Home News తీర్పు అమలులో ఆలయంపై ఉన్న శ్రద్ధ చర్చి మీద లేదా?: కేరళ హైకోర్టు 

తీర్పు అమలులో ఆలయంపై ఉన్న శ్రద్ధ చర్చి మీద లేదా?: కేరళ హైకోర్టు 

0
SHARE
కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పిరవోమ్ చర్చ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని కేరళ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ క్రైస్తవుల్లోని ఒక వర్గం తిరిగి కేరళ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విచారణ సందర్భంగా హైకోర్టు పరోక్షంగా శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తూ.. సుప్రీం ఇచ్చిన తీర్పు అమలు కోసం 2000 మంది పోలీసులను ఆలయంలో ప్రవేశించే మహిళల భద్రత కోసం నియమించిన ప్రభుత్వం గతంలో సుప్రీం కోర్టు పిరవోమ్ చర్చి కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? కేవలం ఆలయం విషయలంలో మాత్రమే సుప్రీం తీర్పు అమలుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడంలో ఉద్దేశం ఏమిటి అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కేరళ ప్రభుత్వం పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పింది.
ఏమిటీ పిరవోమ్ చర్చి వివాదం?:
జాకోబైట్ సిరియన్ చర్చి ఆధీనంలో ఉంటున్న పిరవోమ్ చర్చిని తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకున్న ఆర్థోడాక్స్ చర్చి వ్యవహారంలో గతంలో సుప్రీం కోర్టు ఏప్రిల్ 19, 2018న తీర్పు ఇచ్చింది. జాకోబైట్ సిరియన్ చర్చికి అనుకూలంగా వచ్చిన ఆ తీర్పులో.. పిరవోమ్ చర్చి అనుసరిస్తున్న1934 సంవత్సరం నాటి మలంకర ఆర్థోడాక్స్ చర్చి నిబంధనల ప్రకారం అది జాబాకైట్ వర్గీయులకే చెందుతుందని.. ఆ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనేవారిలో 80 శాతం మంది జాకోబైట్ వర్గీయులే అయినందున దాని నిర్వహణ వ్యవహారాలు కూడా వారికే అప్పగిస్తున్నామంటూ సుప్రీం తెలియజేసింది. అయినప్పటికీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుని అమలుచేయకపోగా జాకోబైట్లు, సిరియన్ ఆర్థోడాక్స్ వర్గీయులతో సంప్రదింపులు జరుపుతోందని, సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ తమపై కేరళ ప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందంటూ తాజాగా జాకోబైట్ సిరియన్ చర్చి ప్రతినిధులు తిరిగి హైకోర్టుని ఆశ్రయించారు.
Source: Organiser