Home News పేదరిక నిర్మూలనలో భారత్ భేష్ – ఐక్యరాజ్యసమితి

పేదరిక నిర్మూలనలో భారత్ భేష్ – ఐక్యరాజ్యసమితి

0
SHARE
పేదరిక నిర్మూలనలో భారత్ కనీవినీ ఎరుగని ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) కితాబు ఇచ్చింది. 15 సంవత్సరాల కాలంలో 41.5 కోట్ల మంది భారతీయులు పేదరికానికి దూర‌మ‌య్యారు. 2005-06 నుండి 2019-21 వరకు భారతదేశంలోని 41.5 కోట్ల మంది వ్యక్తులు పేదరికం నుండి విజయవంతంగా బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదించింది.
ఈ మేరకు 2005-06 నుంచి 2019-21 మధ్య 15 సంవత్సరాల కాలానికి బహు కోణ పేదరిక సూచీ(MPI) తాజా సమాచారంతో కూడిన నివేదికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP) , ఆక్స్ఫర్డ్ పేదరికం, మానవాభివృద్ధి ఇనీషియేటివ్(OPHI) ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో 2019-21లో సంయుక్తంగా విడుదల చేశాయి.
భారత్‌తో సహా 25 దేశాలు అదే 15 ఏళ్ల వ్యవధిలో తమ గ్లోబల్ MPI విలువలను సగానికి తగ్గించుకోగలిగాయ‌ని, దీని ద్వారా ఆయా దేశాలు వేగవంతమైన పురోగతిని సాధించగలవని నివేదిక వెల్లడించింది.  భారత్ తో పాటుగా కంబోడియా, చైనా, కాంగో, హండురస్, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం లాంటి 25 దేశాలు 15 సంవత్సరాల వ్యవధిలో వాటి భౌగోళిక MPI  విలువలను సగానికి సగం తగ్గించుకున్నాయ‌ని నివేదిక పేర్కొంది.
17 దేశాలు 25 శాతం కంటే తక్కువ పేదరికంతో దీనిని సాధించగా, భారతదేశం మ‌రియు కాంగోలు 50 శాతానికి పైగా పేద‌రికాన్ని త‌గ్గించాయి. 2005-2006 నుండి 2015-2016 వరకు ప్రపంచ MPI విలువను సగానికి తగ్గించిన 19 దేశాలలో కూడా భారతదేశం ఒకటిగా నిలిచింది.
గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) అనేది పేద‌రిక నిర్మూల‌న ల‌క్ష్యంతో పేదరికం తగ్గింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తుంది. విద్య, ఆరోగ్యం, గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ వంటి జీవన ప్రమాణాలతో సహా వారి రోజువారీ జీవితంలోని వివిధ కోణాలలో పేదరికాన్ని ఎలా అనుభవిస్తున్నార‌నే విష‌యాల‌ను కొల‌మానంగా తీసుకుంటుంది.
భారతదేశం సాధించిన విజయాలు
భారతదేశంలో, పేదరికం 2005-2006లో 55.1 శాతం నుండి 2019-2021లో 16.4 శాతానికి తగ్గింది. భారతదేశంలో బహు పేదరికంలో నివసిస్తున్న వారి సంఖ్య 2005-2006లో దాదాపు 64.5 కోట్ల నుండి 2015-2016లో సుమారు 37 కోట్లకు, 2019-2021లో 23 కోట్లకు తగ్గింది.
భారతదేశంలో అన్ని సూచికలలో పేద‌రికం తగ్గిందని, ముఖ్యంగా పిల్లలు, అట్టడుగు కుల సమూహాలతో సహా ఆర్థికంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు, సమూహాలు చాలా పురోగతిని ప్రదర్శించాయని నివేదిక నొక్కి చెప్పింది.
“2005-2006లో పోషకాహారం లేని వారి శాతం 44.3 శాతం నుండి 2019-2021లో 11.8 శాతానికి తగ్గింది, అయితే పిల్లల మరణాలు 4.5 శాతం నుండి 1.5 శాతానికి తగ్గింది. వంట ఇంధనం కొరత 52.9 శాతం నుండి 13.9 శాతానికి తగ్గింది. 2005-2006లో 50.4 శాతం ఉన్న పారిశుద్ధ్య లేమి 2019-2021లో 11.3 శాతానికి తగ్గింది. త్రాగునీరు కొర‌త 16.4 శాతం నుండి 2.7 శాతానికి, విద్యుత్తు 29 శాతం నుండి 2.1 శాతానికి, గృహనిర్మాణం 44.9 శాతం నుండి 13.6 శాతానికి తగ్గింది.” అని  నివేదిక పేర్కొంది.
Source: Swarajya