అయోధ్య ఉగ్రదాడి కేసు (2005)లో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి జీవిత ఖైదు విధించింది. మరొక నిందితుడిని నిర్దోషిగా తేల్చుతూ వదిలేసింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి దినేశ్ చంద్ర వాదనలు విన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్లూ నాయిని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఇర్ఫాన్ మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ సనీమ్, మొహమ్మద్ అజీజ్, ఆసిఫ్ ఇక్బాల్, ఫరూఖ్ ఇన్నాళ్లు విచారణ ఎదుర్కొన్నారు.
కాగా, ఈ ఉగ్ర దాడిలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు జైష్ ఎ మొహమ్మద్ అనుమానిత సభ్యులు, ఇద్దరు స్థానికులు ఉన్నారు. మరో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈ దాడిలో గాయపడ్డారు. ఆ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు వీరంతా సాయం చేశారన్న అనుమానాలతో అప్పట్లో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి చేసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆ రోజే మట్టుబెట్టాయి. ఇప్పటి వరకు 63 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. నాయిని జైలు నుంచి నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటున్నారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కాంప్లెక్స్ ప్రాంతంలో జులై 5, 2015న ఉగ్రవాదులు దాడి చేశారు. భద్రతా బలగాలు వెంటనే స్పందించి, వారిని హతమార్చాయి.
Source: www.nijam.org