Home News మరో సారి భారిగా చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం

మరో సారి భారిగా చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం

0
SHARE
సరిహద్దుల విషయంలో భారత్‌, చైనా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ దేశం భారత్‌పై దాడికి యత్నించడంతో భారత ప్రభుత్వం పబ్జీ (PubG)తో సహా మరో 118 చైనా యాప్‌లపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో ఈ యాప్‌లు వాడుతున్న వినియోగదారుల డేటాను దేశం వెలుపల ఉన్న సర్వర్లకు అనధికారికంగా దొంగిలించడం, రహస్యంగా పంపించడం కోసం ఈ యాప్‌లను చైనా దుర్వినియోగం చేస్తోందిన సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ హానికరమైన యాప్‌లను నిరోధించడానికి ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ హోంమంత్రిత్వ శాఖకు సిఫారసు చేసిందని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని పబ్ జీ ని ప్రభుత్వము నిషేధించింది.
రెండు నెలల క్రితం గాల్వాన్ లోయలో వద్దా అకారణంగా గొడవకు దిగిన చైనా 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. ఆ సమయంలో జాతీయ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం 59 చైనా యాప్ లను నిషేధించింది. సరిహద్దు అంశంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి చైనా తన దుర్బుద్ధి చూపుతోంది. అయితే భారత్ లో ఎక్కువ మంది వినియోగిస్తున్న చైనా యాప్ ల ద్వారా డ్రాగన్ దేశం సాంకేతికంగా కుట్ర చేయబోతున్న ముందు జాగ్రత్తతో కేంద్ర ప్రభుత్వం ఈసారి పబ్జి తో సహా మరో 118 చైనా యాప్ లను నిషేధించింది. ఈ మేరకు ప్లేస్టోర్ నుండి ఈ యాప్ లను తొలగించారు.
Source : RepublicWorld