Home News రాష్ట్రంలో అల్లర్లపై VHP నిరసన

రాష్ట్రంలో అల్లర్లపై VHP నిరసన

0
SHARE

రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.  రాష్ట్రంలోని 2,647 స్థలాల్లో నిరసన కార్యక్రమాలను VHP చేపట్టింది. అల్లర్లకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని లేకపోతే ఇంకా తీవ్రతరం చేస్తామని VHP రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ముడుపు యాదిరెడ్డి గారు ఈ సందర్భంగా తెలిపారు.

ఇదే విషయం పై ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ గారిని కలిసిన VHP ప్రతినిధులు, భాగ్యనగరంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ గారికి వివరించారు.

హిందువుల ఇళ్ల పై దాడులకు పాల్పడిన దుండగులను శిక్షించాలని కోరారు.

గోషామహల్‌ను తగలేస్తామన్న కాంగ్రెస్ నేతలు రషీద్ ఖాన్, ఫిరోజ్ ఖాన్‌లను అరెస్ట్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హిందువులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్న సౌత్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీలను సస్పెండ్ చేయాలని గవర్నర్‌ను కోరారు.

RSS కార్యకర్తలను హతమార్చాలంటూ నల్గొండలో ర్యాలీ తీసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి VHP ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.