Home News నిఘా నీడలో కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం మతోన్మాద సంస్థ పి.ఎఫ్.ఐ

నిఘా నీడలో కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం మతోన్మాద సంస్థ పి.ఎఫ్.ఐ

0
SHARE

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) ఓ తీవ్రవాద, ముస్లిం మతోన్మాద సంస్థ. 2006లో ఏర్పడింది. దేశంలో మానవహక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతామనే ఈ సంస్థ, ప్రజల జీవించే హక్కునే శాసిస్తున్నది. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను, అసమానతలను సరి చేస్తామనే పీఎఫ్‌ఐ నిషేధిత ‘సిమి’ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి మారు రూపమే. అనేక తీవ్రవాద ముఠాలతో సంబంధాలు, ఆయుధాలు కలిగిఉండడం, కిడ్నాపులు, హత్యలు చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు, లవ్‌జిహాదీ వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ యిది. 2010, 2012, 2013 సంవత్సరాలలో కేరళ పోలీసులు జరిపిన దాడుల్లో బాంబులు, ఆయుధాలు, సీడీలు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 2012లో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ సంస్థ దేశమంతా ప్రదర్శనలు జరిపింది. ముస్లింలకు రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్పుల విషయమై కూడా సంస్థ పోరాటాలు చేస్తుంది. కేరళ ఈ సంస్థకు కేంద్రం. అక్కడ ప్రస్తుతం అరాచకం రాజ్యమేలుతోంది. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ‘లవ్‌జిహాద్’ను కొట్టిపారేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. కేరళలో అత్యధికంగా ‘లవ్‌జిహాద్’కు ఘటనలు జరిగాయి. మే 2013లో ఎన్‌ఐఎ దర్యాప్తులో, సుధేంద్ర, విఘ్నేశ్, అనే యిద్దరు బాలురను 2011లో కిడ్నాప్ చేసి హత్య చేసినందుకు ఐదు కోట్ల రూపాయలు ఈ సంస్థ తమ నిధికి జమ చేసుకుందని తేలింది. 2012లో కేరళ ప్రభుత్వం కూడా పీఎఫ్‌ఐకు 27 హత్యలతో సంబంధం ఉందని హైకోర్టుకు తెలిపింది. ఇవికాక 86 యితర హత్యాప్రయత్నాలు, వివరాలు 106 మత ఘర్షణల ఘటనలతో కూడా ఈ సంస్థకు సంబంధం ఉందని తేలింది. సచిన్ గోపాల్, విశాల్ అన్న యిద్దరు ఏబీవీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 2012 అస్సాం ఘర్షణల తరువాత దక్షిణాదిన ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల ప్రజలపై ద్వేషపూరిత ప్రచారం చేసింది. పీఎఫ్‌ఐ భయంతో ‘పూనా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీల నుండి సుమారు 30 వేలమంది ఈశాన్య సరిహద్దు రాష్ట్ర ప్రజలు తమతమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.

తాలిబాన్ తరహాలో ఈ సంస్థ కోర్టులు నిర్వహించి తమ లక్షిత సూచీలోని వారికి శిక్షలు విధిస్తుంటుంది. 2011 ముంబై పేలుళ్లు, 2012లో పూనా పేలుళ్లు, 2013లో హైదరాబాద్ పేలుళ్ల సంఘటనలలో ఈ సంస్థకు ప్రమేయం ఉందని 2015లో నిఘావర్గాలు ఆరోపించాయి. తమ అసలు రంగును దాచుకునేందుకు సేవ, సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములవుతుంది. టైమ్స్ నౌ చానెల్‌లో అనేక ఏళ్లు పనిచేసిన జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి అనేకమంది దేశద్రోహులైన మేధావులను రచ్చకీడ్చడం తెలిసిందే. పీఎఫ్‌ఐ ఈ ఛానల్‌ను నిషేధించమని ఉద్యమం మొదలెట్టింది. ఆగస్టు, సెప్టెంబరు 2017 మాసాలలో ఈ ఛానెల్ పీఎఫ్‌ఐ తీవ్రవాద నేపథ్యం బయటపెట్టింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఎన్‌ఐఎ యిచ్చిన నివేదికలో పీఎఫ్‌ఐకి సంబంధించిన అనేక ఆరోపణలున్నాయి. పీఎఫ్‌ఐకి హవాలా నిధులు సమకూరుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి ఈ డబ్బు వస్తోంది. మతం మార్పిడుల కోసం ఈ ధనం అందుతోంది. గృహమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పీఐఫ్‌ఐకి కార్యకలాపాలపట్ల నిఘాను తీవ్రతరం చేసేందుకు ఆదేశాలిచ్చారు. ఇండియాటుడే చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పీఎఫ్‌ఐ మహిళావిభాగం అధినాయకి ఎ.ఎస్.జైనాబా పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థ సత్యసరాని మూకుమ్మడి మతమార్పిడులు చేయడాన్ని వొప్పుకుంది. కానీ తరువాత బుకాయించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 20వేలమంది హిందూ స్ర్తిలు ఈ లవ్‌జిహాద్ చర్యకు బలయ్యారని దైనిక్ జాగరణ్ వ్రాసింది. కేంద్ర హోంశాఖ, మళ్లీ జైనబాను ప్రశ్నించనుంది. న్యాయవిరుద్ధ కార్యకలాపాల వ్యతిరేక చట్టం (ఖశ్ఘతీచిఖ ఘషఆజ్పజఆజళఒ ఔళ్పళశఆజ్యశ ఘషఆ) కింద ఆమెను, ఆ సమూహాన్ని నిషేధించే అవకాశం ఉంది. మైనారిటీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే తమ ధ్యేయమనే పిఎఫ్‌ఐ, తన కార్యకలాపాలను రహస్యంగా ఎందుకు నిర్వర్తిస్తుంది? పీఎఫ్‌ఐ అధికార సభ్యులంతా వొకప్పుడు ‘సిమి’లో ఉన్నవారే? 1984లో ఇ.ఎమ్.అబ్దుల్ రహీమ్ ‘సిమి’కి అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన పీఎఫ్‌ఐ మాజీ చైర్మన్. ఇ.అబుబకర్ 1982-84 మధ్య కేరళలో అధ్యక్షుడు. ఆయన ఆ సంస్థ స్థాపకుల్లో ఒకడు. పి.కోయా ‘సిమి’కి 1978లో కేరళలో అధ్యక్షుడు. ప్రస్తుతం పిఎఫ్‌ఐ కార్యనిర్వాహక వర్గంలో వున్నాడు. తాజాగా ఎన్‌ఐఏ, పిఎఫ్‌ఐపై ఓ చార్జిషీట్ రూపొందించింది. ఇందులో పీఎఫ్‌ఐ చేసిన నేరాల చిట్టా వుంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేష్ హత్య విషయమై జరిగిన విచారణతో పీఎఫ్‌ఐ డొంక కదిలింది. ఆ సంస్థ నాయకులు వివిధ సమావేశాలలో, సభలలో ఇస్లాం మాత్రమే సమస్యలకు పరిష్కారం అని చెబుతుంటారు. దళితులను కౌగిలించుకుందాం అంటారు. మహమ్మద్ ఇక్లాబ్ రాసిన సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా పాడుతుంటారు. నాడు ముస్లింలీగ్ కూడా ఈ పాటనే ఎన్నుకుంది. సెక్యులరిజం ముసుగు వేసుకుని నెహ్రూ నుంచి కాంగ్రెస్ నేతలంతా ఆ పాటకే సై అన్నారు. పీఎఫ్‌ఐ నాయకులు మన దేశ ప్రజలు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకంటే ఘోరంగా ఆకలితో అలమటిస్తున్నారని గగ్గోలు పెడుతూంటారు. సుప్రీంకోర్టు యిచ్చిన ‘తలాక్’ తీర్పును తప్పుబడుతూంటారు. కులం, మతం, తీవ్రవాదం, నేరప్రవృత్తి, హత్యలు, బాంబుదాడులు, ద్వేషపూరిత ప్రసంగాలు వదిలి దేశం అభివృద్ధి బాటలో నడవాలనుకుంటున్నది. సామాజిక స్పృహ ఉన్న మేధావులు సాధించడం మాని స్పందించడం మొదలుపెడితే మార్పు సుసాధ్యమవుతుంది.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 9676190888

(ఆంధ్రభూమి సౌజన్యం తో)