Home News నాగ‌పూర్‌లో మార్చి 15,16,17 ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భార‌తీయ ప్రతినిధి స‌భ‌లు

నాగ‌పూర్‌లో మార్చి 15,16,17 ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భార‌తీయ ప్రతినిధి స‌భ‌లు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15-17 తేదీలలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌లోని రేషిమ్ బాగ్‌లోని ‘స్మృతి భవన్’ ప్రాంగ‌ణంలో జరగ‌నున్న‌ట్టు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార‌ ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో 2023-24 సంవత్సరంలో సంఘం చేసిన అన్ని పనులు, సేవా కార్యాలను సమీక్షించ‌నున్నారు. అలాగే 2024-25 సంవత్సరానికి సంఘ ప్రణాళికపై కూడా విస్తృత చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో పూజనీయ సర్ సంఘచాలక్ జీ, అఖిల భారతీయ కార్యకర్తల ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా నిర్ణ‌యిస్తారు.  అలాగే స్వయంసేవకుల శిక్షణ కోసం కొత్త సంఘ శిక్షా వర్గల‌ ప్రణాళిక అమలును పరిశీలిస్తారు.

సంఘ పని విస్తరణ ప్రణాళికను బలోపేతం చేయడంతో పాటు, రాబోయే శతాబ్ది సంవత్సరం (2025) కార్యక్రమాలపై చర్చ జరుగుతుంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యమైన అంశాలపై కూడా తీర్మానాల ఆమోదం ఉంటుంది.

సంఘ ప్రతినిధి స‌మావేశాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్ర‌తీ ఏడాది జ‌రుగుతాయి. ప్రతి మూడవ సంవత్సరం ప్రతినిధి సభ నాగ్‌పూర్‌లో జరుగుతుంది. 45 ప్రాంతాల నుంచి 1500 మంది ప్రతినిధులు ప్రతినిధి సభలో పాల్గొంటారు. పూజనీయ సర్ సంఘ‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ, స‌హ స‌ర్ కార్య‌వాహ‌లు, అఖిల భారతీయ కార్యకారిణి, క్షేత్ర, ప్రాంత కార్యకారిణి, అన్ని విభాగ్ ల‌ ప్రచారకులు, సంఘ ప్రేరేపిత సంస్థల కార్యకర్తలు పాల్గొంటారు.