
- హిందూ మతానికి తిరిగి వచ్చిన యువకుడు
ఆమీర్ ఖాన్ అనే యువకుడు హిందూ మతానికి తిరిగి వచ్చాడు. తన పేరును అభయ్ త్యాగి అని మార్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం మహాయజ్ఞం జరిగింది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ అనే యువకుడు పురోహితుల సమక్షంలో మంత్రోచ్ఛారణ నడుమ హిందూ మతానికి తిరిగి వచ్చాడు. తన పూర్వీకులు హిందూ మతానికి చెందినవారని అతడు చెప్పాడు. అయితే ఈ విషయం తనకు ఇటీవల తెలిసిందని తెలిపాడు. యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత హిందూ మతం విశిష్టత తనకు తెలిసివచ్చిందని చెప్పాడు. అందుకే మహా యజ్ఞ వేదిక వద్ద హిందూ మతానికి తాను తిరిగివచ్చానని అతడు తెలిపాడు. తాను హిందూ మతానికి తిరిగి రావడం వెనుక ఎవరి ప్రోద్బలం కానీ నిర్బంధం కానీ లేదని స్పష్టం చేశాడు.