కామాఖ్య ఆలయంలో ప్రారంభమైన ”అంబుబాచి మేళా”

    0
    SHARE

    అత్యంత ప్రసిద్ధమైన కామాఖ్య ఆలయంలో వార్షిక అంబుబాచి మేళా ప్రారంభమైంది. అలాగే జాతర కూడా ప్రారంభమైంది. అంబుబాచి మేళా అనేది కామాఖ్య ఆలయంలో ప్రతి యేడాది జరిగే వార్షిక జాతర. కామాఖ్య దేవి వార్షిక రుతుక్రమం వేడుకగా చెప్పుకుంటారు. ఈ అంబుబాచి మహోత్సవం నేపథ్యంలో అసోం ప్రభుత్వం, కామాఖ్య ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లూ చేసింది. దీనికి సంబంధించిన అన్ని విభాగాలు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని అసోం పర్యాటక మంత్రి జయంత మల్లా బరుహ ప్రకటించారు.

    ఈ మేళా నేపథ్యంలో ఈ నెల 26,27 తేదీల్లో వీఐపీ పాసులను రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంబుబాచి మేళా ప్రవృత్తి ఉదయం 8:45 గంటలకు ప్రదర్శించారు. ఈ ప్రవృత్తి తర్వాత మూడు గంటలకు ప్రధాన ఆలయ ద్వారాలు మూసివేశారు.ఈ ప్రవృత్తి అనంతరం మూడు పగళ్లు, మూడు రాత్రుల్లో ప్రధాన ద్వారాలు మూసివేస్తారు. మరోవైపు మేళా నివృత్తి ఈ నెల 26 న నిర్వహిస్తామని, అదే రోజు ఉదయం ఆలయ ప్రధాన ద్వారాలు తెరుస్తామని కమిటీ తెలిపింది. అన్ని రకాల పూజలు, సేవలు కూడా నివృత్తి తర్వాతే చేస్తామని తెలిపారు.