
అవి దేశవ్యాప్తంగా వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజులు. వందేమాతర గీతాలాపనపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. ‘అయినా నిషేధించడానికి వాడెవ్వడు’ అంటూ తోటి విద్యార్థులతో తరగతులను బహిష్కరింపజేశారు కేశవరావు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పోలీసుల తుపాకీ తూటాకు ఎదురొడ్డి నిలిచిన దీశాలి కేశవరావు. ఆ తెగింపునకు ప్రజలకు ఆయన్ను సర్దార్ అని అభిమానంతో పిలుచుకున్నారు. అప్పటి నుంచి కేశవరావు సర్దార్ జమలాపురం కేశవరావు అయ్యారు.