దేశ వ్యాప్తంగా తెలంగాణ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యానంగా తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరిగా సాగిన జరిగిన ఓట్ల లెక్కింపులో చివరికి 1079 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి ఎం రఘునందర్‌రావు విజయం సాధించి దుబ్బాక ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. దుబ్బాకలో మొత్తం పొలైన ఓట్లు 16,4669 కాగా బిజెపీ అభ్యర్థికి 63352 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 62273 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితం హైదరాబాద్ లో జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
దేశం మొత్తం 11 రాష్ట్రాల్లో 59 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. మధ్య ప్రదేశ్‌లో 29 స్థానాలకు గాను బిజెపి అత్యధికంగా 19 స్థానాలు గెలుచుకుంది. దీంతో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం పడిపోయే ముప్పు తప్పింది. గుజరాత్‌లో 8స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం బిజెపి నే గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 7 స్థానాలకు గాను ఆరింటిని బిజెపి తన ఖాతాలో వేసుకుంది. కర్ణాటకలో రెండింటికి రెండూ బిజెపినే గెలిచింది. మణిపూర్‌లో 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. మొత్తంగా 59 స్థానాలకు నిర్వహించిన ఉపఎన్నికల్లో 40 స్థానాల్లో బీజేపీ పార్టీ సత్తా చాటింది.
మరో వైపు బీహర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా బిజెపి , జెడీయూలతో కూడిన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలున్న బీహర్‌లో బీజేపీ, జేడీయూ కలిసి పోటి చేసిన ఎన్డీఏ కూటమి 124స్థానాలు కైవసం చేసుకుని అధికారాన్నిసాధించింది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.