Home News ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3

0
SHARE
  • క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం

శివాజీ ఆస్థానములో బ్రాహ్మణులు ఉన్నారా?

శివాజీ ఒకసారి బ్రాహ్మణులను చంపార‌ని క‌మ్యూనిస్టులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరఫున వకీలుగా ఉంటాడు. అతను ఒక సందర్భంలో శివాజీ పైన కత్తి ఎత్తినప్పుడు “నువ్వు బ్రాహ్మణుడివి కనుక నిన్ను చంపను” అని, శివాజీ అన్నారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. శివాజీ వద్ద ఎంతోమంది బ్రాహ్మణులు పనిచేశారు. శివాజీ మహారాజ్ తో బేరసారాలు నడపాలని అఫ్జల్ ఖాన్ త‌రుఫున కృష్ణాజి భాస్కర్ వ‌స్తే.. శివాజీ మహారాజ్ తన న్యాయవాదిగా, ప్రతినిధిగా బ్రాహ్మణుడైన గోపీనాథ్ పంత్ ను నియమిస్తాడు.

దాదాజీ కొండదేవ్ వద్ద శివాజీ మహారాజ్ విలువిద్యలు నేర్చుకున్నారని అందరూ నమ్ముతారు. దాదాజీ కొండదేవ్ పేరు మీదనే మహారాష్ట్రలో స్పోర్ట్స్ అవార్డ్స్ ,స్టేడియాలున్నాయి. దాదాజీ కొండదేవ్ కూడా ఒక బ్రాహ్మణుడు. మోరోపంత్ పింగలే ,శివాజీ వద్ద ఉన్నటువంటి 8 మంది మంత్రులలో వీరు ఒకరు. వీరు కూడా ఒక బ్రాహ్మణుడే. శివాజీ మంత్రివర్గంలో 8 మంది మంత్రులు ఉండేవారు. వారిలో 1. మోరోపంత్ పింగలే, 2. రామచంద్ర పంత్ (ఆర్థిక శాఖ) 3. అన్నాజీ దత్తు (రెవిన్యూ), 4.దత్తాజి త్రయంబక, గుడాచార్యం), 5. రామచంద్ర పంత్ దాబిర్ (విదేశీ వ్యవహారాలు), 6. అన్నాజీ మహితే (సైన్యాధ్యక్షులు), 7.నిరోజీ రాంజీ (ప్ర‌ధాన న్యాయ‌మూర్తి) 8.మౌరాజి. ఇందులో దాదాపు నలుగురు బ్రాహ్మణులున్నారు. శివాజీ మహారాజ్ బ్రాహ్మణుల చంపితే, తన మంత్రివర్గంలో ఇంత మంది బ్రాహ్మణులను ఎందుకుంటారు. కాబట్టి హిందూమ‌తంలో అన‌వ‌స‌ర‌మైన గొడ‌వ‌లు సృష్టించేందుకు క‌మ్యూనిస్టులు చేస్తున్న కుట్ర అనేది అర్థ‌మ‌వుతుంది.

శివాజీ మహారాజ్ బ్రాహ్మణులను చంపారనేది కట్టుకథ ఆంగ్లేయులు సృష్టించారు. బహుశా సీఎం అన్నాదురై దీని గురించి తప్పుడుగా వ్యాసాలు రాసి దాన్ని నాటకాలుగా చూపించారు. ZENERAL STUFF అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీన్ని మొత్తం బయటపెట్టారు. ఆంగ్లేయులు భారతదేశంలో కులాల మధ్య వివాదలు సృష్టించారు. పెరియారిస్టుల ద్వారా ద్రావిడ వాదంతో ఈ దేశాన్ని ముక్కలు చేద్దామని చూశారు, ఇటువంటి కట్టుకథలు సృష్టించారు.

చివ‌రిరోజుల్లో శివాజీ మ‌హారాజ్

వాస్తవానికి శివాజీ మహారాజ్ ఒక వారం రోజులు కూడా మంచం మీద లేరు. 13 డిసెంబర్ 1678లో శంబాజీ, శివాజీ నుండి విడిపోయి మొగల్ శిబిరానికి వెళ్లిపోతారు. అక్కడే దిలేర్ ఖాన్ ఒక పథకాన్ని రచించి శంభాజీని అడ్డు పెట్టుకుని శివాజీపై దాడి చేశారు. అక్కడ మరాఠ సర్దార్ పిర్దోజీ ఆయన సొంత యువరాజు అయిన శివాజీ పై కత్తి ఎత్తడంఇష్టం లేక అక్కడినుండి వెళ్ళిపోయాక, కోటలో ఉన్న ప్రతి ఒక్కరి చేతుల‌ను మొగ‌లులు క్రూరంగా నరికారు. ఇదంతా మేధా దేశ్ముఖ్ భాస్కరన్ గారు రచించిన UNDERSTANDING OR CHALLENGING DESTINY అనే పుస్తకంలో, 208 పేజిలో ఉంది. మొగలులిచ్చిన ఒక చిన్న పదవికి ఆశపడి వస్తే ఇంత కోల్పోవాల్సి వచ్చిందని బాధపడి నిజాన్ని గ్రహించిన‌ శంబాజీకి ఆవేద‌న‌కు లోన‌వుతాడు. తిరిగి 1678లో శంబాజీ దిలేర్ ఖాన్ నుండి తప్పించుకొని తండ్రి వద్దకు వెళతాడు. 1678-79 లో సొంత కుమారుడు వ్యతిరేకంగా ఉండడంతో శివాజీ చాలా బాధపడ్డాడు. శంభాజీ వచ్చాక 1680లో మళ్లీ శివాజీ దిలేర్ ఖాన్ పై దాడి చేస్తాడు. దిలేర్ ఖాన్ యుద్ధ భూమి నుండి పారిపోతాడు. మార్చిలో శివాజీ రాజధానికి వస్తాడు. ఆ తర్వాత తన వయసు రిత్యా అనారోగ్యం పాలై, ఏప్రిల్ 3న శివాజీ మహారాజ్ మరణిస్తారు. మొదటి రోజు నుండి చివరి వరకు పోరాడిన శివాజీ, యుద్ధం తర్వాత అస్వస్థతో మరణిస్తారు. కానీ వారు మరణ సమయంలో చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండి చనిపోయార‌న్న‌ది. అవాస్త‌వం . అదే విధంగా శివాజీ, శివాజీ కుమారుడు శంభాజీ బౌద్ధమతం స్వీకరించి, ఇద్దరు కలిసి బౌద్ధాన్ని ప్రచారం చేశార‌న్నది పూర్తిగా అవాస్తము. ఇద్దరు కలిసి హిందూ ధర్మం కోసం పోరాడారు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం శివాజీ

శివాజీ బౌద్ధం స్వీక‌రించాడ‌ని చెబుతున్న వారు ఒక‌సారి శివాజీ రాజముద్రను గ‌మ‌నిస్తే నిజం తెలుసుకుంటారు. అప్పటివరకు అందరి రాజుల రాజముద్రలు పర్షియన్ భాషలో ఉండేవి, కానీ శివాజీ మహారాజ్ గారి రాజముద్ర మాత్రం ఒక్కటే సంస్కృతంలో ఉండేది. బౌద్ధాన్ని ఇష్టపడితే శివాజీ ఎందుకు రాజముద్రను సంస్కృతంలో ముద్రించుకుంటాడు. ఆయన రాజముద్ర మీద ఒక సంస్కృత శ్లోకం ఉంటుంది. అందులో “పాడ్యమినాడు ధరించిన శివాజీ కీర్తి సూర్యుని వలె దినదినాభివృద్ధి చెందుతుంది. ఆయన విశ్వవిజేతవుతాడు” అని ఉంటుంది. బౌద్ధంలో ఎక్కడ సంస్కృత శ్లోకాలు ఉండవు. బౌద్ధ గ్రంథాల్లో పాలీ భాష వాడుతారు. ఆ గ్రంథాలలో ధర్మాన్ని కూడా దమ్మము అని అంటారు. శివాజీ మహారాజ్ బౌద్ధ గ్రంథాలు రాశారని అంటున్నారు. ఇది కూడా అవాస్తవం. శివాజీ మరణ గడియల్లో కూడా కాశీ విశ్వనాధ్ మందిరాన్ని మొగ‌లుల నుండి విడిపిద్దాం, కాశీని కాపాడుదామ‌ని పోరాడారు. శివాజీ తర్వాత వచ్చిన మరాఠ రాజులందరూ కాశీని కాపాడాలి, కాశీని రక్షించాలని పోరాటం చేశారు. అహల్యా బాయి హోల్కర్ చివరికి కాశీ విశ్వనాథ మందిరాన్ని ప్రతిష్టించింది. మొగలుల‌పై దాడులు ఆపిన శివాజీ మహారాజ్, మళ్లీ కాశీ కోసమే మొగల్స్ పై దాడులు మొదలు పెట్టాడు. శివాజీ చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసం పోరాడారు. శివాజీ ,శంబాజీ బౌద్ధమతం స్వీకరించి ప్రచారం చేశారు అనేది ఆధారాలు లేవు. ఆవాస్తవము.

మొగలుల‌పై శివాజీ దాడులు

శివాజీ ఎక్కడ మొగల్ కోటల పై దాడి చేయలేదని విచిత్రమైన వాదన తీసుకువ‌స్తున్నారు. ఎప్పుడైతే కాశీ విశ్వనాథ మందిరంపై దాడి జరిగిందో అప్పుడు శివాజీ కోపం కట్టలు తెంచుకొని మందిరాలపై దాడులు చేసే వారితో చర్చలు గాని, సంధులుగాని ఉండవని, మొగల్స్ పై దాడికి సిద్ధమయ్యారు. ప్రతాపరావు గుజ్జర్ తో కలిసి మూడు నాలుగు సంవత్సరాలు యోజన చేసి మొగలుల‌పై యుద్ధం ప్రారంభించి ,1670 సంవత్సరం లో కొండాణ కోటపై మొదటి దాడి చేశారు. కొండాణ కోట పైకి తానాజీ మలుసురేను పంపారు. వారు ఈ కోటను గెలిచి శివాజీకి అందిస్తారు. దాన్నే సింహగడం అని మార్చారు. ఆ తర్వాత 23 కోటలను నాలుగు నెలల్లో స్వయంగా శివాజీ వెనుకకు తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన కళ్యాణ్, బీవండి , మహౌలి కోటలను గెలుచుకుంటాడు. వర్షాకాలంలో కూడా యుద్ధాలు చేశారంటే మన అర్థం చేసుకోవాలి.

ఆ తర్వాత శివాజీ అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే మొగల్ ఏలు బడిలో ఉన్న సూరత్ పై దాడి చేసి, రూ.66 లక్షలు తీసుకొని వెను తిరుగుతారు. శివాజీ అసలు విశ్రమించకూడదు, మొగల్స్ ప్రాంతంలో దాడులు చేయాలని చెప్పి, రావుల, జగ్లా, జవ్లానా, మరుంద్రా ఇలా ఎన్నో గిరిదుర్గాలను ఆయన గెలుచుకున్నారు. ఆ తర్వాత కరంజా పై దాడి చేసి కోటి రూపాయలు వెనుకకు తీసుకు వస్తాడు. ప్రతాపరావు గుజ్జర్ ,మోరోపంత్ పిన్లే 1500 మంది సైనికులతో అవుంద, పట్టా ,త్రయంబంక, కోటలను గెలుచుకున్నారు . సల్‌హేర్, మలేహర్ కూడా కోటలను ముట్టడిస్తారు. 1671లో శివాజీ సల్‌హేర్, మలేహర్ కోటలపై దాడి చేసి మొగల్స్ ప్రతినిధులను ఓడించి కోట్లను స్వాధీనం చేసుకున్నాడు. ఈ 1700 అడుగుల ఎత్తులో ఉన్న సలేహర్ కోటను ఆయన గెలుచుకోవడంతో, ముస్లింలకు దక్షిణ భారతదేశానికి రావడానికి ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారులు శివాజీ చేతిలోకి వస్తాయి. ఇవి కాకుండా సూరత్ -బురహంపూర్, సూరత్ -జల్నా ఈ మార్గాలన్ని శివాజీ చేతిలోకి వస్తాయి. సలేహీర్ నుంచి సూరత్ 78 మైళ్ళు, ఔరంగాబాద్ 108 మైళ్ళు, సలేహేర్ నుంచి బురహాన్పూర్ 160 మైళ్లు .కాబట్టి మూడు నగరాలు మొగల్స్ రాష్ట్రాల రాజధానులు. ఈ మూడిoటిని కూడా శివాజీ తన చేతిలోకి తీసుకొస్తాడని అనుకొని మొగలులు శివాజీని నిల్వరించడానికి మహతాబ్ ఖాన్ అనే అతన్ని పంపిస్తే వాన్ని కూడా ఆ యుద్ధంలో మొరో పంత్ పింగాలే, ప్రతాపరావు గుజ్జర్ కలిసి ఓడిస్తారు. ఇలా ఎన్నో మొగల‌లు పాలిస్తున్న ప్రాంతాలపై, కోటలపై శివాజీ దాడి చేసి గెలిచారు.

ఏదో హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణులను, శివాజీ మహారాజ్ ను తిడుతూ కమ్యూనిష్టులు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే శివాజీ మహారాజ్ ఎన్నో యుద్ధాలు చేశారో కేవలం సలేహేర్ ,మలేహేర్ యుద్ధంలోనే పదివేల మంది చనిపోయి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. మరాఠాలు మొగల్స్ పై గెలిచారు. 40 వేల మంది మొగలులు సైనికులను 20వేల మరాఠ సైనికులు ఓడించారు. 22 మంది మొగల్ సేనాధిపతులు బంధీలయ్యారు. ది లేర్ఖాన్ పారిపోతాడు. కాబట్టి శివాజీ మహారాజ్ మొగల్స్ ప్రాంతాలపై దాడి చేయలేద‌న్న‌ది అవాస్తవం. శివాజీ మహారాజ్ దాడి చేశార‌నేది వాస్తవం.

శంభాజీ మరణం

శంభాజీని, శివాజీ మహారాజ్ మీద ఉన్న కోపంతో, కుట్రతో బంధించి ఆయన సొంత బంధు వర్గంలోని షిర్కే అనే వంశస్థులు ఆయనకు వ్యతిరేకంగా శంబాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పడం వలన మొగల్స్ ఆయనను పట్టుకొని చంపారు. శంభాజీ మృత్యువు కేవలం మొగలుల చేతిలోనే జరిగింది. ఇది వాస్త‌వం దీని మీద ఎవరికి కూడా సందేహం లేదు. శంభాజీని బ్రాహ్మణులు చంపార‌న్న‌ది అస‌త్యం. 1689, ఫిబ్రవరిలో అతన్ని, అతని అనుచరులు 25 మందిని కుట్రతో బంధించి షిర్కే, అనే కుటుంబం వారు ఆయన ఆచూకుని ఇవ్వడం వల్ల మొగలులు శంభాజీని పట్టుకొని మతం మార్చడానికి ప్రయత్నించి మారకపోతే చంపేశారు.

మొద‌టి భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1

రెండ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2

నాల్గ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 4