Home News VIDEO: ఒరిస్సా స్వాతంత్య్ర‌ సమరయోధుడు చక్రబిసోయి

VIDEO: ఒరిస్సా స్వాతంత్య్ర‌ సమరయోధుడు చక్రబిసోయి

0
SHARE

సాధు సమాజాన్ని రక్షించడానికి, దుర్మార్గులను నాశనంచేసి, ధర్మస్థాపన చేయాలనే ఉద్దేశ్యాలతో వీరపురుషులు పుడుతుంటారు. అలాంటి వీరుడే చక్రబిసోయి. 1823 పుష్యమాస శుక్ర దశమినాడు ఒరిస్సాలోని కాంగ్జా జిల్లాలోని, ఫుల్బానీ అనే అటవీ ప్రాంతంలోని తోరాబాదీ అనే వనవాసీ గ్రామంలో బనియాకంద్ కుటుంబంలో ఇతను జన్మించాడు. ఫుల్బానిలో ఎక్కువగా కందతెగ వనవాసులు నివసించేవారు. వారు నివసించే ఈ పర్వత ప్రాంతాన్ని బోధమండలం అంటారు. ఆనాడు రాజ్యంలోని విభాగాలను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పరగణాగా పిలిచేవారు. అలాంటి ప్రతి పరగణాకు నియమించబడిన అధికారిని “బిసాయి” అని అనేవారు. అలాంటి ఒక పరగణాకు అధికారి చక్ర.