Home News UPI సేవలు ఉచితమే: కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

UPI సేవలు ఉచితమే: కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

0
SHARE

UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు విధించదు. UPI లావాదేవీలపై సర్వీస్ ఛార్జి విధించే అవకాశం ఉందంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తోసిపుచ్చింది. UPI సేవలు ఉచితమని ఒక ట్వీట్‌లో పేర్కొంది. “UPI డిజిటల్ రూపేణా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నది. ప్రజలకు చక్కగా ఉపకరిస్తున్నది. ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదక రాబడులను సమకూరుస్తున్నది. UPI సేవలపై ఏదేని ఛార్జీలు విధించాలనే అంశం ప్రభుత్వ పరిగణనలో లేదు. ఖర్చుల పట్ల సర్వీస్ ప్రొవైడర్లు చెందుతున్న ఆందోళనలు ఇతర మార్గాల ద్వారా పరిష్కరానికి నోచుకుంటాయి” అని సదరు ట్వీట్‌లో ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

“ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్‌కు ఆర్థికపరమైన మద్దతును అందించింది. డిజిటల్ పేమెంట్లతో పాటుగా ఆర్థికపరంగా, వినియోగంలో వినియోగదారులకు సులభతరంగా ఉండే పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడం కోసం అదే ఆర్థిక మద్దతును ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ప్రకటించింది” అని మంత్రిత్వశాఖ వివరించింది.

అంతకమునుపు, జులై నెలలో ఆరు బిలియన్ల లావాదేవీలను అధిగమించిన UPI ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కొనియాడారు.

“ఇది ఒక విశిష్టమైన సాఫల్యత. నవీన సాంకేతికతలను అందిపుచ్చుకొని, ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించిన భారత్ ప్రజల సమష్టి దృఢ సంకల్పానికి ఇది సంకేతం. సర్వసాధారణంగా డిజిటల్ చెల్లింపులు మరీ ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఎంతగానో ఉపయుక్తమైనవి” అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు.

2016 సంవత్సరం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో జులై మాసంలో డిజిటల్ లావాదేవీలు చోటు చేసుకున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం రూ.10.62 ట్రిలియన్ల విలువైన 6.28 బిలియన్ లావాదేవీలను UPI నివేదించింది.

SOURCE: ORGANISER