Home News బెంగళూరు నగరపాలిక ఆసుపత్రిలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్

బెంగళూరు నగరపాలిక ఆసుపత్రిలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్

0
SHARE

దేశంలో క‌రోనా రెండో ద‌శ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అనేక మంది వైర‌స్ బారిన ప‌డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి స‌మ‌యంలో కూడా కొంత మంది వ్య‌క్తులు ఈ అప‌త్కాలాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. బెంగుళూర్‌లో న‌గ‌ర పాలిక సంస్థ  (బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే – బిబిఎంపి) లో డ‌బ్బులిస్తేనే క‌రోనా బాధితుల‌కు ప‌డ‌కల‌‌ను కేటాయిస్తున్న ఘ‌ట‌నను ఎంపీ తెజ‌స్వీ సూర్య వెలుగులోకి తీసుకొచ్చారు.  కోవిడ్ -19 పాజిటివ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప‌డ‌క‌ల‌ను బిబిఎంపిలోని వార్ రూమ్ అధికారులు, బ‌య‌టి వ్య‌క్తులు, ఏజెన్సీల‌తో క‌లిసి డ‌బ్బులు తీసుకుని ప‌డ‌క‌ల‌ను కేటాయిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

ఒక బెడ్ కోసం రూ. 50 వేలు వసూలు చేస్తూ బెంగళూరులో ఇప్ప‌టి వ‌ర‌కు 4065 పడకలపై అక్రమంగా డ‌బ్బులు వ‌సూలు చేసినట్టు ఆయ‌న తెలిపారు. ఈ మేర‌కు ఎంపీ సూర్య, ఎమ్మెల్యేలు ఉదయ్ గరుడచార్, సతీష్ రెడ్డిలతో కలిసి బిబిఎంపి వార్ రూంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై సంబంధిత అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ఒక‌ రోగి డిశ్చార్జ్ అయిన 30 సెకన్లలోనే కొత్త రోగిని ఎలా చేర్చుకోగలిగార‌ని పౌర సంస్థ అధికారులను సూర్య

ఈ ఘ‌ట‌న‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పందిస్తూ ఇటువంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపై వేగంగా చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి రోహిత్, నేత్రా అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం సిసిబికి అప్పగించినట్లు చెప్పారు. వారిపై  ఐపిసి సెక్షన్ 420, 384 కింద కేసు నమోదు చేశారు.  పోలీసులు వారి బ్యాంకు ఖాతాల నుండి రూ .1,05,000 స్వాధీనం చేసుకున్నారు.

Source  : OPINIDA

DONATE HEREమా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ లింక్ ద్వారా మీ విరాళాలను  అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది.