ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్
-అయుష్ నడింపల్లి,
(దక్షిణమధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్, ఆర్ఎస్ఎస్)
ఎంఎస్ గోల్వాల్కర్ గారికి 11th సెప్టెంబర్ 1948న సర్దార్ పటేల్ వ్రాసిన లేఖ
(తెలంగాణా ఐటి మంత్రి శ్రీ కే తారక రామారావు/ కేటిఅర్ గారు పేర్కొన్న అదే లేఖలో భాగం ఇది).
“హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసిందనడానికి ఎటువంటి సందేహం లేదు. సహాయం, నిర్మణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్లా, ఆర్ఎస్ఎస్ యువకులు, మహిళలను పిల్లలను సంరక్షించారు, వారికి సహాయంగా ఎంతో పాటుపడ్డారు. అర్ధం చేసుకునే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికీ దానిపట్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు”, ఆయన ఇంకా ఇలా అంటారు, “వేరేగా లేక వ్యతిరేకంగా కాక, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరి వారి దేశభక్తి కార్యక్రమాలు కొనసాగించాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను”.
తెరాస, భాజపా పార్టీల మధ్య రాజకీయ దుమారాలు చెలరేగుతుండడంతో, తెలంగాణా ఐటి మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు అయిన శ్రీ కె. తారక రామారావు, గతంలో కాంగ్రెస్ చేసిన విధంగానే చేస్తున్నారు- ఆర్ఎస్ఎస్ ను ఈ తగాదాల్లో లాగి దూషించడం.
నేపధ్యం
తెలంగాణా, హైదరాబాద్-కర్ణాటక & కర్ణాటక-హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు, 17th సెప్టెంబర్ 1948న, అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించి, భారతదేశంలో కలపడానికి అపారమైన త్యాగాలు చేసారు. ఆ చారిత్రక దినాన్ని అధికారికంగా ఉత్సవం జరుపుకోవాలని ప్రజల ఆకాంక్ష. గత 8సంవత్సరాలుగా హైదరాబాద్ విమోచన ఉత్సవం జరపనందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఎన్నో విమర్శలను ఎదుర్కున్నారు.
అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత, ఆయన ఎలా మాట మార్చేసారో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తుంది, మొదటి భాగంలో 17th సెప్టెంబర్ రోజుని హైదరాబాద్ విమోచన ఉత్సవంగా ప్రభుత్వం జరిపించాలని కోరి, అధికారంలోకి వచ్చాక `వారికి అంతగా కావాలంటే, బిజెపి వారిని వారి కార్యాలయాలలో జరుపుకోమనండి” అన్నారు.
ఈ సంవత్సరం, బిజెపి కేంద్ర నాయకత్వం తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవం జరుపుతోంది; ప్రజా విమర్శలను ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి తన పరువు దక్కించుకోవడానికి ఆఖరి నిమిషంలో మూడు రోజుల పండుగ ప్రకటించారు.
అపుడు ముఖ్యమంత్రి కొడుకు కేటిఅర్ ఏమి చేసారు?
గతంలో కాంగ్రెస్ కపట రాజకీయాల మాదిరిగా, ఆర్ఎస్ఎస్ ను దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు డా.మన్మోహన్ సింగ్, మనీష్ తివారి కూడా 2013లో ఇదే చేసారు. దానికి జవాబు ఇక్కడ చూడచ్చు – Sardar Patel, Nehru and the RSS;
An appropriate day to remember what Sardar Vallabhai Patel said in 1948 about RSS
"All their speeches (RSS) were full of communal poison. As a final result of the poison, the country had to suffer the sacrifice of the invaluable life of Gandhiji"
— KTR (@KTRTRS) September 17, 2022
17th సెప్టెంబర్ 2022న, దాని మూలం చెప్పకుండా, కేటిఅర్ ఇలా ట్వీట్ చేసారు, అప్పటి గృహ మంత్రి సర్దార్ పటేల్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఎం.ఎస్. గురు గోల్వాల్కర్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలనుంచి ఉటంకించారు, ఈ సంభాషణ `జస్టిస్ ఆన్ ట్రయల్’ అనే పుస్తకంలో ఉంది.
అదే లేఖలో, సర్దార్ పటేల్ ఈ విధంగా వ్రాసారు.
పైన ఉదహరించిన భాగం వదిలేసి ఎంతో గౌరవనీయులైన రాజకీయవేత్త లేఖనుంచి కొంత భాగం మాత్రమే కేటిఅర్ ట్వీట్ చెయడం, సమాచార శాఖా మంత్రి హోదాకి సరిపోతుందా? అది సర్దార్ పటేల్ పట్ల అన్యాయం కాదా? అదే సర్దార్ పటేల్, 27th ఫిబ్రవరి 1948న, “బాపూజీ హత్యకి కారణం, ఆర్ఎస్ఎస్ కుట్ర ఫలితం కాదు” అని నెహ్రూకి వ్రాసారు.
ఆ కాలంలో, స్వయంగా సర్దార్ పటేల్ తన ప్రసంగంలో, ముస్లిములతో ఏమన్నారో ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.
3జనవరి 1948 తేదిన, కలకత్తాలో 5లక్షల మంది ప్రజల ముందు దేశ పునర్నిర్మాణం గురించి ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ ఏర్పాటుకి మద్దతిచ్చిన ముస్లిములు, భారతదేశం పట్ల తమ పూర్తి విశ్వాసం చూపించాలని ఆయన ఉద్బోధించారు:
“ఒక విషయంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది భారతీయ ముస్లిములు, పాకిస్తాన్ ఏర్పాటుకి సహాయపడ్డారు. వారంతా రాత్రికి రాత్రే మారిపోయారని ఎలా నమ్మగలం? తాము విధేయత కలిగిన పౌరులని, కాబట్టి వారిని ఎందుకు అనుమానించాలి అని ముస్లిములు అంటున్నారు. వాళ్ళతో నేను ఇలా అంటాను ”ఆ మాట మమ్మల్ని అడగడం ఎందుకు? మీ అంతరాత్మలలో తరచి చూడండి!”.
భారతదేశంలో ఉండిపోయిన ముస్లిములు, దేశం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత చూపించాలని ఆయన తన భావాన్ని సూటిగా వ్యక్తపరిచారు. 13నవంబర్ 1947లో రాజకోట్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఎంతో స్పష్టంగా సూటిగా ఉంటుంది.
ఈ వాక్యాలను పేర్కొనే నిజాయితీ కేటిఆర్ కి ఉందా?
ఇదొక్కటే కాదు, దేశ విభజన జరిగిన ఆ భయంకర సమయంలో, తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో, హిందువులు పెద్ద ఎత్తున హృదయ విదారకమైన అత్యాచారాలకు, హింసకు హత్యలకు గురైనపుడు, ఎవరు వాళ్ళను పట్టించుకుని కాపాడారు? ఆర్ఎస్ఎస్. అంతేకాదు, ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ చేసిన సహకారం, త్యాగాల గురించి ఎంతోమంది సహృదయులు మాట్లాడారు.
భారతరత్న డా. భగవాన్ దాస్, 1 అక్టోబర్ 1948 తేదిన ఈ విధంగా వ్రాసారు.
“సాయుధ దళాలతో దాడులు చేసి, భారత ప్రభుత్వ మంత్రులు, అధికారులను హత్యలు చేసి, ఎర్రకోట మీద పాకిస్తాన్ జెండా ఎగురవేసి, భారత్ లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా ముందుగానే జవహర్లాల్ నెహ్రుకి, సర్దార్ పటేల్ కి తెలియపరిచారని నాకు ఖచ్చితంగా తెలుసు.
నిజాయితీగల దేశభక్తులైన ఆర్ఎస్ఎస్ యువకులు, నెహ్రు పటేల్ లకు ముందుగానే ఆ సంగతి తెలియజేయకపోతే, ఈ రోజు దేశమంతా పాకిస్తాన్ అయి ఉండేది, లక్షలాది హిందువులు హత్య చేయబడేవారు లేక బలవంతంగా మతమార్పిడి చేయబడేవారు, భారతదేశం మరొకసారి బానిసదేశం అయి ఉండేది. ఇది దేనినీ సూచిస్తుంది? ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులను అణిచేసే బదులు, లక్షలాదిమంది ఆర్ఎస్ఎస్ దేశభక్తుల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలు సద్వినియోగ పరుచుకుంటే దేశం బాగుపడుతుంది”.
చివరగా ఒక గమనిక:
స్వాతంత్ర్యం ముందు MIM అనబడిన భారత మజ్లిస్ పార్టీతో తెరాస పార్టీ కుమ్ముక్కైoది. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ ఈ పార్టీ నాయకుడు. 2 లక్షల మంది రజాకార్ల దళాలు, హిందువుల నరసంహారం కొనసాగించారు. ఈ సంవత్సరం, 17సెప్టెంబర్ ఉత్సావం జరుపుకోవాల్సిన పరిస్థితి ఎదురవడంతో, మజ్లిస్ పార్టీని సంతోషపెట్టడానికి, తెరాస ఆర్ఎస్ఎస్ ని దుమ్మెత్తిపోస్తోంది. ఈ చర్య వల్ల మజ్లిస్ పార్టీతోనే కాక, కాంగ్రెస్ నాయకత్వం తోటి, చివరికి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ నియాజితో కూడా తెరాసకి సారూప్యత ఏర్పడింది.