Home News కులవృత్తుల వారిని సన్మానించిన సామాజిక సమరసతా వేదిక

కులవృత్తుల వారిని సన్మానించిన సామాజిక సమరసతా వేదిక

0
SHARE

డిసెంబరు 12 న జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వెంకటాపూర్ మండలం, నల్ల గుంట గ్రామంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో కులవృత్తుల వారిని దంపతులతో సహా ఆహ్వానించి సత్కరించారు. దంపతులు ఒకరినొకరు దండలు మార్చుకున్నారు, లడ్డూ లు నోటికి అందజేసారు. శాలువా తో తగిన గౌరవం లభించగానే ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అలాగే అన్ని కులాల కు చెందిన నాయకులు వేదికపై వున్నారు.

గ్రామంలో నాలుగు భజన బృందాలు, కోలాటం, అంబేద్కర్ డప్పు బృందం మొదలైన సాంస్కృతిక కళాకారులు  ఎనభై మంది పాల్గొని నృత్యం చేశారు. ‘రామాయణంలో ఆదర్శ పాత్రలు’ పుస్తకాలు అందరికీ అందచేశారు. రేల విజయ్, వెంకటరత్నం సమరసత, దేశభక్తి పాటలు ఆలపించారు.

40,50 సంవత్సరాలుగా గ్రామ సేవలో తరించి, ఇటీవలనే మరణించిన మందల మల్లారెడ్డిని గుర్తచేసుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన బ్రతికున్నప్పుడు దానం చేసిన భూమిలో  నిర్మాణం మద్యలో ఆగిన కృష్ణ దేవాలయాన్ని, సంవత్సరం లోగా పూర్తి చేయాలని ఈ కార్యక్రమం లో బహిరంగంగా  సంకల్పంగా ప్రకటించారు.

వరంగల్ జిల్లా కన్వీనర్ బండారు రఘు, ప్రధాన కార్యదర్శి లక్కి సమ్మయ్య, భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు సదానందం, ప్రధానకార్యదర్శి కృష్ణమూర్తి, కార్యదర్శి చేరాలు, ప్రచార కార్యదర్శి బాబూరావు మొదలైన వారు ఏడు రోజుల పాటు అన్ని కులాల వారి ఇంటింటికీ వెళ్ళి ఆహ్వానించడం వల్ల గ్రామంలో గత రోజుల్లో కలిసి మెలిసి వున్న సంఘటన లు అందరూ గుర్తుతెచ్చుకున్నారు. గ్రామానికి బయట వున్న వారి బంధువులను పిలిచి, పండుగ వాతావరణం లో గడిపారు.

సవర్ణకులాలు ఒక మెట్టు దిగితే, నిమ్నకులాలవారు ఆత్మ విశ్వాసం తో ఒక మెట్టు పైకి ఎక్కి సామరస్యం తో పరస్పరం ప్రేమ తో జీవించాలని భావించినప్పుడు సమరసత సాధ్యం అవుతుందని అందరూ గుర్తించటమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని వక్తలు తెలియచేశారు.