
పేదరికంతో బాధపడుతున్న స్వాతంత్ర్య సమరయోధులకు అండగా నిలవడంలో శ్రీ పూడిపెద్ది సుందర రామయ్య గారు ముందుండేవారు. అలాంటి స్వాతంత్ర సమర యోధులను తెల్ల దొరలు చెరసాల పాల్జేసినప్పుడు.. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేవారు. అలాంటి ఒక కష్టకాలంలో ఆహార పదార్థాలు, ఔషధాలు, వస్త్రాలు, డబ్బును ఆయా కుటుంబాలకు సుందర రామయ్య గారు పంపించేవారు. తద్వారా దేవుడు బాబు అనే పేరును వారు గడించారు.