Home Telugu దౌత్యవేత్త, రాజ్యాంగ నిపుణుడు రామ్ నాథ్ కోవింద్

దౌత్యవేత్త, రాజ్యాంగ నిపుణుడు రామ్ నాథ్ కోవింద్

0
SHARE

రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ కు చెందిన రామ్ నాథ్ కోవింద్ పేరును బి‌జే‌పి ప్రకటించింది. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న రామ్ నాథ్ కోవింద్ వివాదరహితుడిగా పేరుపొందారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన స్వయంకృషితో పైకి వచ్చారు.

న్యాయశాస్త్ర పరిజ్ఞానం

“రాజ్యాంగం గురించి కోవింద్ కు ఉన్న అపారమైన పరిజ్ఞానం, అవగాహన దేశానికి ఎంతో ఉపయోగపడతాయి’’ అని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. కోవింద్ న్యాయవాద వృత్తిలో బాగా రాణించడమేకాక పరిపాలన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేశారు. ఒక సివిల్ సర్వెంట్ గా, సుప్రీం కోర్ట్ లాయర్ గా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 1977 నుండి రెండేళ్ళు ఢిల్లీ హైకోర్ట్, తరువాత 16 ఏళ్లపాటు సుప్రీం కోర్ట్ లో ఆయన న్యాయవాదిగా పనిచేశారు.

రాజకీయ అనుభవం

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కోవింద్ అణగారిన వారి ఉద్ధరణ కోసం కృషి చేశారు. గతంలో బి‌జే‌పి దళిత మోర్చా అధ్యక్షుడిగా,అఖిలా భారత కోలి సమాజ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

దౌత్యవేత్తగా ..

భారత ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితిలో రామ్ నాథ్ కోవింద్ తన ముద్ర వేశారు. అక్టోబర్ , 2002 ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆవిధంగా ఆయన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిద్యం వహించారు. మొరార్జీ దేశాయ్ కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేయడంవల్ల ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయ పనితీరు గురించి కూడా అవగాహన బాగా ఉంది.

“రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ బాగా రాణిస్తారని, పేదలు, అణగారినవారి తరఫున తన వాణి వినిపిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడి విశ్వాసం వెల్లడించారు.

న్యూస్ భారతి సౌజన్యంతో..