
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనవసరమైన వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన అంశాలలో సుహృద్భావ పూర్వకమైన చర్చలు, అభిప్రాయాల వినిమయం ద్వారా సమాజంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని, రిజర్వేషన్ల వంటి సున్నితమైన విషయాల్లో ఇలాంటి పద్దతిని పాటించాలని ఆయన సూచించారు.
ఇక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను పూర్తిగా సమర్ధిస్తున్నట్లు ఆర్.ఎస్.ఎస్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.
– అరుణ్ కుమార్,
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్