RSS ABKM 2016 చివరి రోజు ముఖ్యాంశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండల బైఠక్ చివరి రోజున ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి మీడియాతో ముచ్చటించారు.
దానిలోని ముఖ్యాంశాలు:
పశ్చిమ బెంగాల్ , తమిళ నాడు మరియు కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో కేవలం హిందుత్వ కార్యకర్తల పైనే కాకుండా సంపూర్ణ హిందూ సమాజం పై పెరుగుతున్న అతివాద జిహాది శక్తుల దాడులను మరియు ఆయా రాష్ట్రాలలో పై సంఘటనల పట్ల ప్రభుత్వ నిర్లిప్తతను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.
ఇప్పటి వరకు సంఘం విస్తరించి దేశవ్యాప్తంగా 44000 గ్రామాల్లో 70000 పైగా శాఖలు, మిలన్ లను నడుపుతోంది. మార్చి 2017 కల్లా 75000 శాఖలు/ మిలన్ లను చేరుకోవాలనే లక్ష్యంతో సంఘం పని చేస్తోంది. సమాజం లో ఉన్న కుల వివక్షను రూపుమాపాలని, మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా వారు స్వేఛ్చగా జీవించగలిగే వాతావరణం నిర్మించవలసిన బాధ్యత సమాజంపైనే ఉందని వారు పిలుపినిచ్చారు. అంతే కాకుండా, ప్రధాన మంత్రి గారి పిలుపు మేరకు, మనం అంతా స్వచ్ఛ భారత్ ఉద్యమంలో క్రియా శీలంగా పాల్గొని, స్వచ్ఛ మరియు ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించడంలో భాగస్వాములం కావాలని వారు అన్నారు.
మీడియా ప్రతినిధుల సమావేశంలోని ప్రశ్నోత్తరాలు.
రామ మందిరం :
ఇది యావత్ హిందూ సమాజం మొత్తానికి హృదయానికి అతి దగ్గరైన విషయం. అంతే కాకుండా ఆర్.ఎస్.ఎస్ కూడా గత 30 సంవత్సరాలుగా ఈ విషయంపై దృష్టి సారించింది. అలహాబాద్ హై కోర్టు తీర్పు తర్వాత ఆ స్థలంలో భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలన్న విషయం స్పష్టమైంది. కాకపోతే, మనం అందరం సుప్రీం కోర్టు తీర్పు కొరకు వేచి చూడాలి.
మూడుసార్లు తలాక్ మరియు యూనిఫాం సివిల్ కోడ్ :
మూడు సార్లు తలాక్ అన్నది ముస్లిం సమాజం యొక్క అంతర్గత విషయం, లింగవివక్ష సరి అయినది కాదు. మహిళల సంక్షేమం , వారిని రక్షించడం అన్నది సమాజం ముందున్న సవాలు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ మానవత కోణంలో ఆలోచించ వలసిన అవసరం ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ పై మాట్లాడుతూ, వివక్షకి ఆస్కారం లేని న్యాయ వ్యవస్థని రూపొందించాలి, అలాగే సమాజంలోని సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కూడా చూడవలసిన అవసరం ఉంది అని అన్నారు.
చైనా వస్తువల వినియోగం:
పై ప్రశ్నకి స్పందిస్తూ, శ్రీ భయ్యాజీ జోషి కేవలం చైనా వస్తువులనే కాకుండా వీలైనంత వరకు మనం స్వదేశీ వస్తువులనే వాడాలని అన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వాటిలో ప్రత్యామ్నాయం లేని వస్తువులు మినహా, మిగిలిన అవసరాలకై భారతీయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి.
గోరక్షణ :
గోసేవ, గోరక్షణ పట్ల ఆర్.ఎస్.ఎస్ సరసంఘచాలక్ విస్తృతంగా విజయదశమి ప్రసంగంలో వివరించారు. గోరక్షణ అనే విషయాన్నీ కేవలం మతం కోణంలోనే కాకుండా, భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశీయ గోసంతతి వెన్నుముఖ లాంటిది అనే విషయాన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. గో ఆధారిత వ్యవసాయంతో విపరీతమైన రసాయనాల వాడకం వాలన క్షీణిస్తున్నభూసారానికి పరిష్కరించవచ్చు.
మైనారిటీ -మెజారిటీ :
“భారతీయులమైన మేము” అనే వాక్యం తో రాజ్యాంగం ప్రారంభం అవుతుంది. రాజ్యాంగంలో మెజారిటీ – మైనారిటీ అనే భావానికి ఎలాంటి చోటు లేదు. అర్ధాన్నివక్రీకరించడం వలన మనమందరం మైనారిటీ- మెజారిటీ రాజకీయాలలో ఇరుక్కొని పోయాం.
పాకిస్తాన్ కు చెందిన కళాకారులకు అనుమతి ఇవ్వవచ్చా?
కల అనేది విశ్వవ్యాప్తమైనది, అదే విధంగా కళాకారుడు కూడా. కాని ఒకవేళ కళాకారుడు మన దేశాన్ని గౌరవించనపుడు, అలంటి వాళ్ళను మనం ఎందుకు అనుమతించాలి?
సామజిక న్యాయం మరియు మనుధర్మ శాస్త్రం:
మనుధర్మ శాస్త్రాన్ని వదిలిపెట్టి ఆర్.ఎస్.ఎస్ కొత్తగా సామజిక న్యాయాన్ని ఎత్తుకుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆర్.ఎస్.ఎస్ ప్రతిసారి చెప్పేది మనిషి పుట్టుక, కులం ఆధారంగా వివక్షను విశ్వసించదు.
సాయి బాబా:
హిందువులు ప్రకృతి మొత్తం ఒక దైవ సృష్టి అని, అంతే సహజంగా ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తారు. ఒకవేళ సాయిబాబా అనుచరులు గుడి కట్టాలి అనుకుంటే అది వారి ఇష్టం.
సర్జికల్ దాడులపై రాజకీయాలు:
దేశ భద్రత దృష్ట్యా, ప్రభుత్వం ఒక దృడ నిర్ణయాన్ని తీసుకుంది, సైన్యం దాన్ని ధైర్యంగా అమలుపరించింది. అందువలన సైన్యాన్ని మరియు ప్రభుత్వాన్ని వారు చేపట్టిన కీలక దాడుల పట్ల మేము అభినందిస్తున్నాము.
మరి కొన్ని రోజులలో దేశం దీపావళి సంబురాలు జరుపుకుంటుంది. ఆ పండుగ సందేశమే చీకటిని పారదోలి వెలుగును తీసుకోనిరావడం.
ఈ సందర్బంగా దేశం ఉజ్వలమైన భవిషత్తు దిశగా సాగాలి అని కోరుకుంటూ మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు.