నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో బద్దం ఎల్లారెడ్డి ఒకరు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, 1938నాటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అరెస్టయ్యారు. జైలు శిక్ష అనుభవించారు. ఆయన నాయకత్వంలో ఒక ఉదారవాద సంస్థగా మొదలై నిజాం వ్యతిరేక ఐక్య ఫ్రంట్‌గా తీవ్రరూపం దాల్చిన ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి సేవలను అందించారు.