Home News భారతీయ సమాజంలో అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ కుట్ర

భారతీయ సమాజంలో అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ కుట్ర

0
SHARE

ప్రస్తుత మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో ఒక తరహా సంఘటనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇక దానిని ఆధారం చేసుకుని సెక్యులరిస్ట్ లు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై దాడి ప్రారంభిస్తారు. ఏదో ఒక మూల క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. వెంటనే వీరంతా ఆ వర్గంపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడతారు. ప్రభుత్వం ఆ సంఘటన గురించి పూర్వాపరాలు తెలుసుకుని, ప్రజలకు చెప్పేలోగానే వీళ్ళు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు. అయితే వీరు ఇలా వ్యవహరించడం పాకిస్థాన్ పన్నిన కుట్రలో ఇది భాగమని అంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.

హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతీయుడైన కులభూషన్ యాదవ్ కేసు విచారణ జరుగుతోంది. కులభూషన్ తమ దేశంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్న పాకిస్థాన్ అతనికి ఉరి శిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ భారత్ దాఖలు చేసిన అప్పీల్ పై న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే కులభూషన్ పై నేరారోపణ చేసేందుకు వీలుగా భారతీయ మీడియాలోనే కధనాలు సృష్టించింది పాకిస్థాన్. 2017లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కరణ్ థాపర్ వ్రాసిన వ్యాసం, 2018లో ప్రవీణ్ శర్మ ఫ్రంట్ లైన్ కధనం, క్వింట్ లో చందన్ నంది కధనాలను ఇప్పుడు సాక్ష్యంగా చూపిస్తోంది. పాకిస్థాన్ కుట్రలో ఇది కూడా ఒక భాగం.

పాకిస్థాన్ 2016 కుట్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనిని 2016లో పాకిస్థాన్ ఎగువ సభకు చెందిన కమిటీ ఒకటి రచించింది. విధాన మార్గదర్శక ప్రణాళిక తయారీలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్, రక్షణ కార్యదర్శి, ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ తో పాటు 13మంది ఎంపి లు పాల్గొన్నారు. దీనిని 4 అక్టోబర్ , 2016లో ఆమోదించారు.

 

పాకిస్థాన్ పట్ల కఠినమైన వైఖరి అవలంబిస్తున్న మోదీని తొలగించడానికి లేదా ఎదుర్కోవడానికి అమలుచేయాల్సిన 22 సూత్రాల ప్రణాళికను ఈ కమిటీ తయారుచేసింది. కాశ్మీర్ విషయమై భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై ప్రచారం సాగించడం కోసం అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందంటూ పదేపదే ఆరోపణలు చేయాలని ఆ కమిటీ సూచించింది.

ఈ ప్రణాళిక చాలా ప్రమాదకరమైనది. సమాజంలో విభేదాలు సృష్టించడం ఇందులో ప్రధాన అంశం. అంటే జాతి, మతం మొదలైనవాటి ఆధారంగా ఘర్షణలు సృష్టించడం. హిందూత్వం, ఆర్.ఎస్.ఎస్ పేరు చెప్పి క్రైస్తవులు, ముస్లిములు, దళితుల్లో భయాందోళనలు కలిగించడం. దీని కోసం మోదీ వ్యతిరేక మీడియా, మానవహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలన్నది ఆ ప్రణాళికలో భాగం.

ఈ ప్రణాళికను పాకిస్థాన్ ఇప్పటికే అమలులో పెట్టినట్లు కనిపిస్తోంది. క్రైస్తవులు, ముస్లింలు, దళితుల పై దాడులు జరిపి, అవన్నీ మోదీ ప్రభుత్వం వల్లనే జరుగుతున్నాయని చిత్రీకరించే ప్రయత్నం ఇప్పటికే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వర్గాలలో హిందూత్వం, ఆర్ ఎస్ ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఏదో చిన్న సంఘటనను ఆధారం చేసుకుని మీడియా, మేధావి వర్గం, కొన్ని పార్టీలు హిందూత్వం, ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాయో ఇప్పుడు అర్ధమవుతుంది. తన కుట్రపూరిత ప్రణాళికను అమలులో పెట్టే పనిని పాకిస్థాన్ అంతర్జాతీయ సంస్థలకు అప్పగించింది. అలా ఏ సంస్థల ద్వారా పని జరిపించాలన్నది కూడా ఎంపీ కమిటీ నిర్ధారించింది.

పాకిస్థాన్ సెనేట్ కమిటీ రిపోర్ట్ ప్రకారం సాగుతున్న ఈ కుట్ర వివరాలు ఇప్పుడు క్రమంగా సామాన్య ప్రజానీకానికి కూడా అర్ధమవుతున్నాయి. దేశంలో చిన్నచిన్న కారణాలకే పెద్ద ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుస్తోంది. ఎవరి కోసం దేశంలో కొందరు ఈ ఆందోళనలు చేస్తున్నారో స్పష్టమవుతోంది.

ఇస్లామాబాద్ లో 2016లో జరగాల్సిన సార్క్ సమావేశాలకు హాజరు కాలేమంటూ బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక స్పష్టం చేయడంపై విచారాన్ని వ్యక్తం చేసిన పాకిస్థాన్ టర్కీ, ఇరాన్, చైనాలతో కూడిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ కు మాత్రం మద్దతు ప్రకటించింది. ఇది కూడా 2016 ప్రణాళికలో భాగమే.

6జనవరి, 2016న పాకిస్థాన్ విదేశాంగ విభాగపు అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ట్వీట్ చేస్తూ కులభూషన్ యాదవ్ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారని నిరూపించడానికి సాక్ష్యంగా క్వింట్ లో ప్రచురితమైన కధనాన్ని చూపారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్నా విచారణలో కూడా పాకిస్థాన్ తరఫు న్యాయవాది ఇదే కధనాన్ని ఆధారంగా చూపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక క్వింట్ పాత్ర ఏమిటన్నది పరిశీలించవలసిన విషయం.