Home News పారుశుద్ద్య కార్మికుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సమరసతా వేదిక సర్వే మరియు వారికి గౌరవ సత్కారం

పారుశుద్ద్య కార్మికుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సమరసతా వేదిక సర్వే మరియు వారికి గౌరవ సత్కారం

0
SHARE

స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా సమాజంలో నేటికి అసమానతలు, కుల వివక్షత, అంటరానితనం వేళ్లూనికుని ఉన్నదని, ఎందరో సంఘసంస్కర్తలు వందల సంవత్సరాలుగా కృషిచేసి ఆదర్శ సమాజ నిర్మాణానికి ప్రయత్నించారని, అదే దారిలో నేటితరం పారుశుద్యపు పనులను చేస్తున్న వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని, ఆ కుటుంబాల్లోని పిల్లల విద్య, ఆర్థిక, అభివృద్ధికి యోజన చేయవలసిన అవసరం ఉందని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ పేర్కొన్నారు.

నేటికి మానవుల మల, మూత్రాదులను భుజాల మీద మోసుకుపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారని, అలాగే డ్రైనేజీల్లో దిగి అనారోగ్యం పాలై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నవాళ్ళు ఎందరో ఉన్నారన్నారు.ఈ హీనమైన పనిని ప్రభుత్వం నిషేధించినప్పటికి ఇంకా కొనసాగుతూ ఉండటం దురదృష్టకరమని, గత రెండు సంవత్సరాలలో 800 పైగా మృత్యువాత పడ్డారన్నారు.

సామాజిక సమరసతా వేదిక, తెలంగాణా ప్రాంతంలోని అన్ని జిల్లా కేంద్రాలలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆర్థిక ,సామాజిక జీవన స్థితగతులను సర్వే చెయ్యాలని, వారిని సత్కరించాలని నిర్ణయించిందని, ఇప్పటికి మహబూబ్ నగర్ లో 60 మంది, కరీంనగర్ లో 120మంది, ఆదిలాబాద్ లో 250మంది,. నిజమాబాద్ లో 100మంది కార్మికులను సర్వే చేయటం జరిగిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో అమ్మవారి ఉపాసకులు ఆదిత్య పరశ్రీ కిషన్ మహరాజ్, కరీంనగర్ జిల్లా సబ్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ కమిషనర్లు వేణుగోపాల్ రెడ్డి (కరీంనగర్ ), మారుతీ ప్రసాద్ ( ఆదిలాబాద్ ), విద్యుత్ శాఖ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ( నిజామాబాద్ ), సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షులు ఇప్పకాయల హరిదాస్ గారు, జిల్లా సంయోజక్ సోమ దేవేందర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సృజన కుమార్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.