కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ‘గోసంతతి పరిరక్షణ నియమావళి’ రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణానికి అనుగుణంగా ఉంది, సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉంది. సంతలలో కొంటున్న, అమ్ముతున్న ఆవులను, ఎద్దులను, పెయ్యలను, దూడలను, కోడెలను, గే దెలు-బర్రెలు, ఎనుములు-ను, ఒంటెలను చంపరాదన్నది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘నియమావళి’లోని సారాంశం! మాంసం కోసం చంపడాన్ని మాత్రమే కాక ‘మత సంప్రదాయాల’ పేరుతో ఆవులను, తదితర గోసంతతిని, గేదెలను, ఒంటెలను ‘బలి’ ఇవ్వడం, చంపి తినడం వంటి అమానుష చర్యలను కూడ నియమావళిలో నిషేధించడం ముదావహం! ‘జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక, పశువుల సంతల క్రమబద్ధీకరణ’-ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఆనిమల్స్, రెగ్యులేషన్ ఆఫ్ లివ్‌స్టాక్ మార్కెట్స్- నియమావళి పేరుతో ఈ ఉత్తరువు వె లువడింది. ఆవులను, గో సంతతిని, పాడి పశువులను, ఒంటెలను పరిరక్షించడానికి వీలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన నూతన నియమావళి తరతరాల జాతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. ఆవులను, ఎద్దులను, దూడలను, పెయ్యలను హత్య చేయరాదన్నది ఈ జాతీయ సంప్రదాయం. బ్రిటన్ దురాక్రమణదారుల పాలన వ్యవస్థీకృతమైన తరువాత ఈ జాతీయ సంప్రదాయం అడుగంటిపోయింది. గోసంరక్షణ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఇలా జా తీయ సంప్రదాయ పరిరక్షణకు అనుగుణంగా ఏర్పడిన రా జ్యాంగ నిర్దేశానికి అ నుగుణంగా గోవధ ను, గోసంతతి వధ ను నిషేధించడానికి జాతీయ స్థాయిలో సర్వసమగ్రమైన చ ట్టం దశాబ్దుల క్రితమే రూపొంది ఉండాలి! అలా రూపొందకపోవడం జాతీయ వైఫల్యం, రా జ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చిన విపరిణామం! ఇటీవలి కాలంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ వంటి చోట్ల ప్రాంతీయ స్థాయిలో గో సంరక్షణ చట్టాలు ఏర్పడినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దులుగా అమలులో ఉండిన గోవధ నిషేధపు చట్టం 2014 జూన్ రెండు తరువాత తెలంగాణకు, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు వర్తిస్తోంది! గుజరాత్ ప్రభుత్వం గోహత్య చేసిన నేరస్థులకు ‘యావజ్జీవ కారా గృహ నిర్బంధ’ శిక్ష-లైఫ్ ఇంప్రిజన్‌మెంట్-ను విధించాలని నిర్దేశిస్తూ ఇటీవల చేసిన చట్టం పాడిపశువుల పాలిట శ్రీరామరక్ష! గోహంతకుడు పదునాలుగేళ్లు జైలులో ఉండాలి! ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని వారాలుగా అక్రమ గోవధ, పశువధశాలను మూసివేయిస్తూ ఉండడం మరో శుభ పరిణామం! అయినప్పటికీ ‘సర్వ సమగ్ర గోవధ’ను నిర్దేశిస్తూ జాతీయస్థాయిలో చట్టాన్ని రూపొందించకపోవడం అంతుపట్టని వ్యవహారం!
ఈ నియమావళి అమలు జరిగినట్టయితే ‘సంతకు తోలి కోతకు’ పశులనమ్మడం ఆగిపోతుంది. కానీ మూడేళ్లు గడిచిపోయిన తరువాత కూడ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ‘సమగ్ర గోసంతతి పరిరక్షణ’ బిల్లును ఎందుకని ప్రవేశపెట్టడం లేదు? ‘విశ్వ హిందూ పరిషత్’ తదితర జాతీయ సంస్థలు అడుగుతున్న ప్రశ్న ఇది. లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభలో ‘బిల్లు’ వీగిపోతుందన్న భయమా? ‘వస్తు, సేవల పన్నుల’ బిల్లు తదితర ప్రధానమైన ‘బిల్లు’ల విషయంలో వలెనే ప్రభుత్వం ‘గోపరిరక్షణ’ బిల్లు విషయంలో కూడ ప్రతిపక్షాలతో చర్చలు జరపవచ్చు, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయవచ్చు. ఇందుకు వీలుగా మొదట ‘బిల్లు’ను రూపొందించి లోక్‌సభకు సమర్పించవచ్చు! కానీ మూడేళ్లుగా ఇలాంటి ‘బిల్లు’ను రూపొందించడానికి ప్రభుత్వం ఎందుకని తటపటాయిస్తోంది. సమగ్ర గోరక్షణ చట్టం దేశప్రజల మనోభీష్టం! దేశ ప్రజలలో నాలుగు శాతం మా త్రమే అప్పుడప్పుడు గో మాంసం తింటున్నట్టు అనేక సర్వేల ద్వారా స్పష్టమైంది. కేవలం ఒకటిన్నర శాతం ప్రజలు నియతంగా గోమాంసం తిం టున్నారట! తొంబయి ఆరు శాతం ప్రజల మనోభావాలను మన్నించడం ప్రభుత్వం విధి!
పశువుల అక్రమ వధను అరికట్టడానికి వీలుగా అధ్యయనం చేయడానికై ‘మంత్రివర్గ సంఘాన్ని’ నియమించాలన్నది సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసిన ఆదేశం. ఈ ఆదేశానికి అనుగుణంగా ఏర్పాటయిన అధ్యయన సం ఘం 1960వ సంవత్సరం నాటి ‘జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక’ చట్టం ప్రకారం నియమావళిని రూపొందించాలని కోరిందట! అందువల్ల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘గోసంతతి రక్షణ’ నియమావళి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానికి అనుగుణం! కేరళ ప్రభుత్వం ఈ ‘నియమావళి’ని ఎందుకని వ్యతిరేకిస్తోందన్నది అంతుపట్టని వ్యవహారం! వధ కోసం పశువులను సంతలలో అమ్మడా న్ని, కొనడాన్ని కేంద్ర ప్రభుత్వ నియమావళి నిషేధిస్తోంది. ఈ చ ర్యవల్ల సంతలలోను, రవాణా ప్రక్రియలోను ఉపాధిని పొందుతు న్న వారికి నిరుద్యోగం ఏర్పడుతుందని కేరళ ప్రభుత్వ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారమైంది. ఇలా ‘ఎలుగెత్తి ఏడవడం’ అర్థం లేని చర్య! ఆవులను దూడలను కోడెలను పెయ్యలను చంపడం ద్వారా లభిస్తున్న ఉపాధి కంటే ‘ఉద్యోగాల’ కంటే ఇబ్బడిముబ్బడిగా ఉపాధి, ఉద్యోగాలు ఈ గోసంతతిని రక్షించడం వల్ల లభిస్తోంది. ఇది చరిత్ర నిరూపించిన సత్యం! మనదేశంలో అనాదిగా పశువుల సంతలు, పశువుల మేళాలు, పశువుల జాతరలు, పశువుల ‘పరష’లు జరుగుతున్నాయి! ముంగారు-తొలకరి-మొదలు కావడానికి పూర్వం వేలచోట్ల జరిగిన ఈ సంతలకు లక్షలాది ‘గోసంతతి’ తరలివచ్చేది! ఎందుకోసం..? ‘కోత’ కోసం కాదు! వ్యవసాయదారులు తమ పొలాలను దున్నగల ఎద్దులను ఈ సంతలలో కొనేవారు, గృహస్థులు తమ ఇంట అమృత వృష్టి కురిపించగల ఆవులను ఈ సంతలలో కొనేవారు! ‘వధ’ కోసం ఆవులను, ఎద్దులను సంతలకు తోలడం, బ్రిటన్ సామ్రాజ్యవాదులు చొరబడే వరకు ఈ దేశంలో తెలియని విద్య!
పొలం దున్ని పండించడం జీవన విధానమైన మన దేశంలో గోసంతతి సహజంగానే యుగయుగాలుగా రక్షణకు నోచుకుంది. గోమాత రక్షణతో భూమాత రక్షణ ముడివడి ఉండడం సేంద్రియ వ్యవసాయానికి ప్రాతిపదిక! మాతృభూమిని పూ జించేవారికి ప్రేమించే వారికి గోమాతను పూజించడం, ప్రేమించడం సహజ స్వభావమైంది.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)