అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్పటి వరకు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా మారిన తీర్ధయాత్ర కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది ఆలయ పట్టణాన్ని సందర్శిస్తున్నారని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ జీ తో సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 8,000 మంది ప్రముఖులు హాజరైన ప్రాణ ప్రతిష్ఠ, రామజన్మభూమి మందిర నిర్మాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ చేత రూపొందించబడిన, భగవాన్ రామ్ లల్లా యొక్క 51 అంగుళాల పొడవైన మూర్తి ఇప్పుడు లక్షలాది మందికి భక్తికి కేంద్ర బిందువుగా నిలుస్తోందన్నారు.
మందిర్ ట్రస్ట్ ముందుచూపుతో పవిత్రమైన ప్రాంగణ పవిత్రత, భద్రతను నిర్ధారించడానికి ఆలయ ప్రాకారం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ‘‘పర్కోట’’ పేరుతో భద్రతా గోడను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.
అంతేకాకుండా, ఈ సముదాయం దాని ప్రాంగణంలో అనేక చిన్న మందిరాలను కలిగి ఉంటుంది, భగవాన్ శివుడు, భగవాన్ సూర్యుడు, భగవాన్ హనుమాన్ ఇతరులతో సహా వివిధ దేవతలను గౌరవిస్తుంది. ఈ బహుళార్ధసాధక ప్రాంతం యాత్రికుల అవసరాలను తీర్చడానికి అదనపు సౌకర్యాలను కల్పిస్తుంది. ఒకేసారి 25,000 మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఉందని అంచనా.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఆలయ ప్రాంగణంలో 600 మొక్కల సంరక్షణను చేపట్టినట్టు తెలిపారు. మందిరంలో మౌలిక సాదుపాయాలలో భాగాంగా నీటి శుద్ధి, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. స్వయం సమృద్ధి, కనిష్ట పర్యావరణ ప్రభావాన్ని నిర్ధారిస్తుంది.
ఘనంగా రామ నవమి వేడుకలు
ఏప్రిల్ 17న రామ నవమిని పురస్కరించుకుని అయోధ్య రామజన్మభూమి మందిర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. వైజ్ఞానిక వ్యవస్థ ద్వారా భగవాన్ రామ్ లల్లా నుదిటిని సూర్య తిలకంతో వెలిగించడంతో సహా ప్రత్యేకమైన ఆచారాలు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని జోడించాయి. మందిర్ 19 గంటలపాటు తెరిచి ఉంది. భక్తులు తమ నివాళులు అర్పించడానికి 56 భోగ నైవేద్యాలలో పాల్గొనడానికి స్వాగతించారు.
రామ జన్మభూమి మందిర్
సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించబడిన రామజన్మభూమి మందిర్ నిర్మాణ వైభవానికి ఆధ్యాత్మికతకు, ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. అయోధ్యలో 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మందిరం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తులో ఉంది. 392 స్తంభాలు, 44 తలుపులతో, ఆలయం చూట్టు హిందూ దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రామ మందిరం భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
అయోధ్యలోని రామజన్మభూమి మందిరానికి తీర్థయాత్ర కొనసాగుతుండగా, ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసం, ఐక్యత, భక్తికి చిహ్నంగా ఉద్భవించింది.