Home News పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)– దేశ వ్యతిరేక కార్యకలాపాలు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)– దేశ వ్యతిరేక కార్యకలాపాలు

0
SHARE

పి‌ఎఫ్‌ఐ సిద్ధాంతం  వ్యూహాలు:

  • భారతదేశ ప్రతిష్టను దిగజార్చటం,భారత్ ను విచ్ఛిన్నం చేయటం, భారత్ లో మతసామరస్యాన్ని నాశనం చేయడం
  • మతం పేరున దేశంలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించటం
  • ఇవన్నీ అమలు చేసేందుకు,ఒక వ్యవస్థను తయారుచేసుకున్నది –

అ) ముస్లింలు ఎప్పుడైనా నేరాలు, అల్లర్లకు పాల్పడి, కేసులు నమోదు అయితే, వాళ్ళకు సహాయంగా, ఒక న్యాయ విభాగం,

ఆ) ఘర్షణల ఉపశమన విభాగం – అల్లర్లు సృష్టించిన వాళ్ళకు ఆర్థిక సహాయం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం.

  • చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించటం : 

అ) బెంగళూరులో లాగా అల్లర్లు చేయటం, (ఆ) ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులను సమర్థించటం,

     ఇ) షార్జిల్ ఇమామ్, టుక్డే గుంపు వంటి అసాంఘిక శక్తులను సమర్థించడం హక్కులని ప్రచారం చేసింది.

“భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేసిన తర్వాత, పి‌ఎఫ్‌ఐ వేరే దేశాలకు వెళ్తుంది” అని `గల్ఫ్ తేజస్’ అనే పత్రిక మేనేజింగ్ ఎడిటర్, పి‌ఎఫ్‌ఐ స్థాపక సభ్యుడు, అహ్మద్ షరీఫ్ ప్రకటించాడు.

  • ముస్లిములపై దాడులు,ఫాసిజం, పోలీసు ఎన్కౌంటర్లు, బాబ్రీ దినం, అణచివేత వ్యతిరేకదినం, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య అంటూ ఏడాది పొడుగునా ముస్లింలను  రెచ్చగొడుతూ, భయపెడుతూ ఉంటుంది,
  • హషింపురా,గోధ్రా తరహా అల్లర్లను సృష్టించడానికి ప్రయత్నించడం
  • హత్రాస్ వంటి సున్నితమైన విషయాలను రాజకీయం చేయడం ద్వారా మతసామరస్యాన్ని చెడగొట్టటం.
  • భారత్ 75వ స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంలో “సేవ్ ది రిపబ్లిక్” పేరుతో 26 జనవరి,2022 నుండి 15 ఆగస్ట్, 2022 వరకూ ప్రచారం నిర్వహించి, దేశప్రతిష్ఠ దెబ్బతీయాలని పి‌ఎఫ్‌ఐ చాలా ప్రయత్నాలు చేసింది.
  • బెంగళూరు అల్లర్లలో దళిత ఎం‌ఎల్‌ఏ గృహదహనం,2 పోలీసు స్టేషన్ల దహనం వెనుక PFI,SDPI హస్తమున్నట్లు తేలింది. SDPI తానిసంద్ర ఆఫీసులో అల్లర్ల ప్రణాళిక గురించి ముందురోజు సమావేశం జరిగినట్లు నిర్ధారణ అయింది.
  • మధ్యప్రాచ్యంలో సోషల్ మీడియా ద్వారా,భారత్ లోని హిందువుల పట్ల ద్వేషం రగిల్చేందుకు ప్రయత్నం. ఇందులో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు, ఫౌలాద్ వంటి వాళ్ళు పాల్గొన్నారు.
  • 2012 ఆగస్టులో పి‌ఎఫ్‌ఐ తన నెట్ వర్క్ సామర్థ్యం పెంచింది. అస్సాంలో బోడోలపై బంగ్లాదేశ్ చొరబాటుదార్లు దాడి చేస్తే,కర్నాటకలో ఈశాన్యరాష్ట్రాల విద్యార్థులపై దాడులు జరుగుతున్నట్లు, ఇస్లాం తీవ్రవాదులు పుకార్లు సృష్టించారు. పాకిస్తాన్ సర్వర్ల నుండి అధికసంఖ్యలో వచ్చిన విద్వేషపూరిత సందేశాలను, పి‌ఎఫ్‌ఐ, బంగ్లాదేశ్ జిహాద్ ఉగ్రవాద సంస్థ,HUJIతో కలిపి వ్యాపింప జేశారు.

పి ఎఫ్ ఐ కి, అల్-ఖైదా కు పరోక్ష సంబంధం:

  • ISISకి అల్-ఖైదా తో సంబంధాలున్నాయని, కేరళ ప్రభుత్వ ఉపకార్యదర్శి (హోం) ఆర్. రాజశేఖరన్ నాయర్, కేరళ హైకోర్టుకిచ్చినప్రమాణపత్రం (అఫిడవిట్)లోతెలియజేశారు.
  • జమాత్-ఏ-ఇస్లామీ (JIH)పాత్ర;JIHà SIMI à INDIAN MUJAHIDEEN à(SIMI +NDF+KFD) àPFI
  • పి‌ఎఫ్‌ఐ కి యూ‌ఏ‌ఈ,సౌదీ అరేబియా, బహ్రాయిన్, కువైట్, ఖతార్, ఒమన్ (ఈదేశాలన్నీ నిధులు సమకూర్చుతున్నాయని గృహమంత్రిత్వశాఖ సమాచార పత్రం తెలియజేస్తోంది.),మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, టర్కీ, జర్మనీ, ఈజిప్టు, దక్షిణాఫ్రికా వంటి వివిధ దేశాలతో గట్టిసంబంధాలు ఉన్నాయి.
  • కోజీకోడ్ (కేరళ) లో 2017లో జరిగిన పి‌ఎఫ్‌ఐ సమావేశాలకు,అప్పటి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ హాజరయ్యాడు. అక్కడ హాజరైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడి సలహాదారు ఇబ్రహీం రసూల్, పిఎఫ్ఐ నాయకత్వాన్ని ఇలా ప్రశ్నించాడు – “దక్షిణాఫ్రికా జనాభాలో 3% ఉన్న ముస్లింలకు, అక్కడి పార్లమెంటులో 15% ప్రాతినిధ్యం ఉన్నది. మేము అక్కడ సాధించింది, ఇక్కడ 13% ఉన్న మీరేందుకు చేయలేరు?”
  • ఇదేకాక,పి‌ఎఫ్‌ఐ అనేకమంది రాజకీయనేతల మద్దతు కూడగట్టుకుంటున్నది. భారత్ నుండి మక్కా, మదీనా వెళ్ళే హాజ్ యాత్రికులకు సహాయం పేరుతో, భారత్ లో రాజకీయ కార్యకలాపాలకు కార్యకర్తలను చేర్చుకుంటూ,విస్తరించాలని చూస్తోంది.
  • పి‌ఎఫ్‌ఐ సభ్యులు,యుఏఈ లో రెహాబ్ ఫౌండేషన్, ఇండియన్ సోషల్ ఫోరం, ఇండియన్ ఫ్రటర్నిటీ ఫోరం వంటి ప్రముఖ సంస్థల సహకారంతో,చురుగ్గా పనిచేస్తున్నారు.
  • కేరళలోని త్రిస్సూరుకు చెందిన,ఉల్-హుమాన్ సయీద్ మహమ్మద్, మాల్దీవులలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అనేక భారత వ్యతిరేక వాట్స్అప్ సమూహాలకు గ్రూప్ అడ్మిన్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు అక్కడి అధికారులతో కుమ్మక్కయి, అక్కడి హిందువులను, క్రిస్టియన్లను లక్ష్యం చేస్తూ, వాళ్ళను మతదూషణ కేసులలో ఇరికిస్తున్నాడు.
  • ‘Muslim Brotherhood’తో అనుబంధం ఉన్న మహమ్మద్ మోర్సీకి,అనుచరులకు విధించిన ఉరిశిక్షకు వ్యతిరేకంగా, న్యూఢిల్లీ లోని ఈజిప్ట్ రాయబార కార్యాలయం వద్ద పిఎఫ్ఐ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ, ఇస్లాం అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నది.
  • యూదులకు వ్యతిరేకంగా,నవంబర్ 2012 లో, తర్వాత జూలై 2014 లో దేశవ్యాప్తంగా, పాలస్తీనా అనుకూల సంఘీభావ నిరసనలలో పి‌ఎఫ్‌ఐ వాళ్ళు ఇచ్చిన నినాదం – “నేను కూడా గాజా ని”.
  • ప్రభుత్వ సమాచార పత్రం ఇంకా ఏమి చెప్తోంది అంటే,యుఏఈ లోని ఇండియన్ కల్చరల్ సొసైటీ – రక్తదాన శిబిరాలు,ఉచిత వైద్యపరీక్షలు,క్రీడలు, ఉద్యోగాలు, న్యాయసహాయం వంటి పేర్లతో యువతను సమావేశాలకు పిలుస్తోంది. భారత గూఢచార వర్గాల సమాచారం ప్రకారం, అక్కడ ప్రజలలో భారత ప్రభుత్వవ్యతిరేక, జాతి వ్యతిరేకభావాలను ప్రచారం చేస్తోంది.
  • పిఎఫ్ఐ-కేరళ విభాగం,ఒమన్ లో ప్రత్యేకించి వాణిజ్యరాజధాని రూవీలో, చాలా చురుగ్గా ఉంది. వివిధ ప్రదేశాలలో, ప్రవాసీ విచారణ వేదిక, ఇండియన్ ప్రవాసీ కౌన్సిల్ వంటి వివిధపేర్లతో, మలయాళీ ముస్లిం ప్రవాసులలో తీవ్రవాద భావజాలాన్ని విస్తరించే ఉద్దేశంతో పని చేస్తోంది.
  • శ్రీలంక,తమిళనాడు లలోని తావ్హీద్ జమాత్ తో పి‌ఎఫ్‌ఐ కి సంబంధాలున్నాయి.
  • అబూధాబీ లోని ఇండియన్ కల్చరల్ సొసైటీ,అలాగే కువైట్ లోని ఇండియన్ సోషల్ ఫోరం ఇవి SDPI విదేశీ విభాగాలుగా, సలాఫీ (సున్నీ ఇస్లాం) భావజాలాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో పని చేస్తున్నాయి.
  • ఈ తీవ్రవాద సంస్థకు,పశ్చిమాసియా నుండి నిధులు సేకరించి పెట్టే ‘ది ముస్లిం రిలీఫ్ నెట్వర్క్ (MRN)’ పి‌ఎఫ్‌ఐ కి కేరళలో ఉన్న ఇంకొక NGO సంస్థ. ఈ MRN అనే సంస్థ, ఇస్లామిక్ దేశాల సమితి (OIC) ఆదేశాల ప్రకారం, జెడ్డా లోని ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, విరాళాలు స్వీకరిస్తుంది. ఇంకా గతంలో అల్-ఖైదాతో సంబంధమున్న జెడ్డా లోని ‘వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ ముస్లిం యూత్ (WAMY)’ అనే ఉగ్రవాద ఇస్లామిక్ సంస్థతో కూడా, సన్నిహిత సంబంధాలున్నాయి.
  • పి‌ఎఫ్‌ఐ భారత్-2047 అనే ప్రణాళికాపత్రం (మేనిఫెస్టో) విడుదల చేసింది. పి‌ఎఫ్‌ఐ ని కీర్తించి,అభినందించే హైదరాబాద్ కు చెందిన విద్యావేత్తలు/ప్రొఫెసర్లు, జర్మన్ ప్రొఫెసర్లతో జత కూడటం, మనం చూస్తున్నాము.
  • పి‌ఎఫ్‌ఐ,భారతీయ ముస్లింలను, పాలస్తీనాకు మద్దతుగా ఉండేలా నిరంతరం రెచ్చగొడుతున్నది. ఇంకా వీళ్ళు, తీవ్రవాద సంబంధిత చర్యలతో టర్కీలో నిషేధించబడిన, వివాదాస్పద సంస్థలతో తరచుగా సమావేశం అవుతూ, కనిపిస్తూనే ఉన్నారు.
  • రౌట్ లెడ్జ్ (Routledge)సంస్థ ప్రచురించిన ఒక పరిశోధనావ్యాసంలో, ఒక జర్మన్ విద్వాంసుడు, ఆర్న్ద్త్ ఎమరిచ్ (Arndt Emmerich) పాపులర్ ఫ్రంట్ సంస్థ, భారతీయ ముస్లింలను న్యాయవిద్య ద్వారా ఎలా శక్తివంతులను చేసిందో, ముస్లిం రాజకీయాలలో ఒక మతతత్వధోరణిని ఆరిపోకుండా కాపాడుతూ వచ్చిందో, చక్కగా వివరించారు.

కాశ్మీర్ తీవ్రవాదులతో పి‌ఎఫ్‌ఐ కి బంధాలు:

పి‌ఎఫ్‌ఐ కి కాశ్మీర్ తీవ్రవాదులతో సంబంధాలున్నాయి.

  • పి‌ఎఫ్‌ఐకి ప్రేలుడు పదార్ధాలు,ఆయుధాలు, మందుగుండు సామగ్రిలతో తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చే రహస్య యంత్రాంగం ఉన్నది.
  • జూలై 2010,ఏప్రిల్ 2013 లలో కన్నూర్ మొ|| పి‌ఎఫ్‌ఐ కేంద్రాలపై జరిగిన కేరళ పోలీసు దాడుల్లో, భారీగా ఆయుధాలు, కత్తులు, బాంబులు, బాంబు తయారీ సామగ్రి, విదేశీ నగదు లభించాయి.
  • కరడుగట్టిన ఇండియన్ ముజాహిదీన్ కి నిధులిచ్చిన భట్కల్ కుటుంబానికి చెందిన సనాఉల్లా బ్యాంకుఖాతాతో ఒక పి‌ఎఫ్‌ఐ కార్యకర్తకు లింక్ ఉన్నది.
  • లక్నో పి‌ఎఫ్‌ఐ వాళ్ళకు,బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ కి మధ్య సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో బాంబు ప్రేలుళ్ళు చేసి, హింసాత్మకం చేయాలని వచ్చారు.
  • కేరళ హైకోర్టుకి పోలీసులు ఇచ్చిన సమాచారంలో,ఒక లష్కర్-ఎ-తోయిబా తీవ్రవాది, ఎర్నాకుళమ్ పి‌ఎఫ్‌ఐ ఆఫీస్ లో ఉన్నాడు.
  • సిరియాలోని అబ్దుల్ ఖయూమ్(IS)నుండి పి‌ఎఫ్‌ఐ, కన్నూర్ కి ఒక సమాచారం వచ్చింది – కన్నూర్ కి చెందిన అబ్దుల్ మనాఫ్, భార్యతో అక్రమంగా 2017లో ఇంకొక పి‌ఎఫ్‌ఐ కార్యకర్త షామీర్ ప్రోత్సాహంతో సిరియా వెళ్ళి, అక్కడ ఇద్దరూ మరణించారు, ఇతడు పుణెలో 2010లో జరిగిన జర్మన్ బేకరీ ప్రేలుడు కేసులో ప్రధాన నిందితుడు,
  • పి‌ఎఫ్‌ఐ కి వ్యతిరేకంగా నమోదైన కేసులు:
  1. ఏప్రిల్ 2010 లో కన్నూర్ లో ఒక దళిత యువ కార్మికుడి హత్యలో పి‌ఎఫ్‌ఐ పాత్ర ఉన్నట్లు కేరళ పోలీసులు కోర్టులో చెప్పారు.
  2. డిసెంబర్ 2011లో కేరళలో పి‌ఎఫ్‌ఐ/సి‌ఎఫ్‌ఐ కలిసి ముగ్గురు హిందూ మత్స్యకార్లను హత్య చేశారు.
  3. జూలై 2012 లో కేరళ హైకోర్టులో,పి‌ఎఫ్‌ఐ అనేది SIMIఅనే నిషేధింపబడిన ఉగ్రవాద సంస్థ నూతన రూపం, దానికి 27 హత్యలతో సంబంధముందని పోలీసులు ఒప్పుకున్నారు.
  4. జూలై 2012 లో పి‌ఎఫ్‌ఐ వాళ్ళు ఇద్దరు హిందూ విద్యార్థులను హత్య చేశారు.
  5. 2016లో బెంగళూరులో హత్య చేయబడిన ఆర్‌ఎస్‌ఎస్ నేత రుద్రేష్ కేసులో,పి‌ఎఫ్‌ఐ అధ్యక్షుడుని అరెస్టు చేశారు.
  6. 2003లో మరాడ్ బీచ్ లో జరిగిన 8 మంది హిందూ మత్స్యకారుల హత్య కేసులో,65 మంది NDFకార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఎన్‌డి‌ఎఫ్, పి‌ఎఫ్‌ఐ వాళ్ళ ఇంకొక సోదర సంస్థ.
  7. నవంబర్ 1993లో చెన్నై లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై దాడిలో 11 మంది చనిపోయారు,ఇందులో దోషులైన MNP,తర్వాత పి‌ఎఫ్‌ఐలో విలీనం అయింది.
  8. సెప్టెంబర్ 2016లో హిందూ ముణ్ణని కార్యకర్త హత్యకు గురైన కేసులో,పి‌ఎఫ్‌ఐ కి చెందిన మహమ్మద్ హాసన్,నిందితుడు.

పి‌ఎఫ్‌ఐ/SDPI వాళ్ళ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు:

  • “ప్రధాని,గృహమంత్రిని మనం ఎందుకు చంపకూడదు?” ఒక కాంగ్రెస్ నేత నెల్లి కణ్ణన్ ఒక సి‌ఏ‌ఏ వ్యతిరేక సమావేశంలో వ్యాఖ్య.
  • రామజన్మభూమి విషయంలో,సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా “మేము అక్కడ గుడిని పడగొట్టి, అదే స్థలంలో మసీదు మళ్ళీ కట్టి తీరతాం.” అని ఎస్‌డి‌పి‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అబూ తాహిర్ ప్రకటించాడు.

పి‌ఎఫ్‌ఐ వాదనలు, డిమాండ్ లు:

  • ముస్లిం దేశాలపై అమెరికా వీసా ఆంక్షలను పి‌ఎఫ్‌ఐ ఖండన
  • రోహింగ్యా ముస్లింలపై అత్యాచారాలకు వ్యతిరేకం
  • TimesNowఛానల్ కి లీగల్ నోటిస్ పంపారు – 01 ఆగస్ట్ 2017
  • ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం ని అమెరికా గుర్తించటాన్ని పి‌ఎఫ్‌ఐ ఖండన
  • పౌరసత్వ చట్టం (సవరణ)ను ఉపసంహరించాలని డిమాండ్
  • గోరక్షకుల పేరుతో జరుగుతున్నఅకృత్యాలు,దాడులను ఆపాలి
  • పశువుల అమ్మకంపై నిషేధం తీసేయాలి,లేకపోతే ముస్లింలకు,దళితులకు వ్యతిరేకంగా హిందుత్వ హింస పెరుగుతుంది
  • ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం,ఇది ముస్లిం పర్సనల్ చట్టంలో జోక్యం చేసుకోవటమే.
  • గౌరీ లంకేష్ హత్య –ఖండన

పి‌ఎఫ్‌ఐ కార్యకలాపాలు:

  • 1993 ముంబై ప్రేలుళ్లలో నిందితుడు  యాకూబ్ మెమన్ కు క్షమా అభ్యర్థన
  • వాళ్ళ వారపత్రికలో ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడుగా కీర్తించటం,తాలిబాన్లకు మద్దతు ప్రకటన
  • తమిళనాడులో అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర
  • రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులతో బాటు,ముస్లిం ఖైదీలందరినీ విడుదల చేయాలి.
  • పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడికి మద్దతు,జకీర్ నాయక్ కి మద్దతు
  • CAA కు విరుద్ధంగా ఉద్యమాలు,అల్లర్లు
  • ఈశా ఫౌండేషన్ (జగ్గీ వాసుదేవ్ గారిది) ను వ్యతిరేకించడం. గోహత్య నిషేధాన్ని వ్యతిరేకించడం.
  • కిసాన్ ఉద్యమానికి SDPI(ఇది పి ఎఫ్ ఐ రాజకీయ విభాగం),ISISమద్దతు
  • మూకుమ్మడిగా మతం మారిన టెంకాసి జిల్లాలోని రహ్మత్ నగర్,మెక్కారై గ్రామాల్లో మతం మార్చిన ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ
  • రాజ్యాంగం లోని 370,35-ఎ అధికరణాల రద్దుపై తీవ్రవ్యతిరేకత
  • జామియా మిల్లియా యునివర్సిటి,JNUలలో అల్లర్లు
  • పోలీసు అధికార్లనుబెదిరించి,ఆర్‌ఎస్‌ఎస్ నేతల గురించిన పూర్తి వ్యక్తిగత/సంస్థాగతసమాచార సేకరణ

పి‌ఎఫ్‌ఐ కి సంబంధించి ఇతర గణాంక సమాచారం:

  • అధికార సమాచార పత్రం (2019) ప్రకారం,పి‌ఎఫ్‌ఐ – Karnataka Forum for Dignity, National Development Fund (కేరళ),ManithaNeethiPasarai (తమిళనాడు) లను స్థాపించి, విస్తృతమైన సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకొని, 80,000 కార్యకర్తలతో,ప్రస్తుతం 24 రాష్ట్రాలలో చురుగ్గా ఉన్నది.
  • కేరళ పోలీసులు,రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన ప్రమాణపత్రంలో, పి‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై – 27 మతపరమైన హత్యలు, 85 హత్యాప్రయత్నాలు, 106 మతపరమైన కేసులు నమోదైనట్లు తెలిపారు.
  • 2019 ఎన్నికల ఫలితాల అనంతరం,ముస్లింలలో విశ్వాసం పెరిగేందుకు 5000 వీధిచివర సమావేశాలు నిర్వహించారు,
  • ఉపకారవేతనాలు –16 రాష్ట్రాలలో, 2515 విద్యార్థులకు రూ.35,20,000/-, 94 న్యాయ అవగాహనా సదస్సుల నిర్వహణ
  • పి‌ఎఫ్‌ఐ9 రాష్ట్రాలలో,పోలీసు అత్యాచారాలకు విరుద్ధంగా  65 కేసులు, మీడియాసంస్థలకు వ్యతిరేకంగా 45 కేసులు,కొన్ని మతసంస్థలు/వ్యక్తులపై 129 కేసులు పెట్టింది. ఇంకా దేశం మొత్తంలో 2333 మందికి సహాయం చేసింది.