Home News బాలికపై లైంగిక వేధింపుల కేసులో తెలుగు క్రైస్తవ పాస్టరుకు అమెరికాలో శిక్ష

బాలికపై లైంగిక వేధింపుల కేసులో తెలుగు క్రైస్తవ పాస్టరుకు అమెరికాలో శిక్ష

0
SHARE

తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ మతబోధకుడికి అమెరికాలో జైలుశిక్ష పడింది. ఇటుకలపాటి జాన్ ప్రవీణ్ (38) సౌత్ డకోటా ప్రాంతం ర్యాపిడ్ సిటీ నగరంలోని తమ చర్చికి వచ్చే ఓ 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్టు అక్కడి న్యాయస్థానం నిర్ధారించింది. దీంతో క్రైస్తవ బోధకుడు జాన్ ప్రవీణుకు కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది.

జాన్ ప్రవీణ్ 10 ఏళ్ల ప్రత్యేక ఒప్పందం మీద 2017లో అమెరికాలోని ర్యాపిడ్ సిటీ చర్చిలో మతబోధకుడిగా పనిచేసేందుకు తెలంగాణ వెళ్ళాడు. అయితే, చర్చికి వచ్చే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో అతడిపై కేసు నమోదైంది.

విచారణ సందర్భంగా ప్రవీణ్ కు ఏడాది జైలు విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తి చేయగా, ఆ శిక్ష సరిపోదంటూ న్యాయమూర్తి స్టీఫెన్ మాండల్ ఆరేళ్ల కారాగార శిక్ష విధించారు. అతడు రిమాండ్ లో ఉన్న 178 రోజులు కూడా శిక్షాకాలం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ గురించి మరో నిజం కూడా బయటపడింది. 16 ఏళ్ల అమ్మాయితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్టు ర్యాపిడ్ సిటీ పోలీసులు గుర్తించారు.

తీర్పు పట్ల బాధిత బాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు తమ బాలిక పడిన మనోవేదనకు స్వాంతన చేకూరుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

Source: MattersIndia