Home News అస్సాం: బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన సెలీముద్దీన్

అస్సాం: బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన సెలీముద్దీన్

0
SHARE

కరీంగంజ్: హిందువులపై దాడుల పరంపరలో తాజాగా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో బజరంగ్ దళ్ కార్యకర్తను ఓ ముస్లిం వ్య‌క్తి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన జనవరి 8 తెల్లవారుజామున జరిగింది. వివ‌రాల్లోకి వెళితే… కోయిరి జిల్లాలోని పథర్‌కండి ప్రాంతంలోని లోవైర్‌పోవా గ్రామానికి చెందిన‌ శంభుకు, కొద్ది రోజుల క్రితం స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సెలీముద్దీన్ కు మధ్య గొడవ జరిగింది. అయితే ఆ గొడ‌వ అప్పుడే ప‌రిష్కార‌మ‌యింది. కానీ సెలీముద్దీన్ మాత్రం శంభుపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో ప్ర‌ణాళిక ప్ర‌కారం బజరంగ్ దళ్ శిక్షణా శిబిరానికి వెళ్లి తిరిగి వస్తున్న శంభును వెనుక నుంచి కత్తితో పొడిచి చంపేశాడు.

శంభువెనుక వైపు నుండి పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భజరంగ్ దళ్ సభ్యుడి హత్య వార్త వ్యాపించడంతో, వందలాది మంది హిందువులు గుమిగూడి తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హంతకుడు సెలీముద్దీన్ అక్కడి నుంచి పారిపోయినప్పటికీ, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. త‌దుపరి విచారణలు కొనసాగుతున్నాయి.

కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్తపై క‌త్తితో దాడి

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో మ‌రో భజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తితో దాడి జరిగింది. ఈ సంఘటన సోమ‌వారం బీహెచ్ రోడ్డు బస్టాండ్ సమీపంలో జరిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం ఆదివారం జరిగిన ఒక‌ ర్యాలీలో సునీల్, సమీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన సమీర్ సునీల్‌ను కత్తితో పొడిచి దాడి చేశాడు. గాయపడిన కార్యకర్త చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డైంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనను ఖండిస్తూ బజరంగ్ దళ్ ఇప్పుడు బంద్‌కు పిలుపునిచ్చింది. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.