Home News ‘రోహింగ్యా’ ముస్లింలను భారతీయ పౌరులుగా నమోదు చేయిస్తున్న దేశ విద్రోహపు ముఠాలు

‘రోహింగ్యా’ ముస్లింలను భారతీయ పౌరులుగా నమోదు చేయిస్తున్న దేశ విద్రోహపు ముఠాలు

0
SHARE

అక్రమంగా మనదేశంలోకి చొరబడిన చొరబడుతున్న ‘రోహింగ్యా’ ముస్లింలను భారతీయ పౌరులుగా నమోదు చేయిస్తున్న దేశ విద్రోహపు ముఠాలు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నాయట! దేశ ప్రజలను ఆందోళనకు గురిచేయగల ఈ ‘సమాచారం’ గురువారం దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జరిపిన సమీక్షకు నేపథ్యం! ‘నకిలీ’ గుర్తింపు పత్రాలను రూపొందిస్తున్న జిహాదీ ముఠాలు ఈ పత్రాల – ఐడెంటిటీ కార్డ్స్’ – సహాయంతో ‘రోహింగ్యా’లను భారతీయులుగా చెలామణి చేయిస్తున్నారట! అస్సాంలోను, బెంగాల్‌లోను ఇలాంటి ముఠాలు జోరుగా పనిచేస్తున్నట్లు భద్రతానిఘా విభాగాలు పసికట్టిన వ్యవహారం! ‘రోహింగ్యా’ల ఉనికివల్ల దేశ భద్రతకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడిందన్నది గత కొన్ని వారాలుగా కేంద్రప్రభుత్వం పదేపదే చెబుతున్న మాట! సర్వోన్నత న్యాయస్థానానికి కూడ ప్రభుత్వం ఈ సంగతిని నివేదించింది! ఇలా ప్రభుత్వ యంత్రాంగానికి ‘ప్రమాదం’ గురించి తెలుసునన్నది ‘నకిలీ ఐడెంటిటీ కార్డుల’ ముఠాలకు కూడా తెలిసి ఉంటుంది. అయినప్పటికీ ఈ ముఠాలు యాథావిధిగా తమ కలాపాలను కొనసాగించడం వాటి దుస్సాహస ప్రవృత్తికి నిదర్శనం. దేశంలో ఇప్పటికే నలబయి వేలకు పైగా రోహింగ్యాలు ఏళ్ల తరబడి తిష్ఠవేసి ఉన్నారు! మైన్మార్‌లోని అరకాన్ – రఖెనీ – రక్షణ – ప్రాంతంలోని ప్రజలలో అధిక సంఖ్యాకులు ‘రోహింగ్యా ముస్లిం’లు.. మైన్మార్ జనాభాలో అత్యధిక సంఖ్య ప్రజలు బౌద్ధులు. బౌద్ధ బాహుళ్య దేశమైన బర్మా – మైన్మార్ – నుండి ఈ ముస్లిం బాహు ళ్య ప్రాంతమైన ‘అరకాన్’ను విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా రూపొందించడానికి ‘రోహింగ్యా’ ముస్లింలలోని ‘జిహాదీ’ బీభత్సకారులు యత్నిస్తున్నారు. 1947 నుంచి జరుగుతు న్న ఈ బీభత్స కలాపం ప్రతిదశలోను బెడిసికొట్టింది. ‘జిహాదీ’ల పాపానికి ‘అరకాన్’లోని సామాన్య ముస్లింలు శిక్ష లు అనుభవిస్తున్నారు. బౌద్ధులు తమపై దాడులు చేస్తారన్న భయం వారిని పట్టుకొంది. కానీ నిజంగా ఇలా అభద్రతాభావానికి గురి అవుతున్న రోహింగ్యాల సంఖ్య తక్కువ. ఈ ‘అభద్రతాభావం’ సాకుతో బంగ్లాదేశ్‌లోకి మన దేశంలోకి చొరబడి స్థిరపడిపోవాలని భావిస్తున్న రోహింగ్యాల సంఖ్య చాలా ఎక్కువ! అందువల్లనే ‘రోహింగ్యా’లపై మైన్మార్‌లో దాడులు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ – ఐఎస్‌ఐ – ముఠా! అంతర్జాతీయంగా బీభత్సం జరుపుతున్న జిహాదీ ముఠాలను, ప్రధానంగా భారత వ్యతిరేక ‘జిహాదీ’ తండాలను ఏకత్రీకరణ చేయడం మూడు దశాబ్దులుగా ‘ఐఎస్‌ఐ’ సాగిస్తున్న ప్రధాన కార్యక్రమం. మనదేశంలో హత్యాకాండ సాగిస్తున్న కిరాయి జిహాదీ ముఠాల పేర్లు వేరుకావచ్చు! వాటిని ఉసిగొల్పుతున్న ‘ముఠా’ మాత్రం ఒక్కటే – అది ఐఎస్‌ఐ…

మనదేశంలో ఇప్పటికే నలబయి వేలకు పైగా ‘రోహింగ్యా’లు తిష్ఠవేసి ఉన్నారు. వీరు నిజంగా ప్రాణభయంతో మైన్మార్ నుంచి పారిపోయి వచ్చిన ‘శరణార్థులు’ అయినట్టయితే తిరిగి స్వదేశానికి వెళ్లడానికి అభ్యంతరం ఏమిటి?? దేశవిద్రోహంతోను బీభత్సకాండతోను సంబంధం లేని ‘రోహింగ్యా’లు తమ దేశానికి తిరిగివచ్చి స్థిరపడవచ్చునని, వారికి భద్రతను కల్పిస్తామని మైన్మార్ ప్రభుత్వం పదేపదే హామీ ఇస్తోంది! ఐక్యరాజ్య సమితి కూడా ‘రోహింగ్యా’లు తిరిగి మైన్మార్‌కు వెళ్లాలని, మైన్మార్ ప్రభుత్వం వారికి భద్రత కల్పించాలని పదేపదే స్పష్టం చేసింది! ఇంత పెద్దఎత్తున అంతర్జాతీయంగా ప్రచారమైంది కనుక మైన్మార్ ప్రభుత్వం మాట తప్పే అవకాశం లేదు! అందువల్ల ‘రోహింగ్యా’లు మన దేశం నుంచి తమ దేశానికి – ఎవరి బలవంతం లేకుండానే – వెళ్లిపోవచ్చు. కానీ ఇక్కడే ఉండిపోవడానికి ఎందుకు యత్నిస్తున్నారు?? నకిలీ గుర్తింపు పత్రాల సహాయంతో తాము భారతదేశంలో పుట్టి పెరిగిన భారతీయులుగా చెలామణి కావడానికి ఎందుకని యత్నిస్తున్నారు?? మనదేశంలోని ఇస్లాం ‘మతస్థుల’ను ‘ఇరాన్ సిరియా ఇస్లాం మత రాజ్యం’ ముఠాలోను, అఫ్ఘానీ ‘అల్‌ఖాయిదా’ ముఠాలోను చేర్పించడానికి పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ కుట్ర కొనసాగిస్తోంది. మైన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలను సైతం ఈ ‘ముఠా’లలో ‘జమ’ చేయించడానికి ‘ఐఎస్‌ఐ’ చేస్తున్న ప్రయత్నాలు బయటపడినాయి…

ఇదివరకే చొరబడి తిష్ఠవేసి ఉన్నవారు నకిలీ పత్రాల ఆధారంగా భారతీయులుగా చెలామణి కావడానికి యత్నిస్తుండడం సమస్యలో సగం మాత్రమే. మిగిలిన సగం మైన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ‘రోహింగ్యా’లు ఇప్పటికీ మన దేశంలో చొరబడుతుండడం! ఈ చొరబాట్లను గురించి గురువారం కలకత్తాలో జరిగిన సమావేశంలో ప్రధానంగా చర్చించారట! దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యవంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఈ ‘చొరబాట్ల’ను నిరోధించడానికి వలసిన పద్ధతులను చర్చించారట! బంగ్లాదేశ్‌కు మన దేశానికి మధ్య నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఏర్పడి ఉంది! ఈ సరిహద్దు పొడవున్న ‘రోహిం గ్యా’లు చొరబడడానికి వీలైన ‘సురక్షిత’ మార్గాలు ఏర్పడి ఉన్నాయట! మనదేశంలో తిష్ఠవేసి ఉన్న వారు ‘‘కదలకపోగా’’, కొత్తగా మరింత మంది రోహింగ్యాలు తరలిరావడం ‘ఐఎస్‌ఐ’ కుట్రలో భాగం!! బెంగాల్‌లోకి అస్సాంలోకి వీరంతా ప్రధానంగా చొరబడుతున్నారు. ఎందుకంటే దాదాపు మూడు కోట్ల మంది బంగ్లాదేశీయ ముస్లింలు ఇదివరకే ఈ రెండు రాష్ట్రాలలోకి చొరబడి తిష్టవేసి ఉన్నారు. ఈ బంగ్లాదేశీయ ముస్లింలలో అత్యధికులు నకిలీ పత్రాల సహాయంతో ఇప్పటికే ‘్భరతీయులు’గా చెలామణి అవుతున్నారు, రేషన్‌కార్డులను పొందారు, బ్యాంకుల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారాను ప్రభుత్వ సహాయం పొందుతున్నారు. వోటర్లుగా నమోదయ్యారు, ప్రభుత్వ ప్రభుత్వేతర ఉద్యోగాలలో భర్తీ అయ్యారు. దశాబ్దులుగా ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఈ ప్రక్రియకు దోహదం చేయడం బహిరంగ రహస్యం! ఇదే భారత వ్యతిరేక ప్రక్రియ ద్వారా ‘రోహింగ్యా’లను భారతీయ పౌరులుగా మార్చడానికి ఇదివరకే మారినవారు యత్నిస్తున్నారు… మనదేశంలో ఇస్లాం మతస్థులకు ఇతర అల్పసంఖ్య మతస్థులకు ఉన్నంత భద్రత, ఉపాథి అవకాశాలు, ప్రభుత్వ సహాయం మరే దేశంలోను లేదు!

అందువల్ల ఇక్కడనే స్థిరపడడానికి కొందరు ‘రోహింగ్యా’లు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ స్థిరపడి జిహాదీ బీభత్సకారులుగా మారి భారత వ్యతిరేక చర్యలను కొనసాగించాలన్నది మరికొందరు రోహింగ్యాల పథకం.. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలను పెంపొందిస్తోంది. రోహింగ్యాలలోని జిహాదీలకు దీనివల్ల ‘అభద్రత’ ఏర్పడింది. అందువల్లనే వీరు భారతీయులుగా ‘‘మారి’’ ప్రభుత్వాన్ని ఏమార్చడానికి యత్నిస్తున్నారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)