Home News భూవివాదాలు, డ్రగ్స్ : మణిపూర్ సమస్యాత్మక గతానికి మూలకార‌ణం

భూవివాదాలు, డ్రగ్స్ : మణిపూర్ సమస్యాత్మక గతానికి మూలకార‌ణం

0
SHARE

–  కె.సురేంద‌ర్

 

మణిపూర్‌లో ఇటీవలి జ‌రుగుతున్న అల్ల‌ర్లుకు లోతైన మూలాలు క‌లిగి ఉన్నాయి. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ప్ర‌స్తుత కార‌ణంగా క‌నిపిస్తోంది. గిరిజనలు అనుభవిస్తున్న మాదిరిగానే మైతేయిల‌కు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా కల్పించడాన్ని పరిశీలించాలని తీర్పునిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే మణిపూర్ భౌస‌ర్గిక స్వ‌రూపాన్ని,  ప్ర‌స్తుత కొనసాగుతున్న కలహాలను అర్థం చేసుకోవడ‌మనేది కీలక‌మైన అంశ‌మే.

22,327 చదరపు కిలోమీటర్ల భౌగోళిక వైశాల్యం కలిగిన మణిపూర్‌ రాష్ట్రం, ప్రధానంగా భూపరివేష్టిత ప్రాంతం. దాని భూభాగంలో 90 శాతానికి పైగా కొండలు, మిగిలినవి లోయలు. ఇది మూడు ప్రధాన జాతుల‌కు నిలయంగా ఉంది. మైతేయిలు, కుకీలు, పంగల్లు (మణిపురి ముస్లింలు), నాగాలు మ‌రియు 29 స్థానిక తెగలు ఉన్నాయి. మైతేయిలు ప్రధానంగా లోయలో నివసిస్తున్నారు. వీరు మొత్తం జనాభాలో 53% మంది ఉన్నారు. అయితే కుకీ మరియు నాగా/జోమి తెగలు (చిన్-మిజో)తో సహా గిరిజన స‌మూహాలు దాదాపు 40% కొండలలో నివసిస్తున్నారు. మైతేయిలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. కుకీ మరియు నాగా జనాభాలో 90% పైగా జ‌నాభా గత కొన్ని దశాబ్దాలుగా క్రైస్తవ మతానికి చెందిన వివిధ తెగలకు మారారు. మణిపూర్ రాష్ట్రం మయన్మార్ తో 398 కి.మీ అంతర్జాతీయ సరిహద్దును క‌లిగి ఉంది.

Also Read : మండుతున్న మణిపురం

మైతేయిలకు ఎస్టీ ప్రత్యేక హక్కులు కల్పించడం వల్ల కొండ ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయవచ్చని భయపడి కుకీల నేతృత్వంలోని గిరిజన సంఘాలు హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది.

ఈ నేప‌థ్యంలో కుకీ జాతి నేతృత్వంలోని ఆల్-ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్  మణిపూర్ (ATSUM),  2023 మే 3న ఏడు కొండ జిల్లాల్లో “గిరిజన సంఘీభావ యాత్ర”ని నిర్వహించింది. దురదృష్టవశాత్తు, ఈ ర్యాలీ ఇంఫాల్ లోయకు సరిహద్దుగా ఉన్న చురాచంద్‌పూర్ జిల్లాలో హింసాత్మకంగా మారింది. కుకీలు, మైతేయిలు క‌లిసి సుమారు 60వేల మంది పాల్గొన్నారు. ఈ హింస రాష్ట్రంలోని మ‌రో పది జిల్లాలకు వేగంగా వ్యాపించింది. కొండ ప్రాంతంలోని భూమిని పొందడం, నిరాకరించడం అనే క్లిష్టమైన సమస్య సంఘర్షణకు ప్రధాన కారణంగా క‌నిపిస్తోంది.

డ్రగ్స్ అడ్డాగా మ‌ణిపూర్‌

ఈ అల్ల‌ర్ల నేప‌థ్యంలో తరచుగా విస్మరించబడే మరో కీలకమైన, దాగి ఉన్న అంశం ఏమిటంటే… ఈశాన్య ప్రాంతం ముఖ్యంగా మణిపూర్, గత ఐదు నుండి ఏడు దశాబ్దాలలో రవాణా కేంద్రం నుండి ఉత్పత్తి కేంద్రంగా మారుతూ మాదకద్రవ్యాల వ్యాపారానికి అడ్డాగా ఎలా మారింది.?

ఈ ఈశాన్య‌ ప్రాంతం థాయిలాండ్, మయన్మార్, చైనా, లావోస్‌లతో అంతర్జాతీయ సరిహద్దులను క‌లిగి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే మయన్మార్‌కు సమీపంలో మ‌ణిపూర్ ఉండటం మాద‌క‌ద్ర‌వ్యాల ఉత్ప‌త్తికి, అభివృద్ధికి దోహదపడింది.

మాద‌క‌ద్ర‌వ్యాల ఉత్ప‌త్తితో గోల్డెన్ ట్రయాంగిల్‌గా అపఖ్యాతి పాలైన థాయిలాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దులను మ‌ణిపూర్ క‌లిగిఉంది. పెట్రోలియం, ఆయుధాల వ్యాపారం తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యాపారంగా డ్రగ్స్ పరిగణించబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అక్రమ నల్లమందు ఉత్పత్తి చేసే పరిమిత దేశాల్లోనే ఆఫ్ఘనిస్తాన్‌లో ఎక్కువ భాగం కొనసాగుతోంది. 2022లో ఆఫ్ఘనిస్తాన్‌లో 6,200 టన్నులను ఉత్పత్తి చేయ‌గా, ఇది అంచనా వేసిన ప్రపంచ ఉత్పత్తిలో (7,800 టన్నులు) 80 శాతానికి సమానం. 2019-20కి సంబంధించి అందుబాటులో ఉన్న తాజా వివ‌రాల ప్ర‌కారం మయన్మార్ (795 టన్నులు), మెక్సికో (504 టన్నులు) న‌ల్ల‌మందు ఉత్ప‌త్తి చేసింది.

Also Read : మణిపూర్ మంటల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం

మణిపూర్‌లో ఈ డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడానికి, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ 2018లో ‘నిషా థాడోక్లాసి’, ‘వార్ ఆన్ డ్రగ్స్’ ప్రచారాలను ప్రారంభించారు. న‌ల్ల‌మందు మొక్కలను నిర్మూలించడానికి, నాశనం చేయడానికి ప్రతి జిల్లాలో కనీసం 100 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఆయన కేటాయించారు.

ఈ దిగువ గణాంకాలు ఈశాన్య ప్రాంతంలో మాదకద్రవ్యాల సమస్య తీవ్రతను నొక్కి చెబుతున్నాయి, అధికారులు నిర్ణయాత్మక చర్య తీసుకోవడం అత్యవసరం.

2022  అక్టోబర్ 8న‌ అస్సాంలో జరిగిన ‘డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ సదస్సులో ప్రభుత్వం డ్రగ్స్ ఉత్పత్తి,  వ్యాపారంపై భయంకరమైన గణాంకాలను వెల్లడించింది.

2006 – 2013 మధ్యకాలంలో 1.52 లక్షల కేజీల మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అధికారులు జప్తు చేశారు. ఇది రెట్టింపై 2014 – 2022 మధ్యకాలంలో 3.30 లక్షల కిలోగ్రాములకు చేరింది. స్వాధీనం చేసుకున్న మాద‌క‌ద్ర‌వ్యాల‌ను విలువ కూడా గ‌ణ‌ణీయంగా పెరిగింది. 2006-2013లో రూ .768 కోట్ల నుండి 2014-20220 రూ.20 వేల కోట్ల‌కు చేరింది.

2018 నుండి అనేక చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల తయారీ యూనిట్లను గుర్తించడం, నిర్వీర్యం చేయడంతో పాటు, మాదకద్రవ్యాల స్వాధీనం గణనీయంగా పెరిగింది. డ్రగ్స్‌పై యుద్ధంలో భాగంగా దాదాపు 3,716 ఎకరాల్లో అక్రమ గ‌స‌గ‌స‌లా తోటలు, 5.51 ఎకరాల్లో గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. 2019లో నార్కోటిక్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ బోర్డర్ (NAB) పోలీసు బృందంతో కలిసి తౌబల్ జిల్లాలోని లిలాంగ్ వద్ద అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 100 కోట్లు విలువ చేసే బ్రౌన్ షుగర్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. జూన్ 2019 నుంచి అక్టోబర్ 2020 వ‌ర‌కు ఎనిమిది బ్రౌన్ షుగర్ ల్యాబ్‌లను మణిపూర్ పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఎనిమిది ల్యాబ్‌లతో, ఆరు ల్యాబ్‌లు తౌబాల్ జిల్లాలో ఉన్నాయి.

మణిపూర్‌లోని మారుమూల కొండ ప్రాంతాలలో ముఖ్యంగా ఉఖ్రుల్, సేనాపతి, కాంగ్‌పోక్పి, కమ్‌జోంగ్, చురచన్‌పూర్, తెంగ్నౌపాల్ వంటి జిల్లాల్లో గసగసాల సాగు అధికంగా పెరగడం వల్ల డ్రగ్ మాఫియా  విచ్చ‌ల‌విడిగా పెరిగిపోయింది. ఈ ప్రాంతాలు కూడా కుకి గిరిజన ఆధిపత్య ప్రాంతాలు. మాదకద్రవ్యాల నిర్వ‌హ‌ణ‌, వాణిజ్యాన్ని నియంత్రించడంలో నిధులు సమకూర్చడంలో కొన్ని ర‌హాస్య సాయుధ బ‌ల‌గాలు(armed underground groups) పాల్గొంటున్నాయని తెలుస్తోంది.

అలాగే మణిపూర్‌లో గసగసాల సాగుదారులను ప్రేరేపిస్తున్నారని కుకీ నేషనల్ ఆర్మీ (KNA), జోమీ రివల్యూషనరీ ఆర్మీ (ZRA) తిరుగుబాటుదారుల‌ను నిషేదించిన‌ట్టుగా నివేదిక‌లు చెబుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో డ్రగ్స్ మాఫియా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2020 – 2021 మధ్య 1,420 ఎకరాల గసగసాల తోటలను నాశనం చేయగలిగాయి. అదే సంవత్సరంలో ఉఖ్రుల్ జిల్లాలోని ఒక గ్రామంలో పెరిగిన గసగసాల మొక్కలను స్వచ్ఛందంగా నాశనం చేసినందుకు గాను ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్  ఆ గ్రామానికి రూ.10 లక్షలు అంద‌జేశారు.

మణిపూర్ పొగాకు ఉత్పత్తులు, గంజాయి (గంజాయి), ఆల్కహాల్, నల్లమందు, స్పాస్మో ప్రాక్సివోన్ (SP), మెథాంఫేటమిన్ (WY), కోడైన్ దగ్గు సిరప్, సూడోపెడ్రిన్‌తో సహా సులభంగా అందుబాటులో ఉండే మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కొంటోంది.

చ‌ర్చి ఘ‌ట‌న‌లో కూడా తప్పుదారి పట్టించే కథనాన్ని ప్ర‌చారం చేస్తున్నారు. కొన్ని క్రైస్తవ వార్తా సంస్థలు, చర్చి వివాదంలో తమను తాము బాధితులుగా చిత్రీకరిస్తున్నాయి. దాదాపు 500 చర్చిలను గుంపులు ధ్వంసం చేశాయని BBC పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో సువార్తికులు విరాళాలు సేకరిస్తున్నారు. స్థానిక చర్చిలలో సంఘీభావ ప్రార్థనలలో పాల్గొనమని వారి అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. వారి పరిసరాల్లో ఊరేగింపులు చేస్తున్నారు. క్రైస్తవులకు సహాయ చర్యల పేరుతో కొంతమంది సువార్తికులు మ‌ణిపూర్ చేరుకున్నారు.

Also Read : మణిపూర్ అల్లర్లు మతపరమైనవి కావు – వనవాసి కళ్యాణ పరిషత్ సహ సంఘటనా మంత్రి

మణిపూర్ లో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ఏ వ్య‌క్తి లేదా రాజ‌కీయ పార్టీకి ముడిప‌డి లేదు. ఇది కేవ‌లం ఒక గుంపు చేస్తున్న రాద్దాంతం. అల్ల‌ర్లు సృష్టిస్తున్న కుకీల గుంపు చేతుల్లో ఆధునిక ఆయుధాలు, యంత్రాలు, చ‌ట్ట‌విరుద్ద‌మైన బంకర్లను ఉండ‌ట‌మే కాకుండా మైతేయిలను నాశ‌నం చేస్తామంటూ నినాదాలు చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వ‌స్తున్నాయి. దేశ ప్ర‌జ‌లు కూడా దీన్ని గ‌మ‌నిస్తున్నారు. దీనికి తోడు స్థానిక మ‌హిళ‌లు కూడా దోషులను రక్షించడంతో పాటు ప‌రిస్థితిని నియంత్రించే పనిలో ఉన్న ఆర్మీ బెటాలియన్‌లను అడ్డుకోవడం ద్వారా ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారుతోంది.

మ‌ణిపూర్ అభివృద్ధికి NDA ప్ర‌భుత్వం కృషి

యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద గత ఎనిమిదేళ్లలో 2014 నుండి 2022 వరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER), NEC పథకాల కింద రూ.15,867 కోట్ల విలువైన 1,350 ప్రాజెక్టుల‌ను NDA  ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కలుపుతూ ప్రపంచంలోనే ఎత్తైన పైర్ రైల్వే వంతెనను నిర్మించడం ద్వారా రైల్వేలతో అనుసంధానం జ‌రిగింది. జిరిభామ్ నుండి ఇంఫాల్ వరకు ప్రతిపాదిత రైలు మార్గం రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసందానాన్ని తీసుకువస్తుంది. రైలుమార్గాన్ని ఇండో-మయన్మార్ సరిహద్దులోని మోరే వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. ఈ పరిణామాలతో మణిపూర్ త్వరలో మిగ‌తా భారతదేశంతో బలమైన అభివృద్ధి ప‌రిణామాల్ని చూస్తుంది. ఫలితంగా మౌలిక సదుపాయాలు, పర్యాటకం, విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ పరిణామాల మధ్య  మైతేయిల‌కు ST హోదా కల్పించాలన్న హైకోర్టు ఆదేశంతో… మణిపూర్ అభివృద్ధి, శ్రేయస్సుకు విఘాతం కలిగించే శక్తులు, రాష్ట్రాన్ని శాశ్వతంగా  పేదరికంలోకి ఉంచడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కడానికి దేశంలోని మిగిలిన విద్రోహ‌శక్తులతో వారు చేరి దేశ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర‌లు చేస్తున్నారు.