి.

1940నాటి ఈ డిమాండే తర్వాత క్రమబద్ధీకరణకు నోచుకొని ముస్లింలీగ్‌ని సమర్థించే ముస్లిం ప్రజలలో ఉవ్వెత్తున ఎగసిపడే మతతత్వ తరంగమై, పాకిస్తాన్ అనబడే దేశాన్ని, భారత్ నుంచి చీల్చి ఏర్పాటు చేయాలని ఉద్ధృతంగా వ్యాపించింది. ముస్లిం సమర్ధకులు చెప్తున్నట్లు చాలామంది ముస్లింలు అవకాశం లేక పాకిస్తాన్‌కు పోలేదు లేదా వాళ్ళకు ఇస్లాం మతపరమైన ప్రత్యేకరాజ్యం ఇష్టం లేక వెళ్లలేదు అనే వాదన వెనుక ఎంతో కుట్ర, కుతంత్రం దాగి ఉన్నాయని తెలుస్తోంది. ప్రత్యేకమైన ఇస్లాం రాజ్యం ఏర్పాటు విషయంలో కొంతమంది ముస్లింల నుంచి వ్యతిరేకత ఉన్నది అనేది కొంతమేర వాస్తవమైనప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రకటనలు, ప్రాదేశిక ఎన్నికలలో వాళ్ళ ఓటింగ్ తీరు అనే రెండు ప్రత్యేక అంశాలు ఆలోచించదగ్గ విషయాలే.

ముస్లింలు తమకు ఒక ప్రత్యేక ఇస్లాం మతరాజ్యం కావాలని కోరుకుని, 1946 ప్రాదేశిక ఎన్నికలలో మూకుమ్మడిగా ముస్లింలీగ్‌కు అనుకూలంగా ఓటు వేసిన తర్వాత చాలామంది ముస్లింలు భారత్‌లోనే ఎందుకు ఉండిపోయారు?

పాకిస్తాన్ అనే ఇస్లాం మత రాజ్యం ఏర్పాటును, ద్విజాతి సిద్ధాంతాన్ని మూకుమ్మడిగా సమర్ధించిన ముస్లింలు ఆ తర్వాత ఇక్కడే ఉండిపోవాలని ఎందుకు అనుకున్నారు అనేదే ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న, చర్చించాల్సిన విషయం. వాళ్ళు భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించినట్లే కదా.

ఈ విషయంపై పూర్తి అవగాహన కోసం మనం భారతదేశ చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి…..

స్వాతంత్ర్యానంతరం డా. అంబేడ్కర్ వంటి ఉద్దండ నాయకులు సైతం ఇరుదేశాలు తమ జనాభాలను మతప్రాతిపదికపై, పరస్పర మార్పిడి చేసుకోవాలని సూచించారు. డా. అంబేడ్కర్ గారు తన దేశవిభజన (Partition) అనే గ్రంథంలో – దేశవిభజన అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాలు తమ జనాభాలను సంపూర్ణంగా పరస్పర మార్పిడి చేసుకోవటమే ఉత్తమం అని చాలా స్పష్టంగా వివరించారు. అంటే ముస్లింలు సంపూర్తిగా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలనీ, హిందువులు, ఇతర ముస్లిమేతరులు పూర్తిగా భారత్‌లోకి వచ్చేయాలనీ ఇలా చేయటం ఉత్తమమైన పరిష్కారమనీ, భవిష్యత్తులో మంచిదనీ చెప్పారు. నిజం చెప్పాలంటే, ఆయన ఈ పూర్తి జనాభా పరస్పర మార్పిడి విషయంలో ఒక ప్రాథమిక ముసాయిదాను, అనంతరం ఎదురయ్యే పరిణామాలను, వాటిని ఎలా ఎదుర్కొని పరిష్కరించాలి అనే విషయాలను చాలా చక్కగా విశదీకరించారు.

ఈ విషయంపై సర్దార్ పటేల్ గారు దేశ విభజన తర్వాత చాలా చోట్ల విస్తృతంగా మాట్లాడుతూ ఇక్కడి ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు కోసం ఏ విధంగా సహకరించారో తెలియజేశారు. 1948లో కలకత్తా నగరంలో ఒకచోట ఆయన ఉపన్యాసంలో ఒక ప్రముఖ భాగం ఈ వాస్తవానికి అద్దం పడుతుంది. “  భారత్‌లోనే ఉండిపోయిన ముస్లింలలో అధిక శాతం పాకిస్తాన్ ఏర్పాటులో సహకరించారు. కానీ ఇప్పుడేమో భారత్ పట్ల వాళ్ళ విధేయతను సందేహించవద్దు అని అంటున్నారు. ఒక్క రాత్రిలో ఏమి పెనుమార్పు వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు” అని ఆయన అన్నారు.

అంతే కాదు, ఆ సమయంలో చాలామంది బలమైన నాయకులు కూడా ఈ పూర్తి జనాభా పరస్పర మార్పిడిని సమర్థిస్తూ మాట్లాడారు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ‘సండే గార్డియన్’ అనే పత్రికలో వచ్చిన ఒక వార్తానివేదికలో – డా.శ్యామప్రసాద్ ముఖర్జీ, శ్రీమతి రాజకుమారి అమృత్ కౌర్‌తో కలిసి, జనాభా మార్పిడిపై జిన్నా ప్రస్తావనను ఒప్పుకోవాలి అని గాంధీజీతో మాట్లాడేందుకు వెళ్లారు. కానీ, “దేశ విభజన ప్రాదేశికత (సరిహద్దులు) ఆధారంగా జరిగింది, మతప్రాతిపదికపై కాదు. అందుచేత, పాకిస్తాన్ నుంచి హిందువులను, భారత్ నుంచి వెళ్ళే ముస్లింలతో పరస్పర మార్పిడి చేసే సమస్యే లేదు” అని ఆ పెద్దాయన వాళ్ళతో అన్నారు.

ఇదీ మన భారతదేశం కేవలం హిందువులు, ముస్లింలు అనే మతప్రాతిపదికన విభజనకు గురైన తర్వాత జరిగిన వాస్తవం.

ఆ తర్వాత అంటే జిన్నా డిమాండ్‌పై గట్టిగా ఆధారపడి మతప్రాతిపదికన దేశవిభజన జరిగిన అనంతరం, భారత్, పాకిస్తాన్‌లలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. పాకిస్తాన్‌లోని ముస్లిమేతరులు భారత్‌కు రావటం మొదలయ్యింది, అలాగే ఇక్కడి ముస్లింలలో కొంతమంది మాత్రమే పాకిస్తాన్‌కు వెళ్ళేందుకు బయలుదేరారు. ఈ వలసల వాస్తవాలు మనకు చరిత్ర పత్రాలలో లభ్యం అవుతున్నాయి. అవి నిరూపితమైనాయి కూడా.

1950లో భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్‌ల మధ్య జరిగిన ఒప్పందంలో ఇరుదేశాలూ తమ తమ దేశాలలోని అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించాలనీ, మతంతో సంబంధం లేకుండా పౌరులకు సమానత్వం కల్పించాలనీ సంతకాలు చేసుకున్నారు. ఇరుపక్షాలూ అల్లర్లలో దోచుకున్న ఆస్తులను తిరిగి వసూలు చేయటంలో సహాయం చేయాలనీ, ఎత్తుకెళ్లిన స్త్రీలను తిరిగి అప్పగించటంలో సహాయపడాలనీ, మతపరమైన అల్లర్లలో జరిగిన మతమార్పిడులను గుర్తించరాదనీ వాగ్దానాలు చేసుకున్నారు.

డైలీ పయనీర్ లో వచ్చిన ఒక వార్తాఅంశం:

“పాకిస్తాన్‌లోని (తూర్పు పాకిస్తాన్ సహా) హిందువులపై నిరంతరం జరుగుతున్నఅత్యాచారాలను అరికట్టి రక్షణ కల్పించవలసినదిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటంలో నెహ్రూ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా 1950వ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన డా. శ్యామప్రసాద్ ముఖర్జీ కేంద్ర క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. అదే రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో డా. ముఖర్జీ మాట్లాడుతూ “బెంగాలీ హిందువుల రక్షణ గురించి మీరెందుకు పట్టించుకోవటం లేదు? అక్కడి హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మీరెందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు(Soundings in Modern South Asian History ed. DA Low). పాకిస్తాన్ నుంచి తిరిగి ప్రారంభమైన హిందువుల సామూహిక వలసల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఉద్దేశ్యపూరితంగానే ఇలాంటి పరిస్థితులను కొంతమంది ముస్లింలు కల్పిస్తున్నారని, ఆయన తన ఆగ్రహాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పటికైనా ఇరుదేశాల పరస్పర జనాభాలను, పరస్పర మార్పిడి చేయించాలని ఆయన సూచించగా నెహ్రూ నిర్ద్వంద్వంగాతిరస్కరించాడు.

నెహ్రూ అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి వ్రాసిన ఒక లేఖలో (‘డైలీ పయనీర్’ లో వచ్చిన వార్త ప్రకారం) “తూర్పు బెంగాల్ నుంచి హిందువులు పశ్చిమ బెంగాల్‌కు వలస రావడాన్ని అడ్డుకొనేందుకు చేయవలసిన ప్రతిపనినీ మీరు చేయాల్సిందే అని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను. తూర్పు బెంగాల్‌ నుంచి ఇక్కడికి వచ్చిన హిందూ నాయకులు అక్కడి ప్రజలకు ఎటువంటి సేవలూ చేయలేదని అనిపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు చేయి దాటిపోయాయని మీరు భావిస్తే ఇక మనం చేసేది ఏముంటుంది? కానీ, ఇటువంటి దారుణమైన మానవ దుస్థితిని చూసి నాకు కూడా వణుకు వస్తున్నది. ఏది ఏమైనా, ఒకవేళ యుద్ధం వచ్చినా సరే, నేను మాత్రం మన దేశంలోకి ఇటువంటి వలసలను ఎంతమాత్రం ఒప్పుకొనేది లేదు” అని పేర్కొన్నారు.

కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఆ విధంగా ఇరుదేశాల జనాభా మార్పిడిని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకోసం ఆయన తూర్పు బెంగాల్‌లో అత్యాచారాలకు గురై అనేక బాధలు పడుతున్న హిందువులు తమ మాతృభూమి భారత్‌లోకి వచ్చేందుకు ఎంతమాత్రం అంగీకరించలేదన్నది చారిత్రక వాస్తవం.

ఇరుదేశాలలో చాలాచోట్ల పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగిన తరవాత కూడా పాకిస్తాన్‌కు వెళ్లాలని కోరుకున్నవాళ్లు పోలేకపోయారు. దీనికి కారణం అప్పటి మన దేశనాయకులైన నెహ్రూ, గాంధీజీలు పరస్పర జనాభా మార్పిడికి ఒప్పుకోకపోవటమే. 1950నాటి నెహ్రూ-లియాఖత్ ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత, ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు పోదామనుకున్న ముస్లింలు పోలేదు.

బీహార్ పొడుపుకథ (చిక్కుముడి):

1941-1951 మధ్య కాలంలో బీహార్‌లో జనాభా తగ్గుదల, చాలా కనిష్ట స్థాయిలో 2% మాత్రమే ఉందని, హఫ్ఫింగ్టన్ పోస్ట్ (Huffington Post)లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఒక వింత వాదన ముందుకొచ్చింది. ఈ ఉదాహరణని రచయిత ప్రస్తావిస్తూ “దీనిని ‘సామూహిక వలసలు’ అని చెప్పలేము, ఎందుకంటే, పాకిస్తాన్ ఏర్పాటు కావాలని ఓటు వేసిన బీహారీ ముస్లింలందరూ పాకిస్తాన్‌కు వెళ్ళిపోయినా ఇక్కడ ఉండిపోయినవాళ్లు అందరూ పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానంతో తప్పకుండా ఏకీభవించారని చెప్పలేము“ అని అన్నారు.

ఒకవేళ మనకు వాస్తవ విషయాలు ఎవరూ తెలియజేయకపోతే ఈ సంగతి హాస్యాస్పదంగానే ఉంటుంది కదా.

వ్యాసకర్త చేసిన ఒక ఆసక్తికరమైన కల్పన ఏమంటే – భారత్, పాకిస్తాన్‌ల మధ్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా రాకపోకలు జరుగుతూనే ఉన్నాయని, అంటే ఇప్పటిలాగే  ప్రజలు రైళ్ళల్లో, విమానాల్లో టికెట్లు బుక్ చేసుకొని తమకు నచ్చిన చోటికి వెళ్ళే సౌకర్యం ఉన్నదని అందుకే ఇక్కడ ఉన్నవాళ్లు ఇక్కడ ఉండిపోవాలనుకున్నవాళ్లే. ఇది వాళ్లందరూ స్పృహలో ఉండి తీసుకున్న నిర్ణయమే అనిపిస్తోంది. కానీ, ఈ వ్యాసంలో ప్రత్యేకంగా చెప్పని విషయం ఏమంటే – ముస్లింలీగ్‌కు 1937లో సున్నా స్థానాల నుంచి, పాకిస్తాన్ ఏర్పాటు కావాలన్న రాజకీయ తీర్మానం ఆమోదించిన తర్వాత, 1946లో 40 స్థానాలకు గాను 36 స్థానాలు ఎలా వచ్చాయి అని.

అయితే జనాభా మార్పిడి గురించిన వాస్తవమైన విషయం అలాగే ఉన్నది. అదేమిటంటే – ఈ వ్యాసంలో పైన వివరించినట్టుగా విధంగా అప్పట్లో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చి అటువంటి అధికారిక నిర్ణయాలు తీసుకోగలిగిన వారు ఇద్దరు నేతలు మాత్రమే – వారు ఎం. కె. గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ. డా. అంబేడ్కర్ వంటి బుద్ధిశాలురు, ఉద్దండ నాయకులు ఎంత చెప్పినా గాంధీజీ, నెహ్రూలు ఈ ఇరుదేశాల జనాభా పరస్పర మార్పిడి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక, 1950లో ఒప్పందం జరిగిన తర్వాత, జనాభా మార్పిడికి ఎటువంటి అవకాశమూ లేకుండా పోయింది. దీని తర్వాత కూడా ఇరుదేశాల్లో చాలాచోట్ల పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు సంభవించాయి.

బీహార్ ముస్లింలతో పోలిస్తే, పంజాబ్ ముస్లింలు వలసలతో ఎటువంటి సమస్యలూ లేకుండా పాకిస్తాన్‌కు చక్కగానే వెళ్ళిపోయారు. కానీ పాకిస్తాన్ ఏర్పాటును కోరుకున్న బీహారీ ముస్లింలు దారిలో కుటుంబాలతో రవాణా సమస్యలు, ఇతరత్రా సమస్యలకు భయపడి పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అంతేగానీ, హఫ్ఫింగ్టన్ పోస్ట్ (Huffington Post) వ్యాసకర్తల లాగా ద్వేషపూరిత భావాలతో భ్రాంతి, భ్రమలను వ్యాపింపజేసి, ముస్లింలు వాళ్లంతట వాళ్లే ఇక్కడ ఉండిపోయారు అని చెప్పటం వాస్తవం కానేకాదు.

ఓటుహక్కు/సమ్మతి అనే వాదన: పాకిస్తాన్ ఏర్పాటు కావాలని ఓటు వేసిన వాళ్ళందరూ, ఇండియన్ ముస్లింల ప్రతినిధులు కాదు”

ఎప్పుడైతే వాస్తవాలు బహిర్గతమైపోయి వ్యాప్తి చెందుతాయో అప్పుడు కొంతమంది మేధావి వర్గం అంటూ బయలుదేరి వాస్తవాలను దాచిపెట్టి, దిష్టిబొమ్మ వాదనలను కాపాడలేని వారి రక్షణకై ఆశ్రయిస్తారు. ఇటువంటి వాదన ఒకటి హఫ్ఫింగ్టన్ పోస్ట్‌లో రూపా సుబ్రహ్మణ్య చేశారు. “1935 భారత ప్రభుత్వచట్టం, 6వ షెడ్యూల్ ప్రకారం, 1946 ఎన్నికలలో కొద్దిమందికి మాత్రమే పాల్గొనే అర్హత కల్పించబడింది. అంటే ఓటు వేసే అర్హత, ధనం, ఆస్తులు ఉన్న అతి కొద్దిశాతం మందికి మాత్రమే కల్పించబడింది” అనేది సదరు అతిముఖ్యమైన వాదన.

ప్రధానంగా కేవలం అతికొద్దిమంది మాత్రమే ఓటువేసే హక్కు కలిగి ఉన్నారని చెప్పే ఓటుహక్కుపై ఆధారపడిన ఈ వాదన అత్యధిక ప్రభావం మద్దతు కలిగిన పాకిస్తాన్ ఏర్పాటును సమర్ధించే ముస్లింలు సాధారణ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించరని చెప్తోంది. వాస్తవానికి ఇది ఒక అడుగు ముందుకు పోయి నిజమైన సాక్ష్యాలకు విరుద్ధంగా విషయాంతర సాక్ష్యాలను తెలియజేస్తోంది. “విషయాంతరంగా, గతంలో రాజ్యాధినేతల వారసులైన వాళ్ళు కూడా కలిసి ఉన్న, ఉన్నత మధ్యతరగతి ముస్లింలు, ఉన్నత తరగతి ముస్లింలు 1947లో పాకిస్తాన్ నూతన ప్రభుత్వంలో,సైన్యంలో, కార్పొరేట్ రంగాలలో ఉన్నత స్థానాలు పొందేందుకు పారిపోయి ఉంటారని చాలా కథలు ఉన్నాయి. కాళ్లతో ఓటువేసి, పాకిస్తాన్ కావాలని ఎంచుకున్న అటువంటి వారిని ‘రాజకీయ అవకాశవాదులు’ అని మనం ఉదారంగా పిలుచుకోవచ్చు“ అని సదరు వాదనలో చెప్పారు.

ఈ విషయాంతర సాక్ష్యాలపై ఆధారపడి, వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేసే వాళ్ళు, తమ పేర్లు ఉదారవాదుల జాబితాలో చేరేందుకు, తాము దిష్టిబొమ్మలుగా ఉండేందుకు ఇష్టపడతారు. కానీ, ఈ దిష్టిబొమ్మ సూత్రం, వాస్తవాలకు ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించదు.

ఈ దిష్టిబొమ్మల వాదనను సాక్ష్యంగా రచయిత్రి రూపా సుబ్రహ్మణ్య నెహ్రూ, కాంగ్రెస్‌లకు కూడా విస్తరింపజేశారు. ఆమె ఏమంటారంటే – నెహ్రూ తను ఎప్పుడూ చాలా గొప్పవాడినని భావిస్తాడు, అందుకే ఆయన, తనకున్న ఓటుహక్కు పరిమితి వల్ల, భారతీయులందరికీ, ఎప్పుడూ ప్రతినిధి కాలేదు, నిజానికి, ఆమె ఆధునిక నెహ్రూ విమర్శకులను కూడా నిందిస్తుంది, “ఎందుకంటే, నెహ్రూ చెప్పినట్లు, ఈ నూతన యుగపు విమర్శకులు తాము ఎంతో గత వైభవ చరిత్ర గల మొత్తం హిందూసమాజ శ్రద్ధాసక్తులు, ఆశా, ఆకాంక్షలకు కాకుండా, ఉన్నతవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు. ఒకవేళ ఈ వాదనే నిజమైతే ముస్లింలీగ్ కూడా ముస్లిం సమాజం అంతటికీ ప్రతినిధి కాలేదు అనేది వాస్తవమే అవుతుంది కదా. “ (వాళ్ళ ఓటుహక్కు పరిమితుల వలన)

ఈ వాదన చాలా లోపభూయిష్టంగా ఉన్నది, దీని గురించి తక్కువగా చెప్పటం ఉత్తమం. ఎవరైనా, ఈ పరిమిత ఓటుహక్కు వాదనను ముందుకు తెస్తే, మొదటగా, అసలు భారత్ లో స్వాతంత్ర్య పోరాటం జరగలేదనే వాదనను కూడా ఒప్పుకోవాలి, లేదా ఈ స్వాతంత్ర్య పోరాటానికి, సాధారణ ప్రజానీకం నుండి ఎటువంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని చెప్పవలసివస్తుంది. ఎందుకంటే, స్వాతంత్ర్యసమరం చేసేందుకు, సాధారణ ప్రజల ఏకాభిప్రాయం ఎన్నికల ప్రక్రియ ద్వారా పరిగణనలోకి తీసుకోలేదు కనక. అంతమాత్రం చేత, స్వాతంత్ర్య పోరాటానికి, దేశప్రజలందరి ఆమోదం, అంగీకారం లేవని చెప్పటం సాధ్యమా?

తర్వాత, కాంగ్రెస్‌కు వ్యాపింపజేసిన ఈ వాదన కూడా లోపభూయిష్టమే. కాంగ్రెస్‌ను అతి తీవ్రంగా విమర్శించేవాళ్ళు కూడా కాంగ్రెస్‌కు ప్రజాదరణ కానీ ప్రజల ఏకాభిప్రాయం కానీ మద్దతు కానీ లేవని ఎప్పుడూ చెప్పలేదు. అయితే, ఈ విమర్శలు – కాంగ్రెస్ దేశ ప్రజలను, ముఖ్యంగా అధికసంఖ్యాకులైన హిందువులను ఏ విధంగా తప్పుదోవ పట్టించిందీ, ఇంకా చెప్పాలంటే, నెహ్రూ నమ్మిన, అవలంబించిన సూత్రాలు ఎప్పుడూ హిందూసమాజ మూలధర్మాలకు విరుద్ధంగానే, అంటే, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగానే ఉండేవి. హిందువుల శ్రద్ధాసక్తులు, హిందువుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేశారు, లెక్క చేయలేదు అనేది వాస్తవం. కానీ, హిందువులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారనేది కూడా వాస్తవమే. నెహ్రూ ఏ విధంగా హిందువులను తనను మూర్ఖంగా అనుసరించేటట్లు, తమకు తామే హాని కలిగించేటట్లు తయారు చేశారు అనేదే విమర్శ.

పోనీ, నెహ్రూ ఒక్కరినే ఈ వాదన కోసం పరిగణనలోకి తీసుకుంటే ఆయనకు దేశ ప్రజల మద్దతు లేదు అనే వాదన కూడా లోపభూయిష్టమే ఔతుంది. నెహ్రూకి అన్నీ తారుమారు చేసి, తాను రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలంటే, ఎం.కె. గాంధీ మద్దతు చాలా అవసరం. అప్పట్లో, అవి తన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి కీలుగా (jointbone) చేసే అధ్యక్షపదవికి జరిగే ఎన్నికలు కాదని, నెహ్రూకి బాగా తెలుసు. అప్పట్లో, ఈ విభజన ఉద్దేశాలు, ఆలోచనలు, ముస్లింలీగ్ నుండి ఉత్పన్నమై వచ్చేవి, కాంగ్రెస్ చేత ప్రతిపాదింపబడేవి, ఆమోదింపబడేవి. మనం వీళ్ళ ఉద్దేశాలను విమర్శించటం, కాంగ్రెస్ ఏ విధంగా ప్రజలను బుర్రలేని మూర్ఖులుగా చేసిందనేది వేరే ఒక ప్రత్యేకమైన చర్ఛాంశం. ఏమైనా కూడా, ఆ సమయంలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు లేదు అని ఎవరూ వాదించలేరు.

ఈ దిష్టిబొమ్మ వాదనను, ఎవరి కథనాలకు అనుగుణంగా, ఎంత కావాలంటే అంత, వాళ్ళు విస్తరించుకోవచ్చు. ఉదాహరణకు ఈ ప్రస్తుత తేదీ, సమయంలో కూడా మన ప్రధానమంత్రి మోడీగారి ఎన్నిక విషయంలోనూ (ఆయనకు దేశప్రజలందరి సార్వత్రికమద్దతు ఉన్నప్పటికీ) ఆయనకు అపఖ్యాతి కలిగించాలని కొంతమంది ఇటువంటి అడ్డగోలు వాదనలే చేస్తున్నారు. తరచుగా కొంతమంది వామపక్షవాదులు, ప్రధాని మోడీగారు దేశంలో 33% మంది చేత మాత్రమే ఎన్నుకోబడ్డారు, అందుచేత ఆయన ప్రజలందరి ప్రాతినిధ్య స్వరం కాలేరు అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు.

ఇటువంటి అడ్డగోలు వాదనలకు అంతం ఉండదు. ఏమైనా, పరిమితమైన ఎన్నుకునే అధికారం ఉన్న సమయంలోనూ, సరిగ్గా హిందువులకు ఇవ్వబడ్డ పరిమిత ఓటింగ్ హక్కుల మాదిరిగానే, ముస్లింలకు కూడా పరిమిత ఓటింగ్ హక్కులు ఇవ్వబడ్డాయి. కానీ, వాస్తవమేమంటే, హిందువులు తమకు ప్రత్యేక దేశం కావాలనీ, లేదా హిందువులకు, ముస్లింలకు ప్రత్యేక ఎన్నికల హక్కులు కావాలనీ అప్పుడూ కోరలేదు, ఇప్పుడూ కోరటం లేదు.

భారతదేశ స్వాతంత్ర్యానంతరం, మద్రాస్ ముస్లింలీగ్ (MML)[ఇదే తర్వాత IUMLగా రూపాంతరం చెందింది]లోకసభ సభ్యుడు పోక్కర్ సాహిబ్ బహదూర్,(ఇతడు మొదటి రెండు లోక్ సభలలోనూ ముస్లింలీగ్ సభ్యుడు) ఈ విధమైన సవరణను ప్రతిపాదించాడు – “అల్పసంఖ్యాకుల గురించి ఏర్పాటు చేసిన రాజ్యాంగ సలహాసమితి నివేదికను పరిగణనలోకి తీసుకుని, ప్రాథమిక హక్కులు మొదలైన అల్పసంఖ్యాకుల హక్కులపై, అన్నిరకాల కేంద్ర, ప్రాదేశిక ఎన్నికలు, ముస్లింల గురించి ఆలోచించి, వాళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాల ఆధారంగానే నిర్వహించాలి అని రాజ్యాంగ శాసనసభ ప్రతిపాదిస్తోంది.”

ఆ సమయంలో సర్దార్ పటేల్ గారు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ, చాలా కఠినమైన ఉపన్యాసం చేశారు. ఆయన “పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ముస్లింలే ముందుకు తీసుకొచ్చారు, మతప్రాతిపదికన భారతదేశాన్ని చీల్చాలనే వాళ్ళ వేర్పాటువాద కోరిక ఇప్పుడు నెరవేరింది కదా” అని అన్నారు. పటేల్ గారు ఆ సమయంలో ముస్లింల రెండు నాల్కల ధోరణిని ఎండగడుతూ “తీయని మాటలతో మీ తీవ్రమైన చర్యలకు పరిహారం చెల్లించలేరు.” అని కూడా పదునైన వ్యాఖ్యలు చేశారు.

ఆ ముస్లింలీగ్ సభ్యుడి ప్రతిపాదనపై రాజ్యాంగ సమితిలో వేడిగా వాడిగా జరిగిన చర్చల తర్వాత తిరస్కరించబడింది. వాస్తవానికి, అది ముస్లిం సమాజంలో ఎక్కువగా ప్రజాదరణ పొందిన సూచనయే, దానిపై జరిగిన చర్చలో పటేల్ గారి వ్యాఖ్య అప్పటి పరిస్థితికి అద్దం పడుతోంది.

ఐ.యు.ఎం.ఎల్. (IUML) అస్తిత్వం, దాని ఏర్పాటు భారత్‌లోనే ఉండిపోయిన ముస్లింలకు భారత్ పట్ల ప్రత్యేకమైన విధేయత ఏమీ లేదని నిరూపించింది:

ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 1948లో (స్వాతంత్ర్యానంతరం) ఏర్పాటయినట్లు చెబుతున్నా నిజానికి ఇది భారతదేశాన్ని చీల్చి ఏర్పాటు చేసిన పాకిస్తాన్ నిర్మాత, మహమ్మద్ అలీ జిన్నా నాయకుడుగా ఉన్న ఆల్ ఇండియా ముస్లింలీగ్ (AIML) లో ఒక శాఖ. ఈ ఏ‌ఐ‌ఎం‌ఎల్‌యే తదనంతర కాలంలో పాకిస్తాన్‌లో ముస్లింలీగ్‌గా, భారత్‌లో ఐ‌యూ‌ఎం‌ఎల్‌గా రూపాంతరం చెందింది. IUML వెబ్ సైట్‌లో వాళ్ళ నినాదం (motto) సెక్యులరిజం, మత సామరస్యం అని ప్రకటించుకున్నా అది చట్టవ్యతిరేకమైన చర్యలలో చాలా చురుకుగా పాల్గొన్నట్లు వాస్తవ చరిత్ర చెప్తున్నది.

ముస్లింలీగ్ ముస్లింలు బహుసంఖ్యాకులుగా ఉండే ప్రత్యేక మతరాజ్యాన్ని, దేశాన్ని, చాలా తీవ్రంగా, గట్టిగా వాదించి, సమర్ధించింది. ఫలితంగానే బ్రిటిష్ పాలకుల సహకారంతో ఇండియాను చీల్చుకుని ఇస్లాం మతం ఆధారంగా పాకిస్తాన్‌ను పుట్టించింది. అవిభక్త భారతదేశంలో AIML నింపిన ఇస్లాం మతస్ఫూర్తి శాశ్వతంగా ఉండాలనే, దేశవిభజన తరవాత 1947 డిసెంబర్ లో ఐ‌యూ‌ఎం‌ఎల్ ఆవిర్భావం జరిగింది.

ఐ‌యూ‌ఎం‌ఎల్ స్థాపకుడు, మొదటి అధ్యక్షుడైన కేరళకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ జిన్నా నాయకత్వంలోని ముస్లింలీగ్ నుంచి చీలిపోయి కొత్తపార్టీని ప్రకటించినప్పుటికీ ఆయన గతంలో దేశవిభజన ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న ప్రముఖ ముస్లింనేత. పాకిస్తాన్ ఏర్పాటు కావాలని చాలా ఉగ్రమైన ఉపన్యాసాలిచ్చేవారు. ఐ‌యూ‌ఎం‌ఎల్ సెక్యులరిజంను సమర్థించే సంస్థ అని చెప్పే, ఈ మహమ్మద్ ఇస్మాయిల్, ఆశ్చర్యకరంగా, స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ సమితిలో, ఇండియన్ ముస్లింలకు, షరియత్ సూత్రాలే పాటించేటట్లు ఉండాలని కోరారు. దేశవిభజన అనంతరం, ఐ‌యూ‌ఎం‌ఎల్ అనే మొదటి ముస్లిం రాజకీయపార్టీని స్థాపించిన ఈయన, అవిభక్త భారతదేశంలో ముస్లింలీగ్‌ను ముస్లింలకు ప్రతినిధిగా చూడాలని డిమాండ్ చేసిన జిన్నా లాగానే ఐ‌యూ‌ఎం‌ఎల్‌ను ముస్లింల ఏకైక ప్రతినిధిగా గుర్తించాలని కాంగ్రెస్‌తో చాలాసార్లు బేరమాడారు.

నిజానికి, ఐ‌యూ‌ఎం‌ఎల్ అనే పార్టీ జిన్నా సలహా మీదనే, జిన్నా మనదేశం విడిచివెళ్ళే కొద్దిగా ముందు, స్థాపించబడింది అని చాలామంది విస్తృతంగా అంగీకరించారు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,‘ విభజన తరవాత హిందూస్తాన్‌లో కూడా ఒక ముస్లింలీగ్ ఉండాలి’ అని జిన్నా అప్పుడప్పుడూ చెప్పేవారు. భారత్‌లోని అల్పసంఖ్యాకుల రక్షణ, పాకిస్తాన్ బలం పైన ఆధారపడి ఉన్నదని AIML చెప్తూ, ఇక్కడి అల్పసంఖ్యాకుల రక్షణకై,“అన్నిరకాల(?)చర్యలూ చేపడతామని” వాగ్దానం చేసింది.

ముఖ్యంగా ఇక్కడ మనం నిశితంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ముస్లింలీగ్ వాగ్దానం చేసిన ‘పవిత్ర భూమి’ అని భావించినవాళ్ళు అక్కడికి(పాకిస్తాన్) వెళ్లిపోగా, ఇక్కడ మిగిలిన ముస్లింలు, ఇండియా గురించిన జిన్నా దృష్టికోణాన్ని నిరంతరం కాపాడుతూ ఉంచేందుకు, IUML, వాళ్ళ మిత్రసంస్థల పట్ల వాళ్ళ విశ్వాసాన్ని పాదుగొల్పారు.

కాబట్టి, దేశవిభజన అనంతరం పాకిస్తాన్‌కు పోకుండా ఇక్కడ మిగిలిన ముస్లిం నాయకులు, ప్రజలు, వాళ్ళ సంతతులు, భారతదేశం పట్ల, భారతీయ సంస్కృతి, సభ్యతల పట్ల పూర్తి విధేయులుగా ఉంటారని, ఉన్నతాశయం కలిగి ఉంటారని ఎలా వాదించగలరు? దేశవిభజన అనంతరం ఇక్కడే ఉండిపోవాలనుకున్న ముస్లింలు ద్విజాతి సిద్ధాంతాన్ని, 2-రాజ్యాల ఏర్పాటును పూర్తిగా తిరస్కరించారని ఎలా మాటిమాటికీ చెప్పగలరు?

ముగింపు:

ప్రతి వాస్తవిక విషయం మరియు గణాంకాల ఆధారంగా, దేశవిభజన అనంతరం ఇక్కడే ఉండిపోవాలనుకున్న ముస్లింలు మన మాతృదేశంపై సహజసిద్ధమైన ప్రేమాభిమానాలతో ఇక్కడే ఉండిపోయారని అనుకుంటే పొరబాటే అవుతుంది. కనీసం, వాళ్ళల్లో అధికశాతం మాత్రం మాతృభూమిపై అభిమానంతో ఇక్కడ ఉండలేదు. అయితే, అతికొంతమందికి మినహాయింపులు ఉన్నప్పటికీ అవి అందరికీ వర్తించవు.

ఈ దిష్టిబొమ్మలు చెప్పే అడ్డగోలువాదనలు, అంటే, ఇక్కడే ఉండిపోయిన ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటును కోరుకుని పోరాడి, దేశాన్నిచీల్చుకుని, అక్కడికి వెళ్ళిపోయిన వాళ్లలాగా ‘తీవ్రవాదులుకారు’అనేది శుద్ధ అబద్ధం. ఒకవేళ మనం చారిత్రక వాస్తవాలను ప్రక్కకుపెట్టినప్పటికీ ఈ దిష్టిబొమ్మల వాదనలను ప్రచారంచేసే సమర్ధకులు ప్రస్తుతం ఇండియన్ ముస్లింలలో విశేషంగా పెరిగిపోతున్నఇస్లామిక్ ఉగ్రవాదం, జిన్నాతరహా వేర్పాటువాద, మత ఆధారిత సిద్ధాంతాలు దేనికోసమో అందరికీ వివరించగలరా?

ఇస్లాం ఆధారిత ఉగ్రవాదం (రాడికల్ ఇస్లాం) మరియు జిన్నా వేర్పాటువాదాల ప్రవృత్తి ఇటీవల కాలంలోనే బాగా పెరిగాయి, అని ఎవరైనా చెప్పగలరా?ఎవరైనా జిన్నా నినాదాలైన ‘వాలీ ఆజాదీ’ జ్ఞాపకం తెచ్చుకుంటే, మళ్ళీ అలాంటి నినాదాలే మనం ప్రస్తుతం వినటం లేదా? అలీగఢ్ ముస్లిం యునివర్సిటి (AMU) లో జిన్నా చిత్రంపై ఎన్ని కేకలు, గొడవలు సృష్టించబడ్డాయో, మనం కొంచెం గుర్తు తెచ్చుకోవాలి.  అంతటితో సరిపెట్టుకోకుండా, భారత్‌లోని హిందవులు అధికసంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాల్లో లెక్కలేనన్ని సార్లు అల్లర్లు ఎందుకు జరిగాయో కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

ప్రధానంగా, దేశవిభజన అనంతరం ఇక్కడే స్థిరపడ్డ ముస్లింలు కానీ, వారి సంతానం కానీ, నిజంగా, భారతదేశ సంస్కృతి, సభ్యతల పట్ల వాళ్ళకు గౌరవ, ప్రపత్తులు గనక ఉండి ఉంటే, ప్రస్తుతం భారత్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఇస్లాం ఉగ్రవాదం ఎందుకు నిత్యం పెరుగుదలను సూచిస్తున్నదో తార్కికంగా వివరించాలి. ఈ వివరణ హఫ్ఫింగ్టన్ పోస్ట్ వ్యాసం లేదా దిష్టి బొమ్మల వాదనల మాదిరిగా కాకుండా లేదా ఇస్లాం తీవ్రవాదులు, వాళ్ళ మిత్రపక్షాలు, సంస్థలు విష ప్రచారం చేసి ఆవేశ,కావేషాలను రెచ్చగొట్టినట్లు కాకుండా అందరూ హర్షించేటట్లు ఉండాలి.

ఉత్తములైన ముస్లింలు ఇక్కడ నివసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. ముస్లింలుగా జన్మించినా భారతదేశ సంస్కృతి, ధర్మాల పట్ల, ఈ పుణ్యభూమి పట్ల భక్తి, గౌరవం, విధేయత, ఆదరణ వ్యక్తం చేసే ముస్లింలు ఇక్కడ ఎవరూ లేరు అని ఎవరూ ఎప్పటికీ అనరు. మనకు డా. ఏ‌పి‌జే అబ్దుల్ కలాం, కె.కె. మహమ్మద్ వంటి ఉద్దండులు ముస్లింలుగా జన్మించినప్పటికీ వారు ఇక్కడి భారతీయ సంస్కృతి, ధర్మాలలో అంతర్భాగమై పూర్తిగా మమేకమైనారు. పైగా వారు అయోధ్యలోని రామమందిరం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా హిందువులదేనని ఎలుగెత్తి చాటారు. కానీ, ఇటువంటి మినహాయింపులు అతికొద్దిమందికి మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఇవి సాధారణ ముస్లింల భావాలను ఎంతమాత్రం ప్రభావితం చేయలేవు. భావోద్వేగ రోదనల తివాచీల కింద దుమ్ము దులిపినట్లు, దిష్టిబొమ్మ వాదనలతో ఎలాగైనా హిందువులను తమను తాము దోషులుగా శాశ్వతంగా భావింపజేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో చారిత్రక వాస్తవాలను ఎవరూ మరుగుపరచలేరు.

అనువాదం: సత్యనారాయణ మూర్తి

Source: OPINDIA