Home News సర్వ ఆమోదిత వ్యాఖ్యానాన్ని మార్చరాదు… సంస్కృత భారతి ప్రకటన

సర్వ ఆమోదిత వ్యాఖ్యానాన్ని మార్చరాదు… సంస్కృత భారతి ప్రకటన

0
SHARE

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు శ్రీ. ఋషి అతుల్ రాజ్ పోపట్ `పాణిని విశ్వసిస్తాం’ (In Panini We Trust) అనే పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారు. డా. విన్సెంజో వెర్జియాని మార్గదర్శనంలో ఋషి ప్రచురించిన ఈ పరిశోధన వ్యాసం సర్వత్ర చర్చనీయాంశంగా, వివాదంగా మారింది. తన పరిశోధన వ్యాసంలో ఆయన పేర్కొన్న విషయాలు చాలా సంకుచితమైనవి, హ్రస్వ దృష్టితో కూడుకున్నవి. అంతేకాదు వాటికి భాషాపరమైన ప్రయోజనం, ఉపయోగం కూడా చాలా తక్కువ. పైగా ఇవి వేలాది సంవత్సరాలుగా ఆచరణలో ఉన్న త్రిమునివ్యాకరణ సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయి. కనుక స్వీయ లక్ష్యాల కోసం సొంత కల్పనాలతో చేసిన ఈ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు అంగీకారయోగ్యమైనవి కావు. `విప్రతిషేధే పరమ్ కార్యం’ అనే సూత్రానికి మహర్షి కాత్యాయనుడు, ఆ తరువాత మహర్షి పతంజలి వ్రాసిన వ్యాఖ్యయే సరైనది, అందరూ ఆమోదించినది. పాణిని అష్టాధ్యాయి ప్రకారం `పరమ్’ అంటే వరుసలో చివర లేదా తరువాత వచ్చిన సూత్రం అని అర్ధం. ఎన్ని పదాలు ఉన్నా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఈ సూత్రాన్నే సర్వత్ర ఆమోదించి, అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ సంప్రదాయాన్నే కొనసాగించాలని, దానిని మార్చే ప్రయత్నం చేయరాదని శ్రీ రాజ్ పోపట్ కు సూచిస్తున్నాము.

– ప్రొ. గోపబంధు మిశ్రా, అధ్యక్షులు, సంస్కృత భారతి.