Home News పాకిస్థాన్ లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠం పై దాడులు… జిత్తులమారి చైనా హస్తం?

పాకిస్థాన్ లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠం పై దాడులు… జిత్తులమారి చైనా హస్తం?

0
SHARE

పాకిస్తాన్ లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరం పై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51 శక్తి పీఠాలలో 6 బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు వెళ్లాయి. భారతదేశంలో ఉన్న హిందువులను కలవరపాటుకు గురి చేయడానికి మతోన్మాద ముస్లింలు ఈ ఆరు శక్తిపీఠాల పై దాడి చేస్తూ ఉంటారు. హింగ్లాజ్ దేవి మందిర విధ్వంసం కూడా ఈ దృష్టిలోనే చూడవలసి ఉంటుంది. ఇది కాకుండా నాలుగు శక్తిపీఠాలు చైనా – నేపాల్ మరియు శ్రీలంక అధీనంలో ఉన్నాయి. నేపాల్ లో రెండు, చైనా ఆక్రమిత టిబెట్ లో ఒక శక్తి పీఠం, ఇంకొకటి శ్రీలంకలో ఉన్నాయి. ప్రస్తుతం యావత్ భారతదేశంలో 41 ముఖ్య శక్తి పీఠాలు మిగిలాయి.

నేపాల్ హిందు ఆధిక్యత కలిగిన దేశం, మరియు జాఫ్నాలో హిందువుల సంఖ్య ఎక్కువ, కాబట్టి శక్తిపీఠాల విషయంలో ఎలాంటి సమస్యలు లేవు, కానీ 1949లో చైనా టిబెట్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, భారతీయ హిందువులు మానసదేవి శక్తిపీఠానికి వెళ్లడం మానేశారు. భారతదేశం ఇచ్చిన వాణిజ్య పరమైన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఎక్కడ కోల్పోతుందో అనే భయంతో బంగ్లాదేశ్ గత ఏడు-ఎనిమిదేళ్లుగా, జశోరేషేశ్వరి ఆలయంతో సహా మిగిలిన ఐదు శక్తిపీఠాలలో విధ్వంసకర సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడింది. ఇది బంగ్లాదేశ్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జశోరేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లోని శక్తిపీఠాలను పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు సందర్శించడం ప్రారంభించారు. దీని వల్ల బంగ్లాదేశ్‌కు పర్యాటకం రూపంలో మంచి ఆదాయం వస్తుందని అందరూ భావిస్తున్నారు.

దేవీ భాగవత పురాణంలో 108, కాళికా పురాణంలో 26, శివచరిత్రలో 51, దుర్గా సప్తశతి మరియు తంత్రచూడామణిలో 52 శక్తిపీఠాల వివరణ ఉంది. అయితే ఇందులో నిర్దిష్టమైన సంఖ్యను శంకరాచార్యులందరిలో అత్యంత విద్యావంతులు, నిత్య సాధన తత్పరులు, సనాతన ధర్మ ప్రచారంలో నిమగ్నమైన పూరీ మఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తెలిపారు. ఖండించి వేయబడిన సతీదేవి యొక్క శరీర భాగాలు 51 ప్రదేశాలలో ఉన్నాయని, శక్తితో పాటు భైరవులు ఉన్నారని, కాబట్టి అవన్నీ ప్రధాన శక్తిపీఠాలని చెబుతారు. ఇది కాకుండా, సతీదేవి యొక్క ఆభరణాలు పడిపోయిన ప్రదేశాలు కూడా శక్తిపీఠాలుగా గుర్తించబడ్డాయి, అందుకే దేవి భగవత పురాణంలో 108 శక్తిపీఠాలు పేర్కొనబడ్డాయి. దుర్గా సప్తశతి మరియు తంత్రచూడామణిలో, సతీదేవి ఆహుతి అయిన హవన కుండాన్ని కూడా శక్తిపీఠంగా వర్ణించారు. కాళికా పురాణంలో వివరించబడిన 26 శక్తిపీఠాలు మహోగ్ర మైనవి. ఈ ప్రదేశాలలో యురేనియం-థోరియం వంటి శక్తివంతమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. స్వామి నిశ్చలానంద సరస్వతి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన శాస్త్రవేత్త కూడా కావడం గమనార్హం.

హింగ్లాజ్ మాతను హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ పూజిస్తారు. బలూచిస్తాన్‌లోని ముస్లింలు హింగ్లా మాతను నాని అని పిలుస్తారు. ఆమెకు ఎర్రటి వస్త్రం, అగరబత్తులు, కొవ్వొత్తులు, పరిమళ ద్రవ్యాలు మరియు పువ్వులు సమర్పిస్తారు. హింగ్‌రాజ్ దేవి ముస్లింలలో “లాల్ చౌలే వాలీ మాయి” మరియు “నాని” పేర్లతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల నుండి ముస్లింలు హజ్ చేయడానికి మరియు యాభై రెండు ప్రదేశాలకు ప్రదక్షిణలు చేయడానికి వస్తారు. ఎర్రటి వస్త్రం, సుగంధ ద్రవ్యాలు మరియు ధూపం మొదలైన వాటిని సమర్పించేటప్పుడు హింగ్లిజ్‌ దేవిని హింగ్లు పేరుతో కూడా పూజిస్తారు. జుమాన్ ఖాప్ యొక్క బ్రహ్మచారిణి అయిన కుమార్తె హింగ్లాజ్ దేవిని పూజించే హక్కును పొందింది, ఆమెను చాంగ్లీ మాయి అని పిలుస్తారు. వీరు బలూచ్ శాఖకు చెందిన బ్రోహీ ముస్లింలు. వారిలో చాంగ్లీ మాయిని శక్తి యొక్క నిజమైన రూపంగా పరిగణిస్తారు. చాంగ్లీ మాయి, ఒక నూతన కన్య తలపై తన చేతిని ఉంచి కొత్త చాంగ్లీ మాయిని నిర్ణయించి, హింగ్లాజ్ దేవతను ఆరాధించే హక్కును ఆమెకు ప్రసాదిస్తుంది. అదే సమయంలో హింగ్లాజ్ మాత జ్యోతిని వెలిగించే అధికారాన్ని ఇస్తుంది. ఈ కుటుంబానికి అధిపతిని “కోటడి కి పీర్” అని పిలుస్తారు. హింగ్లాజ్ దేవి గుహను కోటడి అంటారు.

అంతకుముందు, కరాచీ (పాకిస్తాన్)లోని నాగనాథ్ మైదానం నుండి ఒంటెల ద్వారా మరియు కాలినడకన హింగ్లాజ్ దేవి మందిర ప్రయాణం జరిగేది. ఒంటెలకి కాపరి ఉండేవాడు. జలపాతం గుండా ప్రయాణించి నలభై యాభై మంది యాత్రికులు సుమేరియన్ దేవతను సందర్శించేవారు. ఒకప్పుడు ఒంటెలకి కాపరులుగా కరాచీకి చెందిన భారత సాధువులు ఉండేవారు. ఇది నిహాంగ్‌ల స్థానం. ఇప్పుడు గృహస్థులు ఈ పని చేసుకుంటూ గుడిసెల్లో నివసిస్తున్నారు.

హింగ్లాజ్ మాత యొక్క ఆలయాన్ని “పాకిస్తాన్ వైష్ణో దేవి” అని కూడా పిలుస్తారు. మా హింగ్లాజ్ ఒక ఎత్తైన కొండపై ఉన్న గుహలో ఒక ఆస్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ శివుడు భీమ్లోచన భైరవుని రూపంలో ప్రతిష్టించబడ్డాడు. గణేశ విగ్రహం, కాళికా మాత ప్రతిష్టించబడింది. ఆలయంతో పాటు, గురు గోరఖ్‌నాథ్ యొక్క చష్మా (సరస్సు) కూడా ఉంది. మాతా హింగ్లాజ్ దేవి ప్రతిరోజూ ఉదయం స్నానం చేయడానికి ఇక్కడకు వస్తుందని చెబుతారు. మత గ్రంధాల ప్రకారం, బలూచిస్తాన్‌లోని హింగోల్ నది ఒడ్డున ఉన్న ఈ శక్తిపీఠంలో సతీదేవి యొక్క బ్రహ్మరంధ్రం (మెదడు) పడిపోయింది. హింగ్లాజ్ మాత, చరణ్ వంశజుల కుల దేవతగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో, పాకిస్తాన్ మరియు భారతదేశం నుండి వందలాది మంది భక్తులు మాతా హింగ్లాజ్ ఆస్థానానికి చేరుకుంటారు. గురునానక్ దేవ్, దాదా మఖాన్ మరియు గురు గోరఖ్‌నాథ్ వంటి ఆధ్యాత్మిక సాధువులు తమ కోరికల నెరవేర్చుకునేందుకు ఇక్కడికి వచ్చారు. పరశురాముడు క్షత్రియులను 21 సార్లు చంపాడని చెబుతారు. అటువంటి పరిస్థితిలో, మిగిలిన క్షత్రియులు తల్లి హింగ్లాజ్ ని ఆశ్రయించి వారి రక్షణ కోసం ప్రార్థించారు, అప్పుడు హింగ్లాజ్ మాత క్షత్రియులను బ్రహ్మక్షత్రియులను చేసింది. రావణ సంహారం తరువాత బ్రహ్మ హత్యా పాప దోష పరిహారం కోసం శ్రీరాముడు హింగ్లాజ్ మాతని పూజించాడు‌. హింగ్లాజ్ మాత సన్నిధిలో నతమస్తక మైన భక్తులు పూర్వజన్మల కర్మల నుండి విముక్తులవుతారు.ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది. దేశ విభజనకు ముందు, ఈ ఆలయం భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ లక్షల మంది అమ్మవారిని దర్శించుకునేవారు. విభజన అనంతరం హింగ్లాజ్ మాత ఆలయంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేకమార్లు దాడి చేసినప్పటికీ, అమ్మవారి విగ్రహానికి హాని జరగలేదు. .ఉగ్రవాదుల దాడి నుండి స్థానిక హిందువులు మరియు ముస్లింలు కూడా అనేక సార్లు ఆలయాన్ని రక్షించారు. ఒకసారి ఆలయాన్ని విధ్వంసం చేసేందుకు వచ్చిన ముష్కరుల అందరూ గాలిలో కలిసి పోయారు. ఇక్కడి అమ్మవారి మహత్వం ముందు అందరూ తలవంచాల్సిందే.

ఇది హిందువులు మరియు ముస్లిముల ఉమ్మడి తీర్థయాత్ర, అలాంటప్పుడు హింగ్లాజ్ మాత ఆలయాన్ని పదే పదే దెబ్బతీసే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? రాజకీయ మరియు దౌత్య పరంగా చూస్తే ఇవి కేవలం మతపరమైన దాడులు కావు అని తెలుస్తున్నది. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌లో చైనా ఆధిపత్యం పెరిగిపోయిందని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో తాలిబన్ల జోక్యం కూడా ప్రబలింది. పాకిస్థాన్‌లో జరిపిన తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో దేవాలయాల అవశేషాలు బయటపడుతున్నాయి. ఇండోనేషియాతో సహా అనేక దేశాల్లో పురాతన మందిరాలు ఉండటం వల్ల ఆ దేశాలు హిందూత్వంతో తమను తాము గుర్తించు కుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో హిందూ దేవాలయాల కారణంగా, అక్కడ కూడా హిందూ మతం విస్తరించవచ్చునని పాకిస్తాన్ ఛాందసవాదులు భయపడుతున్నారు. కానీ ఇది చాలా సాధారణ కారణం. నిజానికి యురేనియం, స్ఫటికం, రూబీ, నీలమణి లాంటి విలువైన వస్తువులున్న మానస సరోవర్ ప్రాంతాన్ని చైనా స్వేచ్ఛగా పాలించాలనుకుంటోంది.అందుకే భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థానీలకు పని కల్పిస్తోంది. కైలాష్ మానస సరోవర్ నుండి ఈ విలువైన పదార్దాలను వెలికి తీయడం కోసం భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తోంది. హింగ్లాజ్ దేవి మందిరం పై తదేకంగా జరుగుతున్న దాడుల వెనుక ఉన్నది జిత్తులమారి చైనా.

Source : VSK Mumbai 

అనువాదం: తాడేపల్లి అరవింద్