Home News ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2

0
SHARE
  • క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం

శివాజీ వద్ద ముస్లిం సైనికులే ఉండేవారని క‌మ్యూనిస్టులు మరొక అబద్ధం రాశారు. వాస్తవానికి శివాజీ ప్రధాన సైన్యాధ్యక్షులు ఒకరు నేతోజీ బాల్కర్ మరొకరు ప్రతాపరావు గుజ్జర్. వారిలో మొదట నేతోజీ పాల్కర్ గారు పురందర యుద్ధం తర్వాత మొఘల్స్ కు పట్టుబడితే వారిని మతం మార్చి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకు పంపిస్తారు. శివాజీ మళ్లీ తనను తాను ప్రతిష్టించుకున్న తర్వాత నేతోజీ పాల్కర్ వెనుకకు వస్తే హిందువుగా మార్చి స్వాగమనం చేయిస్తారు. ఇక్కడ ఆ ఘర్ వాపసీ ఎందుకు జరిగింది అన్న విషయం మనం తెలుసుకోవాలి. రెండో వారు ప్రతాపరావు గుజ్జర్, వీరు కూడా యుద్ధంలో శివాజీ కోసం ప్రాణాలు అర్పిస్తే, తరువాత హంబీర్ రావ్ మొహితే, వీరి కుమార్తె తార రాణి సాహెబ్.

శివాజీ మహారాజ్ సైన్యంలో ముస్లింలు ఉండడం అనేది అవాస్తావం. అదేవిధంగా శివాజీ ప్రధాన నావికాదళధిపతి మయాంక్ భండారి, కణోజీ ఆంగ్రే. శివాజీ కోసం ప్రాణాల‌ర్పించిన భాజీ ప్రభువు దేశ్ పాండే, మురాబాబు దేశ్‌ పాండే ఇలా ప్రాణాలు వదిలిన వారంతా హిందువులే. శివాజీ సేన మొత్తం మీద ఇస్లాం రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా నిలబడింది. మరాఠా సేనాధిపతులు దాదాపు అందరూ హైందవులే. హంబీర్ రావ్ మొహితే , తానాజీ మాలుసరే, నేతాజీ పాల్కర్, సదాశివరావు బాపు, ధనోజీ జాధవ్, సంతాజీ ఘోర్పడే, ఏసాజీ కంక్ ఎక్కడ ముస్లింల పేర్లు కనపడరు. శివాజీ ముస్లింల సర్దార్లను ఆదరించార‌న‌డం అవాస్త‌వం.

పానిపట్టు సినిమా చూసిన లేదా యుద్ధం గురించి చదివిన, సదాశివరావు గారు ఇబ్రహీంఖాను తన ఫిరంగి దళానికి అధిపతిగా చేస్తే మరాఠా ఫిరంగి దళంలో ఉన్న అధికారులు అభ్యంతరం చెప్తారు. ఇతను మనకు నమ్మకంగా ఉంటారా అని వారు అంటారు. ఒకవేళ హిందూ ముస్లింలు సామరస్యంగా ఇంకా ఉంటే, పానిపట్టు యుద్ధం-౩ (1770) అనగా 100 సంవత్సరాల తర్వాత కూడా అంత వ్యతిరేకత ఎందుకు వచ్చి ఉంటుంది. కాబట్టి అక్కడ ముస్లింలు ఎవరూ లేరు, అదే విధంగా శివాజీ గారు ప్రతిదీ సంస్కృతంలో ఉండాలని, హైందవాని ఎక్కువ ఆదరించేవారు. కాబట్టి ఆయనను మనం హిందూ హృదయ సామ్రాట్ అంటాము. ఎవరో ఒక ఉద్యోగి (దౌలత్ ఖాన్) ముస్లిం ఉన్నప్పటికీ అతడు చాలా కాలం తరువాత వచ్చాడు. కాబట్టి మొదటి నుంచి ముస్లింలు ఎవరూ శివాజీ వద్దలేరు అనేది జగమెరిగిన సత్యం.

రుస్తుం జమాన్ 

రుస్తుం జమాన్ శివాజీకి పులిగొర్లనును ఇచ్చి ,శివాజీ అఫ్జల్ ఖాన్ ను చంపడంలో సహాయం చేశాడనే అబద్ధాన్ని సృష్టించారు. రుస్తుం జమాన్ అనే వ్యక్తి రణదౌలా ఖాన్ కుమారుడు, బీజాపూర్ లో ఒక పెద్ద జనరల్. శివాజీ తండ్రి షాజి గారికి మిత్రుడు, కానీ ఆయన చనిపోయిన తర్వాత స్వయంగా అఫ్జల్ ఖాన్ కింద ఉండి, శివాజీ మీద దాడి చేస్తారు. ఆ తర్వాత యుద్ధంలో, శివాజీ చేతిలో చిత్తుగా ఓడిపోయి రణభూమి విడిచి పారిపోయాడు. అది రుస్తుం జమాన్ చరిత్ర. అతడు అఫ్జల్ ఖాన్‌ ను చంపడానికి శివాజీకి పులిగోర్లు ఇచ్చాడు అనేది అబద్ధం. రుస్తుం జమాన్, అఫ్జల్ ఖాన్ తో వెళ్లకుండా బీజాపూర్ లోనే తిరిగి ఉండాలని ప్రత్యెక అనుమతి నిజాం ఆదిల్షాయి ప్రభుత్వం ఇస్తుంది. రుస్తుం జమాన్ ,ఆదిల్ షాయి ప్రభుత్వానికి ఎంత విశ్వాసపాత్రుడో అర్థమ‌వుతుంది. రుస్తుం జమాన్ శివాజీకి అఫ్జల్ ఖాన్ ను చంపడంలో సహాయం చేశాడనేది పూరి అవాస్త‌వం. చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవు.

ఔరంగజేబు & శివాజీ మహారాజ్ మధ్య‌ ఒప్పందం

ఔరంగజేబుకు శివాజీకి పురంధర్ సంధి కుదిరించినది ఒక ముస్లిం అని రాశారు, కానీ అది అవాస్త‌వం. పురందర్ సంధి శివాజీకి, ముస్లిం రాజుల తరపున వచ్చిన మీర్జా రాజు రాజా జైసింగ్ మధ్య జరిగింది. దీన్ని ఎవరో ముస్లిం వీరి ఇద్దరి మధ్య సంధికి సహాయం చేశారనేది అవాస్తవం. యుద్ధంలో సంధి కావాలని శివాజీ, జైసింగ్ ను కొరితే జై సింగ్ మాత్రం నువ్వు లొంగిపోవాలంటాడు. అప్పుడు శివాజీ, జైసింగ్ కు ఒక లేఖ రాస్తూ మీరు అదిల్ షా ల మీద పోరాడితే బాగుంటుందంటారు. దానికి బదులు ఇస్తూ జై సింగ్, నిన్ను ఓడిస్తాను అంటాడు. 11 జూన్ 1665న శివాజీ ఎలాంటి ఆయుధాలు లేకుండా జై సింగ్ శిబిరానికి వెళితే అక్కడ జై సింగ్ తన అధికారులతో శివాజీకి ఘన స్వాగతం పలికి శివాజీని తన పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని, 60 సంవత్సరాల జైసింగ్, 30 సంవత్సరాల శివాజీ. తనను ఈ 40 సంవత్సరాలలో ఎక్కువ ఇబ్బంది పెట్టింది శివాజీనే అని చెప్తాడు.

వాస్తవానికి మీర్జా రాజా జైసింగ్ ముందు శిబిరం నుంచి పురందరు కోట ఆగుపడేటట్లు చేసి ఫిరంగితో ఆ కోట కుల్చాల‌నుకుంటాడు. దాంతో శివాజీ మహారాజ్ అమాయక ప్రజలను చంపకండని కోరతారు. జై సింగ్, శివాజీ న్యాయవాదులు మూడు రోజులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చేసుకున్న ఒప్పందమే పురందరు ఒప్పందం నిజం షాహీ వారి పాత 35 కోటలు ఇప్పటిదాకా శివాజీ తీసుకున్నాడు, వాటిలో 23 కోటలు మొగలులకు ఇచ్చేయాలి. అదేవిధంగా దాదాపు లక్ష రూపాయలు ఇవ్వాల‌నే ఆ ఒప్పందంలో ఉంది.

శివాజీ ఎప్పుడూ మొగల్ సర్దార్ గా నియమింపబడలేదు. ఆయన మొఘల్ సర్దార్ అయ్యాడని క‌మ్యూనిస్టులు చాలా తప్పుగా రాశారు. శివాజీ కుమారుడు శంభాజీ 5000 ధత్, 5000 సవార్ తో మొగ‌లుల వ‌ద్ద ఉండాలని షరతు విధిస్తారు. 1665 సెప్టెంబర్ 5న ఔరంగజేబు కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించాడు. ఈ సమయములో రాజా జై సింగ్ తో పాటు ఒక ఫ్రెంచ్ అనుభవిజ్ఞుడు మాత్రమే ఉన్నారు. దీన్ని భాస్కర మెహందీలే, మేఘ దేశ్ముఖ భాస్కరన్ వంటి చరిత్రకారులతో పాటు మహారాష్ట్ర చరిత్రకారులందరూ ధ్రువీకరించారు. కాబట్టి పురందర్ సంధిని రాజ జైసింగ్ కు శివాజీకి మధ్య ఒక ముస్లిం వచ్చి సంధి కుదిరించాడు. అనేది చరిత్రలో ఎక్కడా లేదు.

శివాజీ మొగల్ సర్దార్ గా ఉన్నాడా?

శివాజీ మహారాజ్ ఏనాడు మొగల్ సర్దార్ గా లేరు తాను ఎప్పటికీ మొగల్ సర్దార్ గా ఉండనని చెప్పారు. శివాజీకి రాజా అన్న బిరుదు మొగల్స్ ఇవ్వలేదు. శివాజీ రాజా బోంస్లే అనేది ఆయన పేరు, ఆయనకు ఎవరో ఇవ్వలేదు. శంభాజీని ఔరంగజేబు ఎలా చంపారు అని ఎక్కడా వెతికినా దొరుకుతాయి శంభాజిని అరికాలు బొటనవేలు భాగం నుండి తల వరకు నరికి నరికి ముక్కలుగా చంపారు. శంభాజీ కిల్లుడు బై మొగల్స్ అని మనం గూగుల్ స్లో సర్చ్ చేస్తే చిత్రాలు దొరుకుతాయి. ఆయన ముందే ఆయన మాంసాన్ని కుక్కలకు తినిపిస్తున్నా చిత్రాలు గూగుల్ లో దొరుకుతాయి. కాబట్టి శంబాజీ తండ్రి శివాజీ మార్గంలో వెళ్ళాడు. ఆయనను బ్రాహ్మణులు చంపారు అన్నది చాలా తప్పు.

శంబాజీని మరాఠీలు ధర్మ వీర్ శంభాజీ అని పిలుస్తారు. శంభాజీ శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం చేసారు. తన కళ్ళ ముందు తన మాంసం కుక్కలకు పెడుతున్నా హైందవాన్ని వదలని మహాత్ముడు శంభాజీ. 9 సంవత్సరాలు శంబాజీ , 11 సంవత్సరాలు రాజారాం చివరి 7 సంవత్సరాలు తారా రాణీ సాహెబ్ (రాజారాం భార్య) పోరాడారు. శివాజీ ఏనాడు మొగల్ సర్దార్ గా లేరు. వారి కొడుకు శంభాజిని మొగ‌లులు ఒకసారి సర్దార్ గా చేస్తే దానిని వదిలి శంభాజీ కూడా తండ్రి శివాజీ మార్గంలోనే మొగలుల‌తో యుద్ధాలు చేసారు.

గంగాభట్ వివాదం.

చ‌రిత్రను ప‌రిశోధిస్తే.. విజయనగర సామ్రాజ్యం కూలిన తర్వాత దక్షిణ, ఉత్తర భారత దేశంలో ప్రధానంగా మరాఠ‌ ప్రాంతంలో ఎక్కడా రాజాభిషేకం చేసే బ్రాహ్మణులు లేరు. శివాజీ మహారాజ్ కాశీ నుండి బ్రాహ్మణులు తీసుకువచ్చి రాజాభిషేకం చేయించుకున్నాడు. శివాజీ మహారాజ్ పుట్టుకతో క్షత్రియుడు కాకపోవడంతో పట్టాభిషేకానికి ముందు ఉపనయనం చేయించుకొని జంధ్యం ధరించాడు. తర్వాత మళ్లీ భార్యలందరితో వివాహం చేసుకున్నాడు. గంగాభట్ కాలితో తిలకం దిద్దినట్లు ఎక్కడా లేదు. పట్టాభిషేకం తర్వాత కొద్ది రోజులకే శివాజీ మహారాజ్ తల్లి చనిపోవడంతో ఏదో లోపం జరిగిందని మళ్లీ పట్టాభిషేకం చేశారు. ఇదంతా గంగాభట్ గారు స్వయంగా బ్రాహ్మణులతో నిర్వహించారు. అంతేతప్ప కుల వివక్ష ఎక్కడా జరగలేదు.

మొద‌టి భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1 

మూడ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3

నాల్గ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 4