Home News భారత పునర్నిర్మాణ ప్రక్రియలో ఆరెస్సెస్ ఉద్యమ పాత్ర – జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్

భారత పునర్నిర్మాణ ప్రక్రియలో ఆరెస్సెస్ ఉద్యమ పాత్ర – జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్

0
SHARE

భారత పునర్నిర్మాణ ప్రక్రియలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఉద్యమ పాత్ర పోషిస్తోందని జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్ పేర్కొన్నారు. వాల్టర్ తన భారత పర్యటనలో భాగంగా నాగపూరులోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సరసంఘచాలక్ మోహన్ జీ భగవత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

ఈ విషయమై  కొద్దిమంది చేసిన విమర్శలపై కూడా వాల్టర్ స్పందించారు. ‘ది హిందూ’ పత్రికతో మాట్లాడుతూ.. “నాగపూర్ నగరంలో జర్మనీ భాగస్వామ్య సహకారంతో నిర్మితమవుతున్న మెట్రో ప్రాజెక్ట్ పరిశీలించాలని అనుకున్నానని, అదే విధంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థ గురించి కూడా తెలుసుకోవడానికి మోహన్ జీ భగవత్ ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆరెస్సెస్ గురించి ఎన్నో రకాల వ్యాసాలు, కధనాలు చదివానని, అందులో కొన్ని నకారాత్మకంగా, కొన్ని సకారాత్మకంగానూ ఉన్నాయని, కాబట్టి ఈ అంశంపై నేరుగా ఈ సంస్థ గురించి తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు.

సరసంఘచాలక్ తో తన భేటీ సందర్భంగా అతివాదాన్ని గురించి అనేక ప్రశ్నలు వేశానని, వాటికి చాలా వివరణాత్మక సమాధానాలు లభించాయని అన్నారు. అనేక  జాతులు కలగలిసిన ఈ దేశపు పునర్నిర్మాణ ప్రక్రియలో ఆరెస్సెస్ పాత్ర కీలకం అని, ఎవరికి  నచ్చినా, నచ్చకపోయినా ఇది ఒక ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. 

Source: VSK Bharat