- ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్
- బర్కత్ పురా బాగ్ లో విజయదశమి ఉత్సవం
సంఘస్థాపనా దినోత్సవం పురస్కరించుకొని విజయ దశమి ఉత్సవం కోఠీ జాంబాగ్ లోని వివేకావర్ధని కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ విలాస్ అప్జల్ పుర్ కర్, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల) ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుశ్ జీ పాల్గొన్నారు. బర్కత్ పురా భాగ్ సంఘచాలక్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి జస్టిస్ విలాస్ అప్జల్ పుర్ కర్ మాట్లాడుతూ తాను చిన్న నాట సంఘ్ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లు చెప్పారు. వృత్తి రిత్యా సామాజిక కార్యక్రమాలకు దూరమైనప్పటికీ దేశం పట్ల అభిమానముతో తిరిగి ఇలాంటి ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. నాటికీ నేటికీ సంఘ్ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు లేకపోయిన్నపటికి నిర్వహించే స్థలాల్లో మార్పు వచ్చిందని విలాస్ రావు అన్నారు. దేశ వ్యాప్తంగా సంఘ్ స్వయం సేవకుల సంఖ్య పెరగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం ప్రధాన వక్త నడింపల్లి ఆయుష్ మాట్లాడుతూ ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా వివరించారు. గత వంద ఏండ్లుగా ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న ప్రయత్నాల కారణంగా దేశంలో పెద్ద ఎత్తున సమాజ జాగరణ జరిగిందని వివరించారు. స్వయం సేవకుల త్యాగాల ఫలితంగా అసాధ్యం అనుకున్న అనేక పనులు సుసాధ్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందులో రామ మందిర పునర్నిర్మాణం చారిత్రాత్మక సంఘటన అని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పట్ల జరుగుతున్న విష ప్రచారాన్ని ఆయన అభూత కల్పనలు, ఊహ జనిత వ్యాఖ్యలు అంటూ కొట్టి పారేసారు. హిందుత్వం పట్ల వామపక్షియులు చేస్తున్న కుట్రలను ఆయన ఉదాహారణలతో వివరించి కమ్యూనిస్ట్, విదేశీ శక్తుల కుట్రలను ఎండగట్టారు.
సంఘస్థాపనా దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వివేకావర్ధని కళాశాల నుండి పెద్దఎత్తున పురవీధుల్లో పథసంచలన్ (కవాతు ) నిర్వహించారు. ఈ సంచలన్ కు స్థానిక ప్రజలు పుల్లుజల్లి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్ భాస్కర్, ఆర్ఎస్ఎస్ ప్రాంత సహకార్యవాహ ఎర్ర నర్సింగ్ రావు, కార్యకారిణి సభ్యులు రాంపల్లి మల్లికార్జున్, దుర్గా రెడ్డి, భాగ్ కార్యవాహ పురుషోత్తం సహకార్యవాహలు నర్సింహ, పరుశురాంతో పాటు సంఘ అనుబంధ సంస్థల కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.