
అతి చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి గడగడలాడించిన యువకులు…భూమి భారతికి స్వాతంత్రాన్ని అందించడమే తమ జీవిత లక్ష్యమని చాటిచెప్పి పోరాడిన యోధులు…యువతకు స్పూర్తి ప్రధాతలు..భగత్ సింగ్, సుఖ్ దేవ్. రాజ్ గురు లు. మార్చి 23న వారు ఉరికంబాన్ని ముద్దాడిన రోజు. అందుకే ఈరోజును ప్రతిసంవత్సరం షహీద్ దివస్ గా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను స్మరించుకుంటున్నాం.