Home News వనపర్తిలో మసీదు మరమ్మతులు… బయట పడ్డ రాతి శిలలు

వనపర్తిలో మసీదు మరమ్మతులు… బయట పడ్డ రాతి శిలలు

0
SHARE

వనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మసీదు పునరుద్ధరణ పనుల్లో పురాతన స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి. ఖిల్లాగణపురం బస్టాండు సమీపంలోని జామా మసీదు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.80 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజులుగా మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే మసీదు చుట్టు పక్కల వున్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించి, శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలోనే అక్కడ స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి.

ఈ విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ నేతలు అక్కడికి చేరుకొని, స్తంభాలు, రాతిశిలలను పరిశీలించారు. శతాబ్దాల క్రితం ఇదే స్థలంలో ఓ దేవాలయం వున్నట్లు పూర్వీకులు చెబుతుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత తర్వాత ఈ స్థలంలో మసీదు నిర్మించి వుంటారని అభిప్రాయపడ్డారు. మసీదు పునరుద్ధరణ జరుగుతుండగా… స్తంభాలు, రాతిశిలలు బయటపడటంతో పురావస్తు శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా వాటిని పరిశీలించాలని భజరంగ్ దళ్ నేతలు సూచించారు.

Read also : ఇస్లామ్ పాలకుల విధ్వంసం: ఆలయాల్లో మసీదులు, దర్గాలు

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం…