క్రిస్మస్ వేడుకల మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జాలో 20 వాల్మీకి కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా హిందూ మతాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మీనాక్షి సింగ్ సహాయంతో వాల్మీకి సంఘంతో పాటు రాష్ట్రీయ చేతనా మిషన్ ద్వారా ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మీనాక్షి సింగ్ మాట్లాడుతూ వీరు గతంలో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులను ఆసరాగా చేసుకుని క్రైస్తవ మీషనరీల ప్రలోభాలు పెట్టి, బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేయడంతో సనాతన ధర్మాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు నేడు మరోసారి హిందూ మతంలోకి వచ్చారన్నారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారు ఇక నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఇతర సనాతన దేవతలను ప్రార్థిస్తానని ప్రమాణం చేశారని సింగ్ చెప్పారు.
హిందూ మతం స్వీకరించిన సందీప్ వాల్మీకి మాట్లాడుతూ “ అనారోగ్యంతో బాధపడుతున్న నా బిడ్డ కోసం క్రైస్తవుడిని అయ్యాను. కానీ మా అమ్మ చనిపోయాక, హిందూ ధర్మం ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని మా అమ్మ కోరినప్పటికీ, వారు క్రైస్తవ మతం ప్రకారం కర్మలు చేయమని మమ్మల్ని బలవంతం చేశారని చెప్పారు.
సనాతన ధర్మంలోకి వచ్చేందుకు ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ నిర్వహించింది. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిని మేము స్వాగతిస్తున్నామని రాష్ట్రీయ చేతనా మిషన్ అధ్యక్షుడు హేమంత్ సింగ్ చెప్పారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే సింగ్ పూలమాల వేసి ఆహ్వనించారు. వేద మంత్రాలతో సుమారు 100 మంది వ్యక్తులకు హిందూ మతాన్ని స్వీకరించారు. హిందూ మతంలోకి తిరిగి రావడానికి చట్టపరమైన ప్రక్రియను సజావు చేసినట్టు కూడా సింగ్ చెప్పారు.