Home News అఖిల భార‌తీయ వ‌న‌వాసీ క‌ళ్యాణ్ ఆశ్ర‌మం

అఖిల భార‌తీయ వ‌న‌వాసీ క‌ళ్యాణ్ ఆశ్ర‌మం

0
SHARE
అఖిల భార‌త కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు 6,7,8 అక్టోబ‌ర్ 2023
జీ 20 సదస్సు సఫల నిర్వహణ భారత ప్రభుత్వానికి కళ్యాణాశ్రమ్ అభినందనలు
ఈ సారి ఢిల్లీలో జరిగిన 20 సదస్సును భారత్ అధ్యక్షత వహించడం మాకు చాలా ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ సారి జరిగిన సదస్సుకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు భారత దేశపు గౌరవమయమైన సంప్రదాయాన్ని అనుసరించి మనం ఘనస్వాగతాన్ని ఇచ్చాము. విభిన్న ఆలోచనా విధానాలున్నప్పటికీ అందరినీ కలుపుకుని వ్యవహరించి అందరి ఆమోదంతో ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదింపచేశాము. భారత్ యావత్ ప్రపంచానికి నాయకత్వం వహించగలదని కూడా ఋజువు చేశాము. ఈ కారణాల వల్ల వనవాసి కళ్యాణ్ ఆశ్రమం భారత ప్రభుత్వాన్ని అభినందిస్తోంది. ప్రపంచమంతా ఒక వసుదైవ కుటుంబం..
విజయవంతంగా చంద్రయాన్ ప్రయోగం.
కొద్ది కాలం క్రితమే భారతదేశపు శాస్త్రవేత్తలు చంద్రయాన్ ను విజయవంతంగా ప్రయోగించి, రానున్న రోజుల్లో శివశక్తిగా పేరందుకోబోతున్న చందమామ దక్షిణ భాగాన మన వ్యోమనౌకను దిగేలా చేశారు. ఈ రకంగా చంద్రమండలం దక్షిణ భాగానికి చేరుకున్న ఏకైక దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. ఇది భారత దేశానికి హర్షానందాలను కలుగచేసింది.  దీనితో ముడిపడ్డ శాస్త్రవేత్తలందరినీ, భారత ప్రభుత్వాన్ని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అభినందిస్తోంది. ఈ శాస్త్రవేత్తల్లో ఝార్ఖండ్ లోని వనవాసీ కళ్యాణాశ్రమం బడిలో చదువుకున్న ఒక గిరిజన విద్యార్ధి కూడా ఉన్నారు. డాక్టర్ రోహన్ కుమార్ యాదవ్ అని శాస్త్రవేత్త గిరిజన సమాజానికి కీర్తి సంపాదించి పెట్టాడు. ఇది కళ్యాణాశ్రమ్ కే కాక యావత్ వనవాసీ సముదాయానికి కూడా గర్వకారణం..
నారీ శక్తి వందస్ చట్టం
ఈ సారి వినాయక చవితి రోజు భారత చరిత్రలో ఒక మరపురాని రోజు. ఆ రోజున మన సరికొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో నారీ శక్తి వందన్ బిల్లు ఆమోదం పొందింది. ఒకరిద్దరు సభ్యులను వదిలేస్తే మిగతా అన్ని పార్టీలూ ఈ బిల్లును సమర్థించాయి. ఇకనుంచి జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లభిస్తుంది. ఈ విషయంలోనూ కళ్యాణాశ్రమ్ భారత ప్రభుత్వా అభినందిస్తోంది.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మల పేరిట ఏర్పాటు కాబోతోంది. అక్టోబర్ 1, 2023 నాడు పాలమూరులో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణలోని ములుగులో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. గిరిజన
కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తెలంగాణాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అందుతున్న వార్తల ప్రకారం ఇందుకు గానూ 900 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి తోడ్పడటం, విద్యాపరమైన నాణ్యతను పెంపొందించడం తో పాటు గిరిజనుల కళా సంస్కృతులు, వారి పరిజ్ఞానం పై పరిశోధనలకై సదుపాయాలను అందించి, ఒక దిశను ఇస్తుంది. ఇది తెలంగాణాలోని తెలంగాణాలోని గిరిజన, వనవాసీ జనాభాకు ఉన్నత విద్య, ఉత్తమ జ్ఞానాన్ని అందించడంలో తోడ్పడుతుంది. మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.