Home News బాలగోకులం చిన్నారులు నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

బాలగోకులం చిన్నారులు నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

0
SHARE

మన భారత సైన్యం కార్గిల్ యుద్ధము లో విజయ పతాకం ఎగురవేసి 19 సంవత్సరములు గడిచినవి. ఆ సందర్బంగా  హైదరాబాద్ లోని బాలగోకులం చిన్నారులు ఈ సందర్భముగా భారత్ సైన్యం కి నమసుమాంజలులు తెలుపుతూ  వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

26 జులై కార్గిల్ విజయ్ దివస్ ను అనగా దేశ రక్షణ కోసం శత్రు సైన్యముతో పోరాడి , అసువులు బాసిన మన అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిసున్నారు.

గత రెండు వారాలుగా హైదరాబాద్ బాలగోకులం శిక్షకులు తమ పిల్లలకు ఆ వీరుల నిస్వార్ధ దేశభక్తి ,మన సైనికుల విజయ పరంపరను ,దేశం కోసం వారి ప్రాణాలను సైతం అర్పించిన వారి ఘనతను వివిధ పోటీలు , కధలు  మరియు ప్రసంగముల ద్వారా పిల్లలకు వివరించారు.

నెక్స్ట్ గల్లెరియ మాల్ లో హైదరాబాదు లోని మూడు బాలగోకులాల నుంచి ఎనభై మంది చిన్నారులు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మన వీరులు ఎదుర్కొనే కఠినమైన సమస్యలు ,వారి త్యాగ నిరతి , దేశ భక్తి , వారి ప్రాణత్యాగము అందరికి వివరించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రూప్ కెప్టెన్ జోయదీప్ బనెర్జీ (రిటైర్డ్) విచ్చేసారు .

వీరు IAF లో పని చేసారు. 1992   kargil యుద్దములో జవానులకు , పైలట్ లకు శిక్షణ ఇచ్చారు. వారి అనుభవాలను పిల్లలతో పంచుకున్నారు.యుద్దభూమి లోని పరిస్థితులు , శత్రు సైన్యము తో పోరాటం , ప్రతికూల వాతావరణం మరియు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల కుటుంబాల అనుభవాలను పిల్లలకు వివరించారు.

హైదరాబాద్ లోని పలు బాలగోకులం లలో కార్గిల్ విజయ్ దివస్ ను జరిపి మన అమర వీరులకు నివాళులు అర్పించారు .

ఈ కార్యక్రమానికి పలు రిటైర్డ్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన వారిని పిలిచి సత్కరించి , పిల్లలతో  ముఖాముఖీ మాట్లాడించారు. వారు ప్రసంగిస్తుంటే పిల్లలు ఆసక్తిగా వారి అనుభవాలను విన్నారు .

వారు సర్వీస్ లో MIG 21, MIG 29, Sukhios లను ఎలా నడిపారో వివరిస్తుంటే చిన్న బాలురు చాల సంబర పడ్డారు . పిల్లలు వారిని చాలా ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు .

వీరి ప్రసంగాలు చిన్నారుల ఆలోచన సరళి దేశ రక్షణకు ఉపయోగించేలాగా ప్రభావితం చేసారు.

బాలగోకులం ఎప్పటిలాగే పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దే దిశలో దేశ రక్షణ , సైనికుల త్యాగం , వారి వీర మరణం ,సేవానిరతి , వారి విజయ గాధలను ,చక్కగా వివరించారు .

జై జవాన్ జై హింద్