Home News VIDEO: అన్నాప్రగడ తెగువ – సొంత కరెన్సీతో ప్రజాపాలన

VIDEO: అన్నాప్రగడ తెగువ – సొంత కరెన్సీతో ప్రజాపాలన

0
SHARE

స్వరాజ్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అక్కడ జైలుపాలై 1922లో విడుదలై గుంటూరుకు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు. 1924లో స్వాతంత్ర వీర సావర్కర్ సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్‌ చేరారు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్‌ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, భటుకేశ్వరదత్తు, సురేంద్రనాథ్‌ పాండే, రాజగురుతో అన్నాప్రగడ కామేశ్వరరావుకు స్నేహం కుదిరింది.