Home News మణిపూర్ మంటల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం

మణిపూర్ మంటల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం

0
SHARE


-త్రిలోక్

మణిపూర్ చిన్న రాష్ట్రం అయినా 33 తెగలు 190 భాషలను మనం ఇక్కడ చూడవచ్చు అందరి జీవనశైలి సుమారుగా ఒకే విదంగా ఉంటుంది , అందమైన ఆకుపచ్చని అరణ్యాలు ఎత్తయిన కొండలు నాట్యమాడుతునట్టుగా వుండే సుందరమైన మణిపూర్ లో మంటలు రగిసలిస్తుంది ఎవరు ఆ మంటలలో చలి కాగుతున్నది ఎవరు అక్కడ ప్రస్తుతం కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా మండుతోంది. ఈ ఘర్షణల నుండి లాభం పొందాలని ప్రయత్నిస్తున్న విదేశీ శక్తులు , అక్కడ జరుగుతున్న ఘర్షణలను మరింత రాజేసి లబ్ది పొందాలని చూస్తున్న విదేశీ శక్తులు ఎవరు ఎందుకోసం అనేది అని మనం ఒక సారి ఆలోచించాలి.

ఈ అల్లర్లు చెలరేగడనికి కారణాలను మనం పరిశీలించినప్పుడు రెండు, మూడు అంశాలు ఉన్నాయి. మైతేయిలు, కుకీలు వందల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. కొద్దిమంది కుకీలు పక్కనే ఉన్న మయన్మార్ నుండి వచ్చిన మాట నిజమేకానీ కుకీలంతా బయటనుండి వచ్చినవారేనని చెప్పలేము . . మైతేయిలకు ఆగ్రహం రావడానికి, కుకీలలో అసంతృప్తి చెలరేగడానికి రెండు, మూడు కారణాలు ఉన్నాయి. మయన్మార్ నుండి 50వేల మంది కుకీలు వచ్చిపడ్డారని, వాళ్ళు అడవులను ఆక్రమించుకున్నారని, మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నారని, అక్రమ చొరబాటులు, తీవ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని మైతేయిల ఆరోపణ. కుకీలకు చెందిన 27 వేర్పాటువాద సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం తమ కార్యకలాపాలు నిలిపివేస్తామని ఆ సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు వారివారి కేంద్రాలలోనే ఉండాలి. కానీ కుకీల వైపు నుంచి అది జరగలేదు. మైతేయిలకు కూడా కె.ఎల్.ఫ్, పి.ఎల్.ఏ వంటి కొన్ని వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి. . కొంతకాలంగా తమకు ఎస్.టి హోదా ఇవ్వాలని మైతేయిలు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్ట్ కూడా వారి డిమాండ్ నెరవేర్చాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ వాస్తవానికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టులకు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అధికారం లేదు. ఆ అధికారం శాసన సభది. మొదట అసెంబ్లీ తీర్మానం ఆమోదిస్తుంది, తరువాత రిజిస్ట్రార్ తన ఆమోదం తెలుపుతారు, ఆ తరువాత గిరిజన కమిషన్ ముందుకు వెళుతుంది, కమిషన్ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు విషయాన్ని నివేదిస్తుంది, మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి రాష్ట్రపతి అనుమతి కోసం పంపుతుంది. చివరికి రాష్ట్రపతి ఆమోదంతో ఎస్ టి హోదా లభిస్తుంది. ఇది రాజ్యాంగ ప్రక్రియ. కోర్టు నేరుగా ఫలానా వర్గానికి ఎస్ టి హోదా ఇవ్వాలని ఆదేశించడానికి లేదు. కేవలం సూచన చేయవచ్చును, లేదా సలహా ఇవ్వవచ్చును. అంతేకాని వారం రోజుల్లో ఎస్ టి హోదా ప్రకటించాలని ఆదేశాలు జారీచేయడానికి వీలులేదు. కానీ కోర్టు అలా ఆదేశాలు జారీచేసింది. దానితో వేర్పాటువాద సంస్థలు, దేశవ్యతిరేక శక్తులు తెగల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ గొడవ ప్రారంభించాయి. మైతేయిలకు ఎస్.టి హోదా ఇవ్వడానికి వీలులేదని వాదించాయి. అయితే 90శాతం భూమి 40శాతం జనాభా ఉన్న వర్గాల చేతిలో ఉందని, 50శాతం జనాభా ఉన్న తమ వద్ద 10 శాతం భూమి మాత్రమే ఉందని మైతేయిలు అంటున్నారు. ఈ విషయం నిజమే. కానీ భూమిపై హక్కు ఇవ్వడానికి అందరికీ ఎస్ టి హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్టి హోదా మరొక పద్దతిలో కల్పించవచ్చును. ఈ విషయమై గొడవ ప్రారంభమైంది. మిగతా తెగలవారు దీనిని వ్యతిరేకించారు. మే, 3న మణిపూర్ లో అన్నీ తెగలవారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అది శాంతియుతంగానే సాగింది. చురాచాంద్పూర్ అనే కుకీ ఆధిక్యత కలిగిన ప్రదేశంలో మాత్రం హింస చెలరేగింది. అప్పటివరకూ కార్యకలాపాలు కట్టిపెట్టి అజ్ఞాతంలో ఉన్న కొన్ని వేర్పాటువాద సంస్థల కార్యకర్తలు ఆయుధాలు తీసుకుని హింసకు పాల్పడ్డారు. రెండు, మూడు రోజులపాటు ఈ హింసాత్మక ఘటనలు సాగాయి. ప్రభుత్వం అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే అక్కడితో పరిస్తితి అదుపులోకి వచ్చి ఉండేది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో హింస పెరిగిపోయింది. కొన్ని చర్చిలు, దేవాలయాలపై దాడులు జరిగాయి. కొన్ని హత్యలు జరిగాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన మహిళలపై జరిగిన అమానవీయ సంఘటన జరిగి చాలా రోజులైన తరువాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అయితే ఈ సంఘటనలను ఆధారం చేసుకుని పరిస్థితులను మరింత దిగజార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి రెండు తెగల వారి మధ్య చర్చలు సాగాలి, సానుకూలమైన ధోరణి ఏర్పడాలి. చొరబాట్లు కేవలం కుకీల వల్లనే జరగడం లేదు. రొహ్యంగాలు కూడా అక్రమంగా ప్రవేశిస్తున్నారు. వేర్పాటువాద కార్యకలాపాలకు, మాదకద్రవ్యాల రవాణాకు తమ వర్గాన్నే పూర్తిగా బాధ్యులను చేయకూడదని, నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించడంలో తమకు ఎలాటి అభ్యంతరం లేదని కుకీలు అంటున్నారు. కాబట్టి సమస్య హిందువులు, క్రైస్తవుల మధ్య తలెత్తిందని, దేవాలయాలు లేదా చర్చిలు మాత్రమే దాడులకు గురవుతున్నాయనే మాటలో యదార్ధం లేదు. ఇది రెండు తెగల మధ్య జరుగుతున్న వివాదం. అది కూడా భూమికి సంబంధించినది. విదేశీ శక్తులు ఈ వివాదంలో తలదూర్చాయన్నది స్పష్టమవుతోంది. కొందరు విదేశీ మిషనరీలు ఇక్కడికి వచ్చి సమస్యను మరింత పెంచడానికి ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం వాళ్ళని తిప్పి పంపింది. దానితో వాళ్ళు భారత్ లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. కుకీ క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్నమాట వాస్తవమైతే మైతేయిలకు చెందిన చర్చ్ లపై కుకీలు ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే మైతేయి క్రైస్తవులు కుకీ చర్చ్ లను తగులబెట్టారు. దీనినిబట్టి ఇది రెండు తెగల మధ్య ఘర్షణ అని, హిందువులు, క్రైస్తవుల మధ్య గొడవ కాదని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా గతంలో నాగా కుకీల మధ్యన జరిగిన ఘర్షణ మూలాలు కూడా ఒక సారి పరిశీలించాలి.  అధిక సంఖ్యలో క్రైస్తవులు అయిన కుకిలు మరియు నాగాలు మణిపూర్ లో ఒకరి పై ఒకరు గత 30 సంవత్సరాలుగా సామూహిక హత్యాకాండ,జాతి విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారు ? Sep 1, 1993: నాగా-కుకి గోడవలలో 32 కుకి, 20 నాగ ఇల్లు, ఒక కుకి చర్చి ధ్వంసం.  Oct 21, 1994: కుకి సాయుద దళం KNF వారు నోనే గ్రామంలో ఒక బస్ దారి మళ్లించి కాల్పులుజరిపి,బస్ ని లోయ లోకి తోసేశారు. 32 నాగాలు, 13 ఇతరులు మరణించారు.• Nov 19, 1994: చందేల్ జిల్లాలో నాగాల దాడిలో 25 కుకిలు మరణం, 20 ఇల్లు దగ్ధం. కుకీల ప్రతీకారదాడి లో 100 నాగా ఇళ్ళకి నిప్పు పెట్టిన కుకీలు.Jan 2, 1995: సేనాపతి జిల్లా లో నాగా సాయుధ దళాల దాడిలో నూతన సంవత్సరం జరుపుకుంటున్న5 కుకిలు హతం,8 ఇల్లు దగ్ధం.మణిపూర్ లో జాతి సమూహాల మధ్య జరిగే గోడవల గత చరిత్ర తెలియకుండా విషప్రచారం చేసేవారు స్వార్ధపూరిత ప్రణాళికతో, దేశ ద్రోహ శక్తులతో చేయి కలిపి దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు.

Also Read : భూవివాదాలు, డ్రగ్స్ : మణిపూర్ సమస్యాత్మక గతానికి మూలకార‌ణం

కుకీలకు చెందిన వివిధ వేర్పాటువాద సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు వారి దగ్గర ఉన్న ఆధునిక మారణాయుధాలను స్థానిక పోలీస్ స్టేషన్ లలో అప్పగించారు. కానీ ఇప్పుడు వాటినన్నింటిని తిరిగి తీసుకున్నట్లు తెలుస్తోంది. మైతేయీ ల చేతిలో కూడా ఇలాంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి. వేర్పాటువాద సంస్థల జోక్యం ఇరువైపులా పెరిగిపోవడంతో ఘర్షణ పెరిగింది. సాధారణ ప్రజానీకం, ముఖ్యంగా మణిపూర్ ప్రజలు, శాంతియుతంగానే జీవిస్తారు. వేర్పాటువాద సంస్థలు, కొన్ని విదేశీ శక్తుల జోక్యం వల్ల ఇలాంటి పరిస్తితి ఏర్పడింది. చైనా వంటి దేశాల హస్తం కూడా ఇందులో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మయన్మార్ దేశం వైపు ఒక సారి మనం గమనించాలి మయన్మార్ లో సైనిక తిరుగుబాటు జరిగిన తరువాత అక్కడినుండి వేలాది మంది కుకీ-చిన్, రొహ్యంగ శరణార్థులు మణిపూర్ లోకి ప్రవేశించారు వీరికి స్థానిక కుకీ లు అండగా నిలిచారు వీరంతా అటవీ ప్రాంతాలను ఆక్రమించి గంజాయి సాగు చెయ్యడం ప్రారంభించారు వీరికి వేర్పాటువాద శక్తుల యొక్క అండ దండ లు ఉన్నాయి . ఈ ఘర్షణ ల లో ఎక్కువ గాఫారెస్ట్ ఆఫీస్ లను తగులబెట్టారు దీని వెనుక ఉన్న కుట్రను మనం అర్ధం చేసుకోవాలి అటవీ అధికారుల దగ్గర ఎక్కడెక్కడ మత్తు మందు సాగు జరుగుతుంది , అనే వివరాల తో కూడిన సమాచారం ఉన్నది , మత్తు మందు పంటల సమాచారం నాశనము అవ్వాలని ఫారెస్ట్ ఆఫీస్ లను తగులపెట్టారు ఇక్కడ ఈ కుట్ర కోణాన్ని మనం అర్ధం చేసుకోవాలి.

గత జనవరి లో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక లో మయన్మార్ లో బారి ఎత్తున మత్తుమందు సాగు అవుతుంది అని నివేదిక లో తెలిపింది ,ప్రపంచం లో నే మాదక ద్రవ్యాల ఉత్పత్తి మయన్మార్ ది రెండో స్థానం. మణిపూర్ భారత్ కు మధ్య లో 400 కి.మీ సరిహద్దు ఉంది అందులో 30 శాతం మాత్రమే కంచె ఉన్నది. మాదక ద్రవ్యాల సాగుకు పెరు మోసిన గోల్డెన్ ట్రైయాంగిల్ మయన్మార్, లావోస్ థాయిలాండ్ దేశాల సరిహద్దు ల లోని ప్రాంతం ను గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు , ఈప్రాంతం నుండి కంచె లేని ప్రదేశం నుండి ఈశాన్య ప్రాంతం లో కి మత్తుపదార్థాలు సరఫరా అవుతాయి. 2017 తరువాత మణిపూర్ ప్రభత్వం మత్తు మందు సాగు పై మరియు మాదక ద్రవ్యాల సరఫదారుల పై పెద్ద ఎత్తున విరుచుకుపడింది అనేక ప్రాంతా ల లో పండిస్తున్న మత్తు మందు పంటలను ధ్వంసం చేశారు ఇదే సమయం లో మైతేయి రిజర్వేషన్ , అంశం రావడం తో డ్రగ్స్ మాఫియా విషయాన్ని ఆధారం చేసుకొని అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరం చెయ్యడం కోసం స్థానిక తెగలను రెచ్చగొట్టాయి ఈ మారణ హోమానికి శ్రీకారం చుట్టాయి, మే 3 వ తేదీన ఘర్షణ ల కు కేంద్రం అయిన చురాచాంద్పూర్ మయన్మార్ లో డ్రగ్స్ రాజధాని గా పిలిచే చిన్ రాష్ట్రానికి 65 కిమీ దూరం లో నే ఉన్నది అనే విషయాన్ని కూడా మన గమనించాలి.

Also Read : మణిపూర్ అల్లర్లు మతపరమైనవి కావు – వనవాసి కళ్యాణ పరిషత్ సహ సంఘటనా మంత్రి

ఈ గొడవల వెనుక ఆర్.ఎస్.ఎస్, తదితర జాతీయవాద సంస్థల హస్తం ఉందని కొద్ది మంది విదేశీ భావజాలంతో ప్రేరేపితం అయిన వ్యక్తులు వ్యవస్థలు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ గొడవలకు ఆర్.ఎస్.ఎస్ కు సంబంధం లేదని ఇది తమ రెండు తెగల మధ్య గొడవ అని, దీనికి ఆర్ ఎస్ ఎస్ తో ఎలాంటి సంబంధం లేదని అటు కుకీలు, ఇటు మైతేయిలు చెపుతున్నారు. అయితే అల్లర్లను అదుపుచేయడంలో వెనుకబడుతున్న ప్రభుత్వాన్ని మరింత విమర్శించేందుకు ఆర్ ఎస్ ఎస్ పేరును కొందరు తీసుకువస్తున్నారు తప్ప రెండు వర్గాల వారిలో ఎవరూ ఆర్ ఎస్ ఎస్ పేరును ప్రస్తావించడం లేదు. . పైగా ఆర్.ఎస్.ఎస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల కుకీలతోపాటు మైతేయీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఎస్ ఎస్, సేవభారతి వనవాసి కల్యాణ ఆశ్రమం నిర్వహిస్తున్న 270 సహాయ కేంద్రాల్లో 70 వేల మంది ఉన్నారు. అలాగే శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పరిస్థితు ల లో భారతీయులు గా ఈ విద్వేషాలు రగిలించే శక్తుల పట్ల మనం జాగ్రత్త గా వుంటూ దేశం యొక్క సమగ్రతను కాపాడడం కొరకు మనం సమిష్టి కృషి చెయ్యాల్సిన వసరం ఉన్నది.