రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2019, గ్వాలియర్ తీర్మానం -1
భారతీయ కుటుంబ వ్యవస్థ – మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం. కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది