Home News అనాదులను అక్కున్న చేర్చుకొని వారి జీవితాలు నిలబెడుతున్నమరొక అనాధ 28 ఏళ్ల సాగర్ రెడ్డి

అనాదులను అక్కున్న చేర్చుకొని వారి జీవితాలు నిలబెడుతున్నమరొక అనాధ 28 ఏళ్ల సాగర్ రెడ్డి

0
SHARE

28 ఏళ్ల వయస్సు గల  సాగర్ రెడ్డి అనాధలకు ఒక  “పెళ్లి కాని తండ్రి”, తానే తండ్రి అయ్యి వారికీ చేయూత నిస్తున్నాడు అతనే ఒక  అనాధ అందువలన అతను  అనాధలకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఒక సంవత్సరపు వయస్సులో, సాగర్ తల్లిదండ్రులను కులాంతర వివాహం చేసుకున్నారనే సాకుతో  అక్రమంగా వారి సొంత బంధువులచే చంపినప్పుడు  ఇతను అనాధ అయ్యి  అతను తన జీవితాన్ని ఒక అనాధ శరణాలయంలో ప్రారంభించాల్సివచ్చింది . అనాథాశ్రమం వారు 18 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లలని  ఆ స్థలమును విడిచి వెళ్ళమని అడిగారు. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా, ఆహారం మరియు  ఉండటానికి స్థలం లేకపోవడంతో , సాగర్ రెడ్డి ఆలయాలలో మరియు రైల్వే ప్లాట్ ఫార్మ్ లాంటి చోట్ల ఒక సంవత్సరం కంటే ఎక్కువ గడిపారు.  ఆ సమయంలో ఒక  దాత సాగర్ లో ఉన్న  టాలెంట్ చూసి  అతని విద్య కోసం సహాయాన్ని అందించారు.

Sagar Reddyడిగ్రీని పూర్తి చేసి, ప్రముఖ సంస్థలో ఉద్యోగం సంపాదించిన తరువాత, సాగర్ తన జీవితంలో స్థిరపడాలని ప్రణాళిక తయారుచేసుకున్నారు. అతను పెరిగిన అనాథాశ్రయాలను సందర్శించినప్పుడు, తన స్నేహితుల్లో చాలామంది చెడు సావాసాలలోలో పడ్డారని తెలుసుకున్నాడు.అతను అనాధ శరణాలయాల్లో సమస్యను గ్రహించాడు. వారు చిన్న పిల్లలను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అనాథలు 18 ఏళ్ళ వయసు దాటినా వారిని ఉండటానికి అనుమతించరు.

ఈ సమస్యను “ఏక్తా నిరాధర్ సంఘ్” అనే సంస్థను స్థాపించి ఎదుర్కొవాలనుకున్నారు .ఈ  సంస్థ  గదులు / ఫ్లాట్లు  అద్దెకు తీసుకుని , వాటిని బాలబాలికలకు పునరావాస కేంద్రాలుగా  మార్చారు.ఈ  సంస్థే వారి అహార మరియు విద్యకు ఏర్పాట్లు  స్పాన్సర్ల సహాయంతో చేస్తున్నారు.

ఈ రోజు వరకు సాగర్ ఏడు వందల అనాధలకు పైగా సహాయం చేసి మరియు 1,125 కన్నా ఎక్కువ పునరావాసాలు  కల్పించారు. అతను అరవై కు పైగా  అనాధ బాలికల వివాహాలు చేయడమేకాక  స్వయంగా తానే వారికీ తండ్రిలా  కన్యాదానం చేసారు మరియు వారి భవిష్యత్తును సురక్షితం చేశాడు. దాదాపు 600 మంది అనాధలు అతని ఆశ్రయం కింద ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై ఆయన సామాజిక మద్దతు కార్యకలాపాలు విస్తరించాయి.

సాగర్ రెడ్డి యొక్క పనిని గుర్తించి,  కేశవ్  శ్రిష్టి  పురస్కార్ తో   అతనిని సత్కరించారు . శ్రీ సుహస్రా హేర్మాట్ (ప్రఖ్యాత సామాజిక కార్యకర్త) మరియు శ్రీ హనుమంతురవ్ గైక్వాడ్ సిఈఓ, భారత్ వికాస్ గ్రూప్) అతన్ని  ఫలకం మరియు  లక్ష రూపాయల బహుమానంతో సత్కరించారు. ఆ సభకు వచ్చిన చాలా మంది సాగర్ మరియు ఏక్తా నిరాధర్ సంఘానికి  తమ మద్దతును ప్రకటించారు.