Home News సేవా భారతి ఆధ్వర్యంలో కోవిడ్ -19 సేవా కార్యక్రమాలు

సేవా భారతి ఆధ్వర్యంలో కోవిడ్ -19 సేవా కార్యక్రమాలు

0
SHARE
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సేవా భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగా సేవాభారతి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి కోవిడ్ 19 సోకిన వారికి అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత సలహాలు, సూచనలతో పాటు, కచ్చితంగా అవసరం ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేస్తున్నారు
అయితే  కొంతమంది సేవాభారతి  రూ 5000కి  కిట్ అందజేస్తున్నారని వాట్సాప్ లో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కిట్  5000 రూపాయలు కాదని సేవాభారతి ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
ఈ హెల్ప్ లైన్ ద్వారా సేవాభారతి –
◆ ఉచితంగా టెలి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నది.
◆ కోవిడ్ బారిన పడిన లేదా ప్రాథమిక లక్షణాలున్న వారు నిస్సంకోచంగా helpline ను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకున్న తర్వాత ఒక డాక్టర్ సలహాలు ఇస్తారు. డాక్టర్ తో మాట్లాడి మీరు తగిన వైద్య సహాయం పొందవచ్చు.
◆ సేవాభారతి ఉచితంగా మెడికల్ కిట్ అందజేయడం వెనుక ముఖ్య ఉద్దేశం  కోవిడ్ బారినపడి ఎవరైతే హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో, హోంఐసోలేషన్ లోనే చికిత్స పొందేవారికి సహాయం అందించడం.
★ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ముందుగా స్థానిక రోగికి  తెలిసిన (తెలుపబడిన) సేవాభారతి కార్యకర్త ను సంప్రదించి  ఆధార్ కార్డు నెంబరు, రిజిస్టర్ అయిన నంబరు, పాజిటివ్ రిపోర్ట్ వివరాలు తెలియజేయాలి.
★ కోవిడ్ వ్యాధి నిర్ధారణ జరిగిన వారంలోపు సంప్రదించినవారికే కిట్ ఇస్తారు.
★ కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేయడం ఉత్తమం. ఆవిధంగా  మరొకరికి ప్రాణదాత కాగలరు.
ఈ కిట్లు డాక్టర్‌ ల సలహాల మేరకు అందచేయటం జరుగుతోంది. ఈ కోవిడ్‌ -19 కిట్‌ లు సేవాభారతి కాల్‌ సెంటర్‌ కి ఫోన్‌ చేసిన వారందరికీ ఇవ్వబడదు. సోషల్‌ మీడియాలో ఈ విషయంపై
దుష్ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదని, ఈ విషయాన్ని గమనించి ఉచిత కిట్లు అవసరమైనవారికి మాత్రమే అందేట్లు అందరు సహకరించాలని సేవాభారతి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.