ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నారు పెద్దలు. మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఒకప్పుడు మన దేశంలో సాంప్రదాయ వంటకాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉండేవి. వాటి వల్ల మన పెద్దవాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చత్య పొకడలతో కొత్త కొత్త ఆహారాలను తీసుకుంటూ కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. ఉరుకుల పరుగుల జీవితంలో పాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడి అనారోగ్యం బారిన పడుతున్నాం. ముఖ్యంగా విదేశీ కంపెనీల నుంచి దిగుమతి అవుతున్న ఆహారపు వస్తువులు మన ఇండ్లలోకి చేరి మన ఆరోగ్యంతో చేలగాటమాడుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాలలో కూడా మోతాదుకు మించిన రుచి కోసం, నిల్వ కోసం రసాయనాలను కలపడం… వాటిని పిల్లలు ఇష్టంగా తినడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతినడం, చిన్నతనంలోనే వివిధ అనారోగ్య సమస్యలకు గురి కావడం మనం తరచూ చూస్తునే ఉన్నాం.
నెస్లే ఉత్పత్తులలో అధిక మోతాదులో చక్కెర
గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్‌లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో ఎక్కువ చక్కెర కంటెంట్‌తో కూడిన పిల్లలు తినే ఉత్పత్తులను విక్రయిస్తుందని స్విస్ NGO, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (IBFAN) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే సుమారు 150 పిల్లల బేబీ ఉత్పత్తులను నివేదిక కోసం పరిశీలించారు. అందులో అంతర్జాతీయ ఆహార భద్రతా మార్గదర్శకాలకు మించి చక్కెర ఉన్నట్లు గుర్తించారు.
నివేదిక ప్రకారం, ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో విక్రయించే ఆరు నెలల శిశువులకు సంబంధించిన అన్ని గోధుమ ఆధారిత బేబీ ఫుడ్స్‌లో అత్యధిక చక్కెర ఉన్నట్టు గుర్తించారు. నెస్లె ఉత్పత్తుల్లో సగటున 3 గ్రాముల చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. పబ్లిక్ ఐ ఈ దేశాల్లోని కంపెనీకి చెందిన 150 ఉత్పత్తులను బెల్జియంలోని ల్యాబ్‌లో పరీక్షించింది. పబ్లిక్ ఐ ఈ వాదన నిజమని తేలితే, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ ) సూచనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. డబ్లుహెచ్‌ఒ మార్గదర్శకాల ప్రకారం, 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఉపయోగించకూడదు.
ఎందుకు హానికరం?
WHO నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు యాడెడ్ షుగర్ ఉన్న ఆహార ఉత్పత్తులను పెట్టకూడదు. దీని వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, జీవితంలో కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. అదనంగా, శైశవదశలో అధిక చక్కెర వినియోగం దంత క్షయం, పేలవమైన పోషకాల తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదంతో ముడిపడి ఉంది.
కోకకోలా & పెస్పీలతో చావు కబురు “చల్లగా”
జాగింగ్ చేసినపుడు, ఎక్కువ నడిచినపుడు, పనిచేసి అలసిపోయినప్పుడు మనలో చాలామందికి శీతల పానీయాలు తాగే అలవాటు ఉంటుంది. వాటిలోని రసాయనాల వల్ల తక్షణ ఉపశమనం ఉంటుంది. కానీ అవే రసాయనాల వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతిని అనేక రోగాల బారిన పడతున్నామని ఎక్కువ మంది గ్రహించలేకపోతున్నారు. కోకా కోలా, పెప్సీ శీతల పానీయాలకు ప్రతీకగా ఉంటూ చక్కెర లేదా రంగుతో కృత్రిమంగా చేయబడిన సోడాలు తప్ప మరేమీ కాదు. డైట్ వెర్షన్‌ల పేరుతో ఈ పానీయాల ట్రెండ్ పెరిగింది.
కోకా కోలా లేదా పెప్సీ వంటివి తాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలును గమనిస్తే…
ప్రపంచవ్యాప్తంగా కొన్ని విశ్వవిద్యాలయాలచే నిర్ధారించబడిన ఫలితాల ఆధారంగా శీతల పానీయాలను సేవించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గుర్తించి వెల్లడించారు.
కెఫిన్, చక్కెర ఉత్పత్తులు తియ్యటి శీతల పానీయాలలో స్థిరంగా ఉంటాయి. కోకా కోలా, పెప్సీ అనేక వ్యాధులకు కారణమయ్యే అస్పర్‌టేమ్ లను కలిగి ఉంటుంది. వీటిని ఉపయోగించకుండా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో నిబంధనలు ఉన్నాయి. అస్పర్‌టేమ్‌తో కూడిన ఉత్పత్తులను తినకుండా పిల్లలను ఖచ్చితంగా పరిమితం చేయాలి.
కిడ్నీ విఫలమవడానికి చక్కెర ఖచ్చితంగా కారణం కాదు కానీ కృత్రిమ తీపి కారాకాలు కారణమవుతాయి. అందువల్ల కోకా కోలా లేదా పెప్సీ డైట్ వెర్షన్‌లు సాధారణ తీపి కంటే ఎక్కువ బలహీనతను కలిగిస్తాయని నిరూపించబడ్డాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు మీ జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది, కానీ డైట్ కోక్‌లోని రసాయనాల వల్ల అది రుచిగా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జీవక్రియను తగ్గిస్తుంది. కొవ్వును కాల్చే ఎంజైమ్‌లను త్వరగా నాశనం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి కఠినమైన వ్యాయామం లేదా బిజీగా ఉన్న రోజు తర్వాత డైట్ కోక్ లేదా సాధారణ కోకాకోలా తీసుకోవడం మంచిది కాదు.
కోకాకోలా లేదా ఇలాంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టని కాలంలో ఊబకాయం ఎప్పుడూ పెద్ద సమస్య కాదు. కానీ ఈ ఉత్పత్తుల ఆగమనంతో ఎక్కువ జనాభా ఊబకాయంతో బాధపడుతున్నారు.
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలను ప్రభావితం చేసే వ్యాధులకు మూలం ఊబకాయం. క్యాన్సర్ కణాలను ప్రేరేపించడానికి ఊబకాయం ఒక కారణమని పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి.
డయాబెటిస్ ఉన్న రోగులు కోక్ లేదా పెప్సీ వంటి పానీయాలను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని రెండు రెట్లు పెంచుతుంది. డయాబెటిస్‌ను దూరంగా ఉంచాలంటే మధుమేహం లేని వ్యక్తులు ఈ పానీయాలకు దూరంగా ఉండాలి.
కోక కోలా పెప్సీల pH స్థాయి 3.2 చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ pH స్థాయి ద్రవం యొక్క ఆమ్ల స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల ఈ పానీయాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఎముకలు దంతాలను చాలా త్వరగా కరిగించగలవు. అలాగే కోక్ లేదా పెప్సీ వంటి రసాయనాలతో లైంగిక సమస్యలకు దారితీస్తాయని ఒక పరిశోధనలో తేలింది.
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌లో కాన్సర్ కారకాలున్నాయని నిర్థారమైన విషయం మనందరికీ తెలిసిందే. పదేళ్ళ క్రితమే దీని గురించి వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ పౌడర్ వలన తనకు కాన్సర్ సోకిందని అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన థెరిసా గ్రేసియా అనే మహిళ కోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పుడు పదేళ్ళ తర్వాత కోర్టు దాని తీర్పును వెలువరించింది. అయితే ధెరిసా ఇప్పుడు బతికి లేరు. ఆమె 2020లోనే చనిపోయారు. కానీ కోర్టు తీర్పు మాత్రం ఇప్పుడు వచ్చింది. బాధిత కుటుంబానికి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అది కూడా ఏకంగా భారత కరెన్సీ ప్రకారం రూ.375 కోట్ల పరిహారం ఇవ్వాలని చెప్పింది.
పౌడర్ వలన అరుదైన క్యాన్సర్..
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వలన థెరిసా మెసోథెలియా అనే అరుదైన క్యాన్సర్‌కు గురయ్యారు. మెసోథెలిమా అనేది చాలా అరుదైన కేన్సర్.. ఊపిరితిత్తులు లేదా పొత్తికడుపులోని పొరల్లో ఈ కణాలు పెరుగుతాయి. రాతినారను ఎక్కువగా తాకినప్పుడు, ఆ దుమ్ముని పీల్చినప్పుడో శరీరంలోకి చేరి కేన్సర్‌గా మారుతుంది. దీని వలన ఆమె చనిపోయారు కూడా. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ కంపెనీ, కెన్‌వ్యూ సంస్థల మీద కేసు వేశారు. జే అండ్ జే పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఉందని ఆరోపించారు. తరువాత అది క్లీనికల్‌గానూ నిరూపితమైంది కూడా. అయితే కంపెనీ మాత్రం ఇప్పటికీ తమ పౌడర్‌లో ఎటువంటి క్యాన్సర్ కారకాలు లేవనే వాదిస్తోంది. దాదాపు వందేళ్ళుగా తమ ఉత్పత్తి వాడుకలో ఉందని అంటోంది. మరోవైపు మరో సంస్థ కెన్‌వ్యూ సంస్థ మాత్రం తమ టాల్కమ్ పౌడర్‌ను ఇక మీదట తయారు చేయమని చెప్పింది. కానీ కోర్టు తీర్పు మీద స్పందించడానికి మాత్రం నిరాకరించింది. జాన్సన్ అండ్ జాన్సన్ అంతర్గత లిటిగేషన్ విభాగం చీఫ్ ఎరిక్ హాస్ మాత్రం దీని స్పందించారు. జ్యూరీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా తీర్పు ఇచ్చారని… అందుకే దానిని సవాల్ చేస్తామని వెల్లడించారు.
ఇక అమెరికా, కెనడాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ అమ్మకాలను నిలిపేశాయి. 2020 నుంచి ఇది అమల్లో ఉంది. ఈ పౌడర్ అమ్మకాల మీద అక్కడ కోర్టుల్లో ఏకంగా 38 వేలకు పైగా కేసులున్నాయి. మరోవైపు గతేడాది జాన్సన్ అండ్ జాన్సన్ తమ ఉత్పత్తులను నిలిపి వేసింది.