
ఆధ్యాత్మికతే భారత్ కు మూలం. భారతీయ సమాజపు సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మిక చైతన్యంలోనే ఉన్నదని గ్రహించి ఆ జాగృతిని తెచ్చిన హిందూ ధార్మిక యోగి స్వామి వివేకానంద. హిందూ ధార్మిక చైతన్యం ద్వారా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో మార్పును తీసుకురావాలని ఆయన ప్రయత్నించారు. ఆ ప్రయత్నపు ఫలితాలు మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.